గత నెలలో ఉద్యోగులకు జీతాలు లేట్ అయ్యాయి. ప్రతి నెల అలాగే ఉంది అనుకోండి. జూన్ నెలలో జీతలో, జూలై 1 వ తేదీన పడక పోవటంతో, చంద్రబాబు బడ్జెట్ ఆమోదం చెయ్యకుండా, శాసనమండలిలో అడ్డుకున్నారని, అందుకే బిల్ అప్రోవ్ కాలేదు కాబట్టి, జీతాలు ఇవ్వలేకపోయాం అని వైసిపీ నేతలు చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వనివ్వకుండా, చంద్రబాబు గేం ఆడారు అంటూ, చంద్రబాబుని దోషిగా చూపించే ప్రయత్నం చేసారు. అయితే గత ఏడాదిగా ఇదే కొనసాగుతుంది. రెండు మూడు నెలలు తప్పితే, ప్రతి నేలా మొదటి 5-6 రోజులకు కానీ జీతాలు పడటం లేదు. అలాగే ఈ నెల ఇప్పటికీ జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు పడలేదు. శనివారం బక్రీద్ అని, అందుకే జీతాలు రాలేదని, ఈ రోజు ఆదివారం అని చెప్తున్నారు. అయితే, సోమవారం జీతాలు వస్తాయా అంటే, అదీ డౌట్ అనే చెప్పాలి. ఈ రోజు పత్రికల్లో, వార్తా చానెల్స్ లో వచ్చిన కధనాలు ప్రకారం, జీతాలకు డబ్బు సమీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.

మంగళవారం, ఆర్బీఐ బాండ్ల‌ను వేలం వేసే ప్రాసెస్ లో, ఒక రెండు వేల కోట్లు వరకు సమీకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అవి వస్తే, అప్పుడు జీతాలు పడే అవకాసం ఉన్నట్టు ఆ కధనం సారాంశం. ఈ వేలం ప్రక్రియ పూర్తయ్యి, జీతాలు రావాలి అంటే, 5 వ తేదీ వరకు ఆగాల్సిందే. మరి అప్పటి వరకు, జీతాలు రావా ? ఈ కధనం పై అయితే, అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారంలో ఉన్న వైసిపీ కానీ, ఇప్పటి వరకు ఏమి స్పందించలేదు. కొంత మంది మాత్రం, ఈ రెండు రోజులు సెలవు కావటంతో లేట్ అయ్యిందని, ఒకటి రెండు రోజుల్లో చెల్లిస్తాం అని చెప్తున్నారు. అయితే గత నెలలో జీతాలు వచ్చే సరికి 8వ తేదీ అయ్యింది. అప్పట్లో దానికి కారణం చంద్రబాబు అంటూ, ఆయన మీద ప్రచారం చేసి తప్పించుకున్నారు. మరి ఈ నెల ఎవరి పేరు చెప్తారో చూడాలి. అయితే గత రెండు నెలల్లో 29 వేల కోట్లు అప్పు చేసారని కాగ్ రిపోర్ట్ చెప్తుంది. మరి ఈ డబ్బు అంతా ఏమైంది, అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. మరి ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read