ఈ రోజు జగన్ తో సినీ ప్రముఖులు భేటి అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భేటికి  మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ ,చిరంజీవి హాజరవుతున్నారు. సినిమా ప్రముఖులు  సినిమా టికెట్ల వివాదం గురించి మాట్లాడటానికే జగన్ తమను ఆహ్వానించారని మీడియాకు తెలిపారు. అయితే చిరంజీవి బృందం రాక ముందే, సినీ వర్గాల చర్చల్లో ట్విస్ట్ నెలకొంది. చిరంజీవి బృందం రాక ముందే  ఆలీ, పోసాని, ఆర్. నారాయణ మూర్తి ముందుగానే జగన్ నివాసానికి , మంత్రి పేర్నినాని తో కలిసి చేరుకున్నారు. ముందుగానే వారిని జగన్ పిలిపించుకున్నారు అనే వార్త నడుస్తుంది. అయితే ఆలీ , పోసాని వైసీపీ నాయకులు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్. నారాయణ మూర్తి జగన్ కు ఎంత పెద్ద సపోర్టర్, ఎలా భజన చేస్తారు అనేది అందరికీ తెలిసిందే. ఇక ఆచార్య నిర్మాత అయిన నిరంజన్ రెడ్డి జగన్ రెడ్డి లాయర్. చిరంజీవి బృందం రాక ముందే, వైసీపీకి అనుకూలంగా ఉండే సినిమా వాళ్ళు జగన్ ఇంటికి వెళ్ళటంతో, ఇవి సినిమా టికెట్ల పై చర్చలా, లేక వైసీపీ అధికార ప్రతినిధులతో  చర్చలా అని కూడా వార్తలోస్తున్నాయి. ఇక వీరి భేటీ జరిగిన తరువాత, చిరంజీవి బృందం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లి జగన్ నివాసానికి వచ్చారు.  చిరంజీవి బృందంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి వచ్చారు. అప్పటికే అక్కడ అలీ, పోసాని, నారాయణ మూర్తి ఉండటంతో, వారితో కలిసి చిరంజీవి బృందం జగన్ తో సమావేశం అయ్యింది.

నిన్న జగన్ విశాఖ పర్యటనలో భాగంగా ప్రజలు చాల ఇబ్బందులకులోనైన సంగతి తెలిసిందే. పోలిసుల ఓవరాక్షన్ వల్ల జనాలు గంటల తరబడి రోడ్ల మీదే ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. దాదాపుగా రెండు గంటలు తాఫిక్ ఆపటంతో, ప్రజలు తీవ్ర అసహనానికి లోనయ్యారు. మరికొంతమంది అయితే పోలీసులకు ఎదురుతిరిగి మాట్లాడారు. ఆ వీడియోలన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జగన్ వస్తే షాపులు అన్ని మూయించాల్సిన అవసరం ఏముందని, దారి పొడుగునా బారికేడ్లు కట్టాల్సిన పని ఏంటని, జనాలని అన్ని గంటల పాటు రోడ్ల మీద ఆపితే ఎలా నాయి కూడా జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఇలా చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయా, లేక పోలీసులే కావాలని ఇంత అతగా ప్రవర్తిస్తున్నారా అనేది కూడా తెలియాలి. సామాన్యంగా సియం సెక్యూరిటీ అంటే ప్రభుత్వమే చూస్తుంది కాబట్టి, ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన అదేశాలే అనుకోవాలి. అయితే నిన్న జగన్ విశాఖ వచ్చింది, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికో, లేక ఏదైనా పరిశ్రమ ఓపెనింగ్ కో అనుకుంటే, సరేలే రాష్ట్రం కోసం అని అడ్జెస్ట్ అవుతాం. ఇక్కడ జగన్ వచ్చింది ఏమో ఒక ప్రైవేటు కార్యక్రమానికి, శారదా పీఠంలో పర్సనల్ పూజలు చేయటానికి.

traffic 100202022 2

అయితే నిన్న జరిగిన పరిణామంతో, విశాఖ ప్రజలు మొత్తం ప్రభుత్వాన్ని తిట్టారు. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు ఈయన విశాఖలో వచ్చి కూర్చుంటే, అసలు మమ్మల్ని బయటకు కూడా రానివ్వరు ఏమో అని అభిప్రాయ పడుతున్నారు. విషయం పెద్దది అవ్వటం, ప్రజలు పోలీసులు మీద కూడా తిరగబడటంతో, ప్రభుత్వంలో చలనం వచ్చింది. అసలకే మోసం వస్తుందని భావించారు. అందుకే ప్రభుత్వం వైపు నుంచి మీడియాకు లీకలు ఇచ్చారు. అసలు నిన్న జరిగిన ఘటన జగన్ గారికి తెలియదు అని, విషయం తెలిసిన వెంటనే జగన్ గారు పోలీసులు పైన ఫైర్ అయ్యారని, అసలు ఎందుకు అలా జరిగింది, నా కోసం ట్రాఫిక్ ఆపటం ఏంటి అంటూ, ఫైర్ అయ్యి, విచారణ చేయమని డీజీపీని ఆదేశించారు అంటూ, మీడియాకు లీకులు ఇచ్చారు. తన కోసం ప్రజలను గంటలు గంటలు ఆపటం ఏమిటి, ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టారు, ఇది ఇంకో సారి జరగకూడదు అంటూ, జగన్ ఫైర్ అయ్యి, ప్రజలకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా అని చెప్పినట్టు మీడియాకు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వం, ఏ సమస్యా లేనట్టు, చింతామణి నాటకాన్ని నిషేధించటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వందల ఏళ్ళ నాటి నాటకాన్ని ఎందుకు నిషేధించారో, దానికి వెనుక ఉన్న స్కెచ్ ఏంటో తెలియదు కానీ, దీని పైన కొందరు హైకోర్టుకు వెళ్ళారు. ఈ పిటీషన్ పైన ఈ రోజు విచారణ జరిగింది. ఈ పిటీషన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ పిటీషన్ వేసిన రఘురామరాజు తరుపున, న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అయితే ఇదే సందర్భంలో నాటకాన్ని నిషేధించటం సరైన నిర్ణయం అంటూ, ఆర్యవైశ్య సంఘాల తరపున 3 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీంతో ఇవి కూడా ఈ రోజు హైకోర్టు ముందుకు విచారణకు వచ్చాయి. అయితే ఇంప్లీడ్ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్ని వందల పిటీషన్లు దాఖలు చేస్తారు అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసారు. విచారణను సాగదీయటానికి ఈ ఇంప్లీడ్ పిటీషన్లు వేస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక ఇంప్లీడ్ పిటీషన్ ని కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రతివాదులు అందరికీ కోర్టు నోటీసులు ఇస్తూ, కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

జగన్ మోహన్ రెడ్డి బయటకు రావటమే ఎక్కువ. ఆయన బయటకు వస్తున్నారు అంటే, రచ్చ రచ్చ అవుతుంది. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, శారదాపీఠంలో జరిగే ఉత్సవాల్లో పాల్గునటానికి విశాఖపట్నం వెళ్ళారు. ఈ రోజు ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి, విశాఖ చేరుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి విశాఖలో దిగిన దగ్గర నుంచి రచ్చ రచ్చగానే ఉంది. ముందుగా జగన్ వస్తున్నారని, ఆయన వెళ్ళే దారిలో షాపులు అన్నీ మూసివేయటం పెద్ద వివాదాస్పదం అయ్యింది. సియం వస్తుంటే, అసలు మేమెందుకు షాపులు ముయ్యాలి అని ప్రశ్నించినా, వారికి చివరకు షాపులు మూసేయక తప్పలేదు. అంతేనా, ఇంకో వింత ఘటన. జగన్ వెళ్ళే దారిలో రోడ్డు పైన బ్యారికేడ్లు పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారో, ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. అసలు ఒక సియం ప్రజల మధ్యకు వస్తే ఎలా ఉండాలి ? ప్రజలతో మమేకం అయ్యేలా ఉండాలి. ప్రజలు ఆపితే వారి కష్టాలు వినాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. తమిళనాడు సియాం స్టాలిన్ చేస్తుంది అదే. ఈ రకంగా సెక్యూరిటీ పేరుతో జగన్ వస్తున్నాడని, షాపులు మూసివేయటం, ఎవరూ రోడ్డు మీద ఉండకూడదు, ఎవరూ కనపడకూడదు అంటే ఎలా ? అప్పటికే టిడిపి నాయకులు కొంత మందిని హౌస్ అరెస్ట్ కూడా చేసారు. మళ్ళీ ఈ ఏర్పాట్లు అదనం.

vizag 0902022 2

సరే ఇది అయిపొయింది, జగన్ తో పాటు శారదాపీఠంలోకి వెళ్ళటానికి, మంత్రి అప్పల రాజు, తన అనుచరగళంతో వచ్చారు. మిమ్మల్ని ఒక్కరినే లోపలకు పంపిస్తాం అని చెప్పటంతో, మంత్రి పోలీసుల పై రెచ్చిపోయారు. పచ్చి బూతులు తిడుతూ, అలాగే ఆ పోలీస్ ని తోసేసి రచ్చ రచ్చ చేసారు. బయటకు మాత్రం, పోలీసులే తనను బూతులు తిట్టారు అంటూ, చెప్పుకొచ్చారు. తీరా చూస్తే,మంత్రి బూతులు విడియో బయటకు వచ్చింది. మంత్రితో పాటు, మంత్రి అనుచరులకు కూడా గౌరవం ఇవ్వాలి అంటే ఎలా ? ఇక తరువాత జగన్ మోహన్ రెడ్డి పర్యటన అయిపొయింది. తిరిగి వచ్చేస్తున్నారని, విశాఖ మొత్తం స్థంబింప చేసారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే వారు, తమ ఫ్లైట్ టైం అవుతుంది మహా ప్రభో అని రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బందులు, ఇలా రకరకాలుగా జరిగింది. మొత్తానికి గంట పైనే ట్రాఫిక్ ఆపేసారు. ఇలా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన, రచ్చ రచ్చ అయ్యింది.

Advertisements

Latest Articles

Most Read