రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి నేడుచీకటిరోజని, ఈనాడు ప్రజాస్వా మ్యం కాలరాయబడిందని, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో, డీజీపీ సవాంగ్ నాయకత్వంలోనే చంద్రబాబునాయుడిని రేణిగుంట విమానాశ్రయంలో అక్రమంగా నిర్బంధించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆవివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది. ఖూనీచేసిన ఖూనీకోరులు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి, డీజీపీ సవాంగ్, మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆముగ్గురూ కుట్రపన్ని చంద్రబాబు నాయుడు తిరుపతిలో, చిత్తూరులో పర్యటించకుండా అడ్డుకున్నా రు. వందలాది పోలీసులతో ఆయన్ని అడ్డుకున్నారు. ఇదేమీ ప్రజాస్వామ్యమో ఆ ఖూనీకోరులు చెప్పాలి. తాను చిత్తూరు వస్తాన ని, నామినేషన్లు వేసినటీడీపీశ్రేణులకు అండగా ఉంటానని, భయప డాల్సిన పనిలేదని నిన్ననే చంద్రబాబునాయుడు చెప్పారు. చిత్తూ రు పర్యటనకు చంద్రబాబు వస్తానని చెప్పినప్పుడే పోలీసులు ఆయన్ని వద్దనిచెప్పాల్సింది కదా! చంద్రబాబునాయుడు చిత్తూరు వస్తుంది ఎన్నికల నిర్వహణకోసమే కదా! ఆ విషయం పోలీసులకు తెలియదా? చిత్తూరు జిల్లాలో ఎవరూటీడీపీ తరుపునపోటీచేయ కూడదనే, మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచినవారిని బెదిరిస్తు న్నారు. తిరుపతిలో కూడా అదేవిధంగా టీడీపీ వారిని భయపెట్టి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు.

ఇవన్నీ చూశాక చంద్రబాబునాయుడు చిత్తూరుపర్యటనకు వెళ్లి, టీడీపీ శ్రేణులకు ధైర్యం చెప్పాలని నిర్ణయించుకున్నారు. కరోనా నిబంధనలు అనేవి చంద్రబాబు నాయుడుగారికి, టీడీపీవారికే వర్తిస్తుందా? గతంలో చంద్రబాబునాయుడి కాన్వాయ్ దాడిచేస్తే, ఆర్టికల్ 19ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛప్రకారం జరిగిందని డీజీపీచెప్పారు. అదే భావప్రకటనా స్వేచ్ఛ నేడు చంద్రబాబునాయుడికి వర్తించదా అని డీజీపీని ప్రశ్నిస్తున్నాను. మాజీముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు 70ఏళ్లవయసున్న చంద్రబాబునాయుడు నేలపై కూర్చుంటే తెలుగుజాతి కన్నీరు పెడుతుంది. ఈపాలకులకు, పోలీ సులకు కన్నీటివిలువ తెలియదు, వారికి పన్నీటివిలులే తెలుసు. రాష్ట్రమంతా చంద్రబాబునాయుడు గారు చేసిన తప్పేమిటి, ఆయన చేసిన నేరమేమిటని ప్రశ్నిస్తోంది. వైసీపీవారికి కూడా కరోనా నిబంధనలు, ఎన్నికలనియమావళి వర్తిస్తుందని పోలీసులు ఎందుకు చెప్పలేకపోతున్నారు. వైసీపీవారికి ఎన్నికలకోడ్ వర్తించ దా? భూమన కరణాకర్ రెడ్డి నిన్నటికి నిన్న ఎన్నికలప్రచారం చేయలేదా? అధికారపార్టీకి మద్ధతుపలకడమే తమవిధి అన్న ట్లుగా పోలీస్ శాఖ ప్రవర్తిస్తోంది. సవాంగ్ నాయకత్వంలో పోలీస్ శాఖ ఎందుకింతలా దిగజారింది? ఎందుకింతలా నిర్వీర్యమైందో సవాంగ్ చెప్పగలరా? అధికారపార్టీవారికి జీహుజూర్ అనడమే పోలీసుల పనా? డీజీపీ రిటైర్ అయ్యాక, పోలీస్ శాఖ తిరిగి గాడిన పడటానికి, పట్టాలెక్కడానికి ఎంతో సమయం పడుతుంది. ఎందు కంటే సవాంగ్ గారు అంతలా పోలీస్ శాఖను నీరుగార్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read