రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అంటారు. మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డిని, కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ ఎలా తిట్టారో, వీడియోలు బోలెడు ఉన్నాయి. చివరకు మానుకోటలో జగన్ అడుగు పెట్టకుండా, టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో తరిమి తరిమి కొట్టారు. అంత బద్ధ వ్యతిరేకులు, మొన్న ఎన్నికల్లో కలిసిపోయారు. చంద్రబాబుని ఓడించారు. అప్పటి నుంచి జగన్, కేసీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే వీరి ఇద్దరి సఖ్యతతో, రాష్ట్రానికి అయితే ఒరిగింది ఏమి లేదు. వ్యక్తిగతంగా ఏమి లబ్ది అనేది బయటకు తెలియదు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణాలో రాజకీయం వేడెక్కింది. కేసీఆర్, బీజేపీని టార్గెట్ చేయటం ఇప్పుడు దేశ వ్యాప్త చర్చ అయ్యింది. ఇక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ, కేసీఆర్ ని మాత్రం నమ్మటానికి వీలు లేదు అనే వారు కూడా ఉన్నారు. అయితే బీజేపీ పైన యుద్ధం ప్రకటించిన కేసీఆర్, వరుస పెట్టి ఏపి పైన కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా టార్గెట్ చేయకపోయినా, ఏపి వంక పెట్టుకుని, అనాల్సినవి అన్నీ అనేస్తున్నారు. మాకు ఫుల్ గా కరెంటు ఉంది, పక్క రాష్ట్రంలో చీకట్లు ఉన్నాయని చెప్పి, జగన్ అసమర్ధతను హేళన చేసారు. తరువాత రోజు శ్రీకాకుళంలో మోటార్లకు మీటర్ల పై హేళన చేసారు.

kcr 16022022 2

అప్పు కోసం మోటార్లకు మీటర్లు పెట్టారని, అన్నారు. అయితే కేసీఆర్ అలా అన్నారో లేదో, కేసీఆర్ కు సపోర్ట్ గా ఉన్న మీడియా, అదే అందుకుని, ఇప్పుడు జగన్ పై వ్యతిరేఖ కధనాలు రాస్తుంది. ఇది జగన్ మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికర పరిణామమే. మొన్నటి వరకు పొగిడిన వారు, ఇప్పుడు నెమ్మదిగా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. కేసిఆర్ అనుకూల మీడియాలో, మోటార్లకు మీటర్ల విషయంలో, జగన్ వ్యవహార శైలిని తప్పు బట్టారు. ఒక పక్క కేసీఆర్ భారం అయినా, రైతులకు ఉచిత విద్యుత్ కోసం, మోటార్లకు మీటర్లు వద్దు అంటుంటే, జగన్ మోహన్ రెడ్డి మాత్రం కేవలం కొంత అప్పు కోసం అని, ఏకంగా రైతులకు ఉరి వేసే విధంగా మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, జగన్ పై విమర్శలు గుప్పిస్తూ కధనాలు రాసారు. మోడీకి జగన్ లొంగిపోయారని రాసుకొచ్చారు. ఒక పక్క కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణా రైతులు సంతోషంగా ఉంటే, ఏపిలో రైతులు మాత్రం, జగన్ పై ఆగ్రహంగా ఉన్నారని రాసారు. మరి కేసీఆర్ మీడియా రాతల పై, జగన్ మీడియా ఏమి సమాధానం చెప్తుందో చూడాలి మరి.

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవంగ్ బదిలీ అవ్వటం సంచలనం రేపుతుంది. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడిగ ఉంటూ, ప్రతిపక్షాల పైన దా-డు-లు జరుగుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా డ్యూటీ చేసిన గౌతం సవాంగ్ కూడా ఇప్పుడు బదిలీ అయ్యారు. కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. అయితే డీజీపీ బదిలీ వెనుక ఉన్న స్కెచ్ ఏమిటో అర్ధం కావటం లేదు. ప్రస్తుతం ఆయన్ను ఇంచార్జ్ డీజీపీగా నియమించారు. డీజీపీని నియమించాలి అంటే, ముగ్గురు పేర్లతో కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్యానెల్ లో వాళ్ళు ముగ్గురు నుంచి ఒకరిని ఎన్నుకుంటారు. సహజంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని అంటే వారిని ఎన్నుకుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇదేమీ చేయకుండా, ఇంచార్జ్ డీజీపీగా నియమించారు. తరువాత ప్యానెల్ కు పంపనున్నారు. ఇంత హడావిడిగా ఎందుకు చేసారు అనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. నిన్న ప్రవీణ్ ప్రకాష్ బదిలీ, నేడు డీజీపీ బదిలీ వెనుక ఏమి జరిగింది, ఇంత నమ్మకమైన వాళ్ళని కూడా ఎందుకు జగన్ నమ్మటం లేదు అనేది చూడాలి.

YS వివేక కేసు పై కొన్ని రోజుల తరువాత  సిబిఐ విచారణ మళ్ళీ మొదలయింది. కడప జిల్లాలోని పులివెందుల R&B గెస్ట్ హౌస్ లో విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు ఈ విచారణకు హాజరు అయినట్టు సమాచారం. సాక్షి విలేఖరిగా పనిచేస్తున్న బాలకృష్ణారెడ్డి ఈ రోజు సిబిఐ విచారించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా విలేఖరిగా పనిచేస్తున్న ఈ బాలకృష్ణారెడ్డి అప్పట్లో వివేక హ-త్య జరిగినప్పుడు కడప జిల్లా రిపోర్టర్ గా పని చేసారు. వివేక హ-త్య జరిగిన రోజు  శివశంకర్ రెడ్డి,  బాలకృష్ణారెడ్డికి ఫోన్ చేసి వివేకా గుండె పోటుతో చనిపోయారని సమాచారం ఇచ్చారట.  అయితే ఇతన్నే కాకుండా పులివెందుల, జమ్మలమడుగు కు సంబందించిన సాక్షి విలేఖరులను, మీడియా ప్రతినిదినులను ఇప్పటికే విచారించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఉదయ్ కుమార్ రెడ్డి ని కూడా సిబిఐ విచారించింది. యురేనియం కంపెనీ లో పనిచేస్తున్న ఈ ఉదయ కుమార్ రెడ్డి కోసం సిబిఐ ఆ కర్మాగారానికే వెళ్లి విచారించింది . వివేక చనిపోయినప్పుడు ఈ ఉదయ తండ్రి ప్రకాష్ రెడ్డి  వివేక తలకు కుట్లు వేసినట్టు సమాచారం. మరోవైపు  పులివెందులలో గంగి రెడ్డి హాస్పిటల్ పనిచేస్తున్న డా.మధుసూదనరెడ్డి ని కూడా ఈ కేసులో విచారిచాల్సి ఉంది.

వివేక హ-త్య కేసులో సిబిఐ వేగంగా పావులు కదుపుతోంది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసింది. ఒకరి తరువాత ఒకరిగా అనుమానితుల్ని అందరిని విచారణకు రావాల్సిందని ఆదేశాలు జారి చేసింది. నిన్నటి నుంచి పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సిబిఐ విచారణ జరుపుతుంది. ఈ విచారణలో భాగంగా నిన్న కొంతమందిని విచారించారు. దీనిలో బాగంగానే సిబిఐ నిన్న ఒక చార్జిషీట్ దాఖలు చేసింది. ఒక పక్కా ప్రణాలికతోనే వివేకానంద రెడ్డి హ-త్య జరిగిందని సిబిఐ తన విచారణలో స్పష్టం చేసింది. ఈ హ-త్య-కు 40 కోట్ల ఒప్పందం కూడా జరిగిందని సిబిఐ చార్జిషీట్ లో స్పష్టం చేసింది. ఈ హ-త్య వెనుక ఆర్ధిక లావాదేవీలు కూడా ఉన్నట్టు తేల్చి చెప్పింది . బెంగుళూరు ఒక స్థలానికి సంబంధించిన వివాదం కూడా ఈ హ-త్య కు ఒక కారణం గా తేల్చి చెప్పింది. ఈ హత్యకు ఒకవైపు ఆర్ధిక లావాదేవీలు , మరో వైపు పొలిటికల్ గా ,ఇలా రెండు కారణాలుగా సిబిఐ తన చార్జిషీట్ లో స్పష్టం చేసింది. ఈ హ-త్య-కు ప్రధాన అనుమానితుడు ఎంపి అవినాష్ రెడ్డి . ఆయనకు టికెట్ ఇవ్వద్దని అప్పట్లో వివేకా పట్టుపట్టడమే ఈ హ-త్య-కు కారణంగా భావించవచ్చని చెపుతున్నారు. ఈ ఎంపి అత్యంత సన్నిహితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి , ఇంకా కొంతమంది కలిసి ఈ హ-త్య-ను గుండెపోటుగా చిత్రీకరిచారని మరొకరి వాదన.

avinash reddy 15022022 2

ఎంపి అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి , గంగిరెడ్డి కలిసి ఈ హ-త్య-ను గుండె పోటుగా చిత్రీకరిచారని , అక్కడ ఉన్న రక్తపు మరకలని ఇంట్లో పనివాళ్ళ చేత మొత్తం శుబ్రం చేయించారని, దెబ్బలు ఎక్కడా కనబడకుండా డాక్టర్లతో కుట్లు కూడా వేయించారని అక్కడి స్థానికుల వాదన. అయితే హైదరాబాద్ లో ఉన్న వివేకా కుమార్తె సునీత రాకుండానే దహన సంస్కారాలు కూడా చేయాలనీ చూసారని మరికొందరు చెపుతున్నారు. ఏది ఏమైనా వివేకాది గుండెపోటు కాదని పక్కా పధకం పరకారమే హ-త్య చేసి ఉంటారని ప్రజలే కాకుండా సిబిఐకి కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఇదే విషయం ఇప్పుడు అనేక అనుమానాలు అన్నీ చూపించి, కోర్టు ముందు చార్జ్ షీట్ లో పెట్టింది. సిబిఐ స్పీచ్ చూస్తుంటే, త్వరలోనే అవినాష్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ స్కెచ్ మొత్తం ఎవరు వేసారు, ఎందుకు వేసారు. ఏకంగా 40 కోట్లు ఎవరు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఇలా మొత్తం మిస్టరీ త్వరలోనే బయట పడబోతుంది అనే అనుకోవాలి.

Advertisements

Latest Articles

Most Read