రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య మధ్య వాగ్వాదం జరిగింది. అయితే వర్ల రామయ్య జోక్యం చేసుకోవటం పై నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతే కాకుండా, వర్ల రామయ్యను బయటకు పంపాలని సెక్యూరిటీకి నిమ్మగడ్డ ఆదేశాలు ఇచ్చారు. తననెలా బయటకు పంపుతారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే సమావేశం మధ్యలో జోక్యం చేసుకోవద్దు అంటూ అధికారులు చెప్పటంతో, వివాదం సద్దుమణిగింది. అయితే జరిగిన ఘటన పై, సోమవారం వర్ల రామయ్య మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే "పంచాయతీఎన్నికల్లో ఒకనియోజకవర్గంలోనే 85గ్రామాలు ఏకగ్రీవ మైతే, ఎలా జరిగిందని డీజీపీ చిత్తూరు ఎస్పీని ఎందుకుప్రశ్నించలే దు? 2013లో జరిగిన స్థానికఎన్నికల్లో ఆస్థాయిలోఎందుకు ఏకగ్రీవాలు జరగలేదు? అవినీతిపరుడు, నేరచరిత్ర ఉన్నవ్యక్తి 85 గ్రామాలు ఏకగ్రీవంచేసుకుంటే, అధికారవర్గానికి చీమకుట్టినట్టయి నా లేదు. అక్కడున్న కలెక్టర్, ఎస్పీ ఏంచేస్తున్నారు? చంద్రబాబు నాయుడుని వేధించడమేనా అక్కడి అధికారుల పని? ప్రతిపక్షాల ను ఇబ్బందిపెట్టడమేనా వారికర్తవ్యం? చంద్రబాబునాయుడి గారి నిర్బంధంపై జగన్ దగ్గర సమాధానం లేదు."

"చట్టబద్దంగా, న్యాయ బద్ధంగా ఆయన ఏమీచెప్పలేని స్థితిలో ఉన్నారు. పోలీస్ వ్యవస్థను దాసోహం చేసుకొని జగన్ ఆడుతున్న కుటిలనాటకం, ఆయన ఆడుతున్న రాక్షసక్రీడలోభాగంగానే చంద్రబాబును నేలపై కూర్చోబె ట్టారు . ఆయననేలపైకూర్చుంటే రాష్ట్రానికి, రాష్ట్రప్రజలకు నష్టం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాజ్యాంగవ్యతిరేక వ్యవహారాలకు, అరాచకాలకు, దౌర్జన్యాలకు వాడుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం సరైందికాదు. చంద్రబాబునాయుడిని నిర్బంధించి, చిత్తూరు, తిరుపతి వెళ్లకుండా అడ్డుకోగలరు కానీ, ఆయన ఆలోచనలను, ఆశయాలను ఆపగలరా? ఆయన్ని నిర్బంధించారనే వార్త రాష్ట్ర మంతా దావానలంలా వ్యాపించింది. ఎటుపోతోంది ఈ దుర్మార్గపు వ్యవస్థ? పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై మీరు స్పందించాలని ఎన్నిక లకమిషనర్ ని అడిగితే ఆయన కోపోద్రిక్తుడవుతున్నాడు. ఎస్ఈసీ ఉత్తర్వులకు విరుద్ధంగా, ప్రిసైడింగ్ అధికారులు, రిటర్నిం గ్ అధికారులు వ్యవహరించారని, పోలీసులు దుర్మార్గంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఫలితాలుప్రకటించాలని ఒత్తిడిచేశారని మేము ఎన్నికలకమిషనర్ కి చెబుతుంటే, ఆయన వినడానికి కూడా ఇష్ట పడటంలేదు. ఎస్ఈసీ కంట్రోల్ చేయాల్సింది మమ్మల్నికాదు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని. ఎందుకో తెలియదు గానీ, ఎన్నికలకమిషనర్ గవర్నర్ ను కలిసినప్పటినుంచీ, ఆయన మెతక వైఖరి అవలంబిస్తున్నాడు. ఏదో ఎన్నికలు జరిపాము అనే ఆలోచనలోఉన్నారుగానీ, స్వేఛ్చగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ఎస్ఈసీకి లేదు."

"అంతమందిపోలీసు అధికారులు దుర్మార్గంగా, దౌర్జన్యంగా వ్యవహరించి, అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆధారాలతోసహా ఎన్నికల కమిషనర్ కిచెప్పినా, ఒక్కఘటనలో కూడాఆయన చర్యలు తీసు కోలేదు. బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించిన ఘటనల పైకూడాచర్యలు లేవు. అలాగైతే ఇకఎన్నికలు జరపడం ఎందుకు? ప్రశాంతవాతావరణంలో పంచాయతీఎన్నికలు జరిగాయని ఎన్నిక ల కమిషనర్ చెప్పగలడా? చంద్రబాబునాయుడి నిర్బంధాన్ని ఎస్ఈసీ సమర్థించగలడా? ఆయనచిత్తూరు వెళ్లకూడదని ఎన్నిక ల కమిషనర్ చెప్పగలరా? ఆయన వైఖరి ఇలాఉండబట్టే, తాము ఎన్నికల ప్రక్రియపై సందేహాలు వ్యక్తంచేస్తున్నాము. ఆయన అఖిలపార్టీ సమావేశం ఎందుకుపెట్టారు. ఏదో కంటితుడుపుగా సమావేశం పెట్టి, ఐదునిమిషాలు కూడా చెప్పేదివినకుండా బయట కు పంపుతారా? ఎన్నికల కమిషన్ ఈ విధంగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో ఎన్నికలుప్రశాంతంగా, స్వేచ్ఛగా జరగవు. అధికారపార్టీవైపు మొగ్గుచూపకుండా, తప్పుచేసినవారిని శిక్షించి, అన్యాయానికి గురైనవారికి అండగా నిలవాల్సిన వబాధ్యత ఎన్నికల కమిషనర్ పైనేఉంది. దౌర్జన్యపూరితంగా వ్యవహరించే వారిని శిక్షించాలి. డీజీపీ తక్షణమే చంద్రబాబునాయుడిగారిని నిర్బంధం నుంచి విడిపించి, చిత్తూరువెళ్లేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. " అని వర్ల రామయ్య అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read