చంద్రబాబునాయుడుగారు ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి, ఎన్నికల ప్రక్రియలో జరిగిన ఘోరాలు, నేరాలను, వైసీపీ ప్రభుత్వం సాగించిన అరాచకాలను ప్రజలకు తెలియచేయడానికి తిరుపతికి వెళ్లారని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. రేణిగుంట విమానాశ్రయంలో మంచినీళ్లు కూడా తాగకుండా, 70ఏళ్ల వయస్సులో చంద్రబాబునాయుడు నిరసనదీక్ష చేపడితే, దానిపై వైసీపీనేతలు వక్రభాష్యాలు చెప్పడం దారుణ మన్నారు. చంద్రబాబు నాయుడి దీక్షచూశాక జగన్ గంగవెర్రులెత్తి పోయాడని, ప్రతిపక్షనాయకుడికి ప్రజల్లో ప్రతిష్ట పెరుగుతుందన్న అక్కసుతో సజ్జలను, మంత్రిపెద్దిరెడ్డిని, అబద్ధాల రాంబాబుని ముఖ్యమంత్రి మీడియాముందుకు పంపాడని రఫీ ఎద్దేవాచేశారు. ప్రతిపక్షనాయకుడి నిరసనదీక్షపై ముఖ్యమంత్రి మీడియా ముందుకొచ్చి ఎందుకు సమాధానం చెప్పడంలేదన్నరఫీ, కనీసం ఆయన రికార్డెడ్ ప్రెస్ మీట్ కూడా ఎందుకు నిర్వహించలేదన్నారు? విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానంచెప్పలేకే జగన్ బయటకు రాలేదన్నారు. చంద్రబాబునాయుడు మహాత్మాగాంధీ విలువల్ని, ఆశయాలను అమలుచేసే వ్యక్తేననే వాస్తవాన్ని మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రహించా లన్నారు. ఆనాడు మహాత్మాగాంధీని శ్వేతజాతీయులు, దక్షిణాఫ్రికాలో ఎలాగైతే రైల్లోంచితోశేశారో, నేడు వైసీపీప్రభుత్వంకూడా ఆంధ్రా మహాత్ముడైన చంద్రబాబు నాయుడిని అదేవిధంగా తిరుపతికి వెళ్లకుండా అడ్డుకుందన్నారు. బ్రిటీషువారికన్నా దారుణంగా వ్యవహరిస్తున్న వైసీపీప్రభుత్వానికి, ప్రజాస్వామ్య విలువల గురించి తెలియచేయడానికే నేడు చంద్రబాబునాయుడు రేణిగుంట విమానాశ్రయంలో నేలపై కూర్చున్నాడని రఫీ తెలిపారు. వైసీపీనేత జగన్ లా దొంగదీక్షలు, మోసపు పాదయాత్రలు చేయడం చంద్రబాబుకిచేతకాదన్నారు.

మహాత్మాగాంధీ చూపినబాటలో,ఆయన చూపినమార్గంలోనే వైసీపీ ప్రభుత్వ హింసా రాజ కీయాలకువ్యతిరేకంగా చంద్రబాబు నిరసనదీక్ష చేపట్టాడన్నారు. చంద్రబా బు దీక్షను చూసి ఓర్వలేకే, వైసీపీప్రభుత్వం గగ్గోలుపెడుతోందన్నారు. చంద్రబాబునాయుడు శాంతియుతంగా గాంధీవిగ్రహం వద్ద నిరసన తెలుపు తానంటే అడ్డుకున్న పోలీసులు, ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు, రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తున్న వైసీపీవారిని ఎందుకు అడ్డుకోరని రఫీ ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు ప్రతిపక్షం వారికే వర్తిస్తాయా అని ఆయన ప్రశ్నించారు. పోలీస్ రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుంటున్న వైసీపీవారికి , నేడు ఎస్ఈసీ చర్యలు ప్రజాస్వామ్యబద్ధంగా కనిపించడం సిగ్గుచేటన్నారు. గతంలో ఎస్ఈసీ నిర్వహించిన అఖిలపక్షసమావేశానికి హాజరుకాని వైసీపీవారు, నేడు ఒక్కరిని పిలిస్తే,ఇద్దరెందుకు వెళ్లారని టీడీపీనేత నిలదీశారు. వైసీపీ వారితో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కుమ్మక్కయ్యాడుకాబట్టే, వారికి ఆయన పై ఎనలేని ప్రేమపుట్టుకొచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలు, అధికారపార్టీ వారి అరాచకాలపై టీడీపీ 200లకు పైగా ఫిర్యాదులను ఎస్ఈసీకి అందిస్తే, ఆయన వారిపై ఏంచర్యలు తీసుకున్నాడన్నారు. ఒక్కఅధికారిపైనగానీ, ఒక్క కానిస్టేబుల్ పై గానీ ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకున్న దాఖ లాలు లేవన్నారు. కొడాలినానీపై కేసునమోదుచేయాలన్న ఎస్ఈసీ ఆదేశాలను, కృష్ణాజిల్లా ఎస్పీ అమలుచేయకపోయినా, నిమ్మగడ్డ దానిపై ఎందుకు మాట్లాడటంలేదన్నారు? వైసీపీవారితో ఎస్ఈసీ కుమ్మక్కయ్యా డు కాబట్టే, వైసీపీప్రభుత్వఆధ్వర్యయంలో ఎన్నికల్లో జరిగే అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

గెలిచినవారిని ఓడినట్టు, ఓడినవారిని గెలిచినట్టు చూపించి, పోలీసులను, అధికారులను అడ్డుపెట్టుకొని వైసీపీ వారు ఎన్నిదారుణాలుచేసినా, వారికి అంతతేలిగ్గా గెలుపు సాధ్యం కావడం లేదన్నారు. చంద్రబాబునాయుడు తిరుపతిలో 5వేలమందితో సభ నిర్వ హిస్తాడని వైసీపీవారే ఊహించుకొని, వారికివారే తప్పుడు మార్గంలో ప్రతి పక్షనేతను అడ్డుకున్నారని రఫీ మండిపడ్డారు. తెలుగుదేశంపార్టీ ఎక్కడా కూడా 5వేలమందితో ధర్నాచేస్తున్నట్లు చెప్పలేదన్నారు. నేడు చంద్రబాబునాయుడి గారి విషయంలో, వైసీపీ ప్రభుత్వం సాగించిన దౌర్జన్యకాండను ప్రజలంతా గమనించారని, ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాల కు భయపడే, మున్సిపల్ బరిలో పోటీలోనిలిచిన అభ్యర్థులను ఇతరరాష్ట్రాల్లో దాచేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. జగన్ హాయాంలో ప్రజాస్వామ్యం ఎంతలా మంటగలిసిందో ప్రజలకు అర్థమైందన్నారు. జగన్ తీరుని చూసి అతను ముఖ్యమంత్రేనా అనిరాష్ట్రమంతా అనుకుంటోందన్నా రు. వాలంటీర్లకు ఎన్నికల్లో పనికల్పించాలని ప్రభుత్వం కోరడం, దానిపై కోర్టుకెళ్లడం దారుణమన్నారు. జడ్జీలను,కోర్టులను నమ్మని వైసీపీప్రభు త్వం, వైసీపీనేతలు వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవడాని కి న్యాయస్థానాలకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. మహిళలకు రక్షణకల్పించ లేని దుస్థితిలో జగన్ ప్రభుత్వముందన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు దానిగురించి మాట్లాడటం లేదని రఫీ నిలదీశారు. చంద్రబాబునాయుడు నేడు చేసిన నిరసనదీక్షకు, వైసీపీప్రభుత్వం కచ్చితంగా మూల్యంచెల్లించుకొని తీరుతుందన్నారు. చంద్రబాబు నాయుడు మంచినీరు తాగలేదని వైసీపీవారు పైశాచిక ఆనందం పొందితే పొందొచ్చుగానీ, ప్రజలు రోడ్లపైకి వచ్చిననాడు, వైసీపీ ప్రభుత్వాన్ని కాపాడటం పోలీసులవల్లకూడా కాదన్నారు. చంద్రబాబునాయుడి విష యంలో ప్రభుత్వంప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుంటే, ప్రజాగ్రహానికి గురికాకతప్పదని రఫీ తీవ్రస్వరంతో హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read