దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే, దాని పర్యావసానాలు అనుభవించాల్సిందే. అమరావతిలో ఉద్యమం చేస్తున్న వాళ్ళని గత ఏడాదిన్నరగా ఎలా హేళన చేస్తున్నారో చూస్తున్నాం. వారిని ముఖ్యంగా పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ, ఒక పార్టీకి అంటగట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చారు. ఎవరికైనా ఎన్నాళ్ళు ఓపిక ఉంటుంది. ఈ రోజు కూడా అదే జరిగింది. ఒక ప్రముఖ ఛానల్ లో, అమరావతి పై డిబేట్ జరుగుతుంది. ఈ చర్చలో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి.శ్రీనివాస్, అలాగే బీజేపీ తరుపున విష్ణువర్ధన్ రెడ్డి పాల్గున్నారు. సహజంగా విష్ణు వర్ధన్ రెడ్డి బీజేపీ స్టాండ్ కంటే, వైసీపీ పాట ఎక్కువ పాడతారు అంటే విమర్శలు ఉన్నాయి. అయితే డిబేట్ జరుగుతూ ఉండగా, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి.శ్రీనివాస్ పై విష్ణువర్ధన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసారు. నువ్వు పైడ్ ఆర్టిస్ట్ వి, నీకు ఇష్టం అయితే తెలుగుదేశం ఆఫీస్ లో కూర్చుని చెప్పుకో అంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దీంతో సహనం కోల్పోయిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి.శ్రీనివాస్, విష్ణు వర్ధన్ రెడ్డి పై చెప్పు విసిరారు. ఎవరు రా పైడ్ ఆర్టిస్ట్, పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ, ఎదురు తిరిగారు, దీంతో వెంటనే డిబేట్ ఆగిపోయింది.

అయితే ఆయన ఇలా కొట్టటం తప్పా, ఒప్పా అనేది పక్కన పెడితే, ఎవరికైనా కడుపు మండితే ఇలాగే ఉంటుంది. గతంలో కూడా ఇదే విష్ణు వర్ధన్ రెడ్డి, అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళల చీరల ధరలు గురించి మాట్లాడారు. అలాగే సహజంగా తను ఎదుటి వారిని ఎలా రెచ్చగొడతారో అలాగే, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి.శ్రీనివాస్ పై కూడా అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ క్రమంలో మాటా మాటా పెరిగింది. సహజంగా సమన్వయంతో ఉండే నేతలు, కంట్రోల్ తప్పారు. కొలికపూడి.శ్రీనివాస్ సహనం కోల్పోయి, విష్ణు రెడ్డి పై చెప్పు విసిరారు. దీని పై ఆ ఛానల్ విష్ణు వర్ధన్ రెడ్డి క్షమాపణలు చెప్పింది. అయితే జరిగిన ఘటన అయితే, అమరావతి పై పదే పదే ఒక రకమైన ముద్ర వేసి, ఉద్యమకారులను హేళన చేస్తున్న వారికి ఒక హెచ్చరిక అనే చెప్పాలి. కులం ,మతం ఆధారంగా రాజధాని మీద కుట్రలు చేసి రైతుల జీవితాలతో ,రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొంటున్న వారు, హుందాగా ఉండాలి. ఇలాంటి దాడులను ఎవరైనా ఖండించాల్సిందే. అలాగే ఇష్టం విచినట్టు మాట్లాడే వారు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read