పుదుచ్చేరిలో బీజేపీని గెలిపిస్తే, ప్రత్యేకహోదా ఇస్తామని కేంద్రంచెప్పిందని, ఏపీకి మాత్రం ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమనిచెప్పినా ముఖ్యమంత్రి బీజేపీ ని, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదని టీడీపీ అధికా రప్రతినిధి సయ్యద్ రపీ నిలదీశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరు లతోమాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ అవకాశవాది కాబట్టి, విద్యార్థులను, యువతను మోసగిస్తూ, హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడంలేదన్నారు. అక్కడి నాయకుడైన మల్లాది కృష్ణారావును గెలిపించాలని వైసీపీనేతలైన పిల్లిసుభాష్ చంద్రబోస్ మరికొందరు ప్రచారంచేస్తున్నా రని, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి జగన్మోహ న్ రెడ్డి డబ్బుసంచులు పంపాడని రఫీ ఆరోపించారు. పుదుచ్చేరిలో కృష్ణారావుని గెలిపించాలనికోరడం ద్వారా జగన్ ప్రభుత్వం బాహటంగానే బీజేపీకి మద్ధతిస్తోంద న్నారు. బీజేపీకి, జగన్ కుఉన్న అక్రమ సంబంధం పు దుచ్చేరి ఘటనతో బట్టబయలైందన్నారు. పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్రాన్ని ప్రశ్నించని ముఖ్యమంత్రి, అక్కడ బీజేపీవారికి కొమ్ముకాయడ మేంటని రఫీ ప్రశ్నించారు. బీజేపీతో సఖ్యతగాఉంటే, తన కేసులనుంచి తాను బయటపడవచ్చన్నదే జగన్ ఆలోచన అని, అందుకే ఆయన కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమైతే, పుదుచ్చేరికి ఎలాఇస్తారని ముఖ్యమంత్రి ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు? ప్రత్యేకహోదాతో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని, ప్రతిజిల్లా హైదరా బాద్ అవుతుందని, 22మందిఎంపీలను ఇస్తే సాధిస్తాన ని గతంలో ఊదరగొట్టిన జగన్, రాష్ట్రాన్నివంచించిన బీజే పీకి మద్ధతుఎలా తెలుపుతున్నాడో ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

bjp 010542021 2

తనఅవినీతి కేసులకోసమే ముఖ్యమంత్రి ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టాడ న్నారు. ఎన్నికల్లో గెలవడంకోసంఏమైనాచేయడం, ఏది పడితే అదిచెప్పడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిం దన్నారు. టీడీపీప్రభుత్వంలో కేంద్రంరాష్ట్రానికి ఇస్తామ న్న నిధులనుకూడా జగన్ సాధించలేకపోయాడన్నా రు. హోదాఇవ్వకపోయినా, వెనుకబడిన జిల్లాలకు, అమరావతికి నిధులివ్వకపోయినా, రైల్వేజోన్ అటకె క్కించినా, విశాఖస్టీల్ ను అమ్మేస్తున్నాముఖ్యమంత్రి ఎందుకు నోరెత్తడంలేదన్నారు. తనప్రయోజనాలు, తన పై ఉన్నకేసులకోసమే, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని రఫీ మండిపడ్డారు. పుదుచ్చేరిలో గతంలో ఉన్న నారాయణస్వామి ప్రభుత్వాన్నికూలదోయడానికి జగన్మోహన్ రెడ్డే సహకరించాడని, ఇప్పుడేమో బీజేపీకి మద్ధతిస్తూ, తన ప్రయోజనాలను కాపాడుకుంటున్నా డన్నారు. ఇతరరాష్ట్రాల్లోని ప్రభుత్వాలను పడగొట్టడా నికి డబ్బులు పంపాల్సిన అవసరం ఈముఖ్యమంత్రికి ఎందుకొచ్చిందన్నారు? తిరుపతి ఉపఎన్నికలో జగన్మో హన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపుతామని, బీజేపీతో, ముఖ్యమంత్రికున్న లోపాయికారీ ఒప్పందాలను కూడా ఎండగడతామని రఫీ స్పష్టంచేశారు. గతంలో రాజీనా మాలతో దేశమంతా రాష్ట్రంవైపుచూసేలా చేస్తానన్న జగన్, ఇప్పుడు తనపార్టీఎంపీలతో ఎందుకుఆపని చేయించడంలేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి మరోఎంపీని గెలిపించినా, ఈరాష్ట్రానికి ఏమీ ఒరగదనే వాస్తవాన్ని తిరుపతిపార్లమెంట్ లోని ప్రజలు గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి మౌనం రాష్ట్రానికి శాపంగా మారిందని, వైసీపీప్రభుత్వ వికృత రాజకీయక్రీడను రాష్ట్రవాసులు గమనించాలన్నారు.

అధికార వైసిపీ చేస్తున్న అరాచకాలకు నిరసనగా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, ఎన్నికలు బహిష్కరిస్తుంది అంటూ, మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమ కొమ్ములు విరిచిన నిమ్మగడ్డ ఉన్నప్పుడే రెచ్చిపోయిన వైసిపీ , ఇప్పుడు తమకు అనుకూలంగా ఉన్న అధికారి ఉంటే, ఎన్నికలు ఎలా జరుగుతాయో అర్ధమవుతుందని, అందుకే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలు బహిష్కరించే ఆలోచనలో ఉంది అంటూ, వస్తున్న వార్తల పై, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యులు అచ్చెన్నాయుడు స్పందించారు. ఎన్నికల బహిష్కరణ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్నికల కమిషన్ కొత్త నోటిఫికేషన్ ఇస్తుందని ఆశిస్తున్నామని, రేపు ఎన్నికల కమిషన్ తో జరిగే ఆల్ పార్టీ మీటింగ్ లో ఇదే చెప్తాం అని, ఎప్పుడో ఏడాది క్రిందట, అదీ దౌర్జన్యాలు చేసి చేసుకున్న ఏకగ్రీవాల విషయంలో స్పష్టత కోసం చూస్తామని, ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్మాణం ప్రకారం, తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఇక మధ్యానం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎన్నికల సంఘానికి లేఖ రాసారు వర్ల రామయ్య. ఎంపిటీసి, జెడ్.పి.టి.సి ఎన్నికలకు మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

achemnaidu 01042021 2

2020 మార్చి లో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఎంపిటీసిలలో 24 శాతం, జెడ్.పి.టి.సి లలో 19 శాతం బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుని వైసీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడిందని లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గత ఎన్నికల కమీషనర్ కేంద్ర హోం సెక్రటరీకి సైతం లేఖ రాశారని తెలిపారు. కొంత మంది పోలీసులతో అధికార పార్టీ కుమ్మక్కై బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. పోలీసులే పోటీదారుల చేత బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపజేశారు. వైసీపీ బెదిరింపులు, దా-డు-లు, దౌర్జన్యాలకు పాల్పడింది. నిజమైన ప్రజాస్వామ్యమంటే ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ పోటీదారుడికి, అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలి. కానీ, గత మార్చిలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో వైసీపీ దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది. ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని కాపాడాలంటే ఎం.పీ.టి.సీ జెడ్.పి.టీ.సీ లకు కొత్త నోటిఫికేషన్ జారీచేచేసి, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని వర్లరామయ్య ఎన్నికల సంఘాన్ని కోరారు.

విశాఖపట్నం నగరంలోని ప్యూజన్ ఫుడ్స్ సంస్థను ఖాళీ చేయించిన వ్యవహారంలో అధికారుల తీరును హైకోర్టు తప్పు పట్టింది. ఆదివారం సెలవు రోజున ఎలా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించింది. ముందు రోజు నోటీస్ ఇచ్చి మరుసటి రోజు ఆదివారం అయినప్పటికీ పోలీస్ బలగాలను ఉపయోగించటం అన్యాయమని స్పష్టం చేసింది. ఖాళీ చేయించన స్థలాన్ని పూజన్ ఫుడ్స్ సంస్థకు అప్పగించాలని వీఎంఆర్డీఏ (విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ)ని ఆదేశించింది. లీజు గడువు ముగియక ముందే ఖాళీ చేయించటాన్ని సవాల్ చేస్తూ సంస్థయాజమాన్యం గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణ జరిపారు. ప్రాంగణాన్ని ఖాళీ చేసేందుకు తగిన వ్యవధి ఇవ్వకపోవటాన్ని ఆక్షేపించారు. ఈజ్ మెంట్ చట్ట నిబంధనల ప్రకారం లీజుదారు ఓ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటే అందుకు తగిన వ్యవధి ఇవ్వాల్సి ఉందన్నారు. సెలవు రోజులు, ఆదివారాల్లో ఖాళీ చేయించరాదని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినందుకు గాను పాతికవేల రూపాయలు ఖర్చుల కింద చెల్లించాలని ఖాళీ చేయించిన ప్రాంగణాన్ని తిరిగి అప్పగించాలని జసిస్ సోమయాజులు తీర్పునిచ్చారు.

fusion 01042021 2

ఇక తీర్పులోని ముఖ్య అంశాలు చూస్తే, 2024 వారలు లైసెన్స్ ఉందని చెప్తున్నారు కానీ, ఎక్కడా పిటీషనర్ విరుద్ధంగా వ్యవహరించారని రుజువు చేయలేక పోయారు కదా అని కోర్టు ప్రశ్నించింది. ఎక్కడా అద్దె చెల్లించకపోవటం లేదు కదా. ఒప్పందం ఉల్లంఘించలేదు కదా అని కోర్టు ప్రశ్నించింది. అసలు ఒక్క రోజులో ఖాళీ చేయమని నోటీసు ఇవ్వటం, తరువాత రోజు బలగాలు తీసుకుని, 11 లారీల్లో అక్కడకు వెళ్ళటం చూస్తుంటే, అంతా ప్లాన్ ప్రకారం చేసినట్టు అర్ధమవుతుందని కోర్టు పేర్కొంది. ఇక అసలు పోలీసులను తీసుకుని వెళ్లి ఎందుకు ఖాళీ చేయించాల్సి వచ్చింది, సామాన్యులు పోలీసులును చూస్తే భయపడి పోతారు అనే కదా, అని కోర్టు ప్రశ్నించింది. ఎందుకు బయటకు నెట్టారు, అంత కారణం ఏముందో మాకు కనపడటం లేదని కోర్టు పేర్కొంది. మొత్తంగా, ఈ చర్యను తప్పు బడుతూ, పాతికవేల రూపాయలు జరిమానా విధించింది. అయితే గతంలో దీన్ని రచ్చ రచ్చ చేసిన వైసీపీ నేతలు, సోషల్ మీడియా, ఇప్పుడు మాత్రం, మౌనంగా ఉన్నారు...

హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్ పై సీబీఐ ప్రాథమిక విచారణ పూర్తిచేసి హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారం మొత్తంగా అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థలు ఉన్నందున పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు కొంత వ్యవధి పడుతుందని కోర్టుకు వివరించింది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు పలు తీర్పువెలువరించిన తరువాత న్యాయవ్యవస, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వ్యాఖ్యానాలు చేస్తూ పోస్టింగ్లు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు వ్యతిరేకంగా, నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకరను పోలీస్ కస్టడీకి తీసుకున్న అంశంపై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో కూడా న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థపై ఫేస్ బుక్, వాట్సాప్, ఉతర సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను, కోర్టులను టార్గెట్ చేస్తూ పోస్టింగ్లు వచ్చాయి.. వీటిపై విచారణ జరపాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గతంలో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అప్పట్లో సీఐడీ అధికారులు పలువురిపై కేసులు నమోదు చేశారు. అయితే దర్యాప్తలో పురోగతి లేనందున సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి వాటి నుంచి వివరాలు తీసుకోవటంలో సీఐడీ అధికారులు విఫలమయ్యారంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసారు.

cbi 01042021 2

దీనిపై విచారణ జరిపిన కోర్టు గత ఏడాది అక్టోబర్ 12న సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బార్బీ, జస్టిస్ గంగారావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. సీబీఐ తరుపు న్యాయవాది చెన్నకేశవులు ప్రాథమిక విచారణ నివేదిక సీల్డ్ కవర్‌లో కోర్టు ముందుంచి వాదనలు వినిపించారు. సీబీఐ పూర్తి స్తాయిలో దర్యాప్త జరపాలంటే మరికొంత వ్యవధి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. సీబీఐ నివేదికను కేసు రికార్డుల్లో చేర్చాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను జూన్ 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ కేసు పై సిబిఐ విచారణలో ఏమి ఉంది ? అసలు దీని వెనుక నిజంగానే ఒక పార్టీ కుట్ర ఉందా ? ఎవరు దీని వెనుక ఉన్నారు ? ప్రజాప్రతినిధులు కూడా చేసిన కామెంట్స్, ఏ కోణంలో విచారణ చేసారు. మరి ఇవన్నీ తెలియాలి అంటే, కోర్టు ముందు ఏ నివేదిక ఉందో చూడాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read