ఇంజినీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులకు ఉద్యోగాల కల్పనకు, ఓ వినూత్న కార్యక్రమంతో కృష్ణా జిల్లా ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యం ముందుకువచ్చింది. ఇప్పటి వరకూ ఎవరికి వారు సొంతంగా ఆయా కళాశాలల్లోని విద్యార్థుల కోసం జాబ్ మేళాలను ఏర్పాటు చేసుకునేవారు. దీని వల్ల అక్కడ ఉన్న విద్యార్థులకు మాత్రమే అవకాశాలు అందేవి. ఈ విధానం వల్ల ఇంజినీరింగ్ విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరడం లేదు. కంపెనీలకు సైతం అనుకున్న సంఖ్యలో అభ్యర్థులు దొరక్కపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే కళాశాలల్లో ఎవరికి వారు వేర్వేరుగా కాకుండా అందరికీ కలిపి ఒకే వేదికను ఏర్పాటు చేసి విద్యార్ధులు, కంపెనీలకు ప్రయోజనకరంగా మార్చాలని నిర్ణయించుకున్నారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంజినీరింగ్ కళాశాలల యాజామాన్య సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించారు. తొలి వేదికను విజయవాడలోని లయోలా కళాశాల దగ్గర ఉన్న ఎగ్జిక్యూటివ్ క్లబ్ లో "జాబ్ ఫెయిర్ 2017" పేరుతో ఏప్రిల్ 10న ఏర్పాటు చేశారు. ఇన్ఫోసిస్, టాటా, పొలారిస్, వంటి ప్రధాన కంపెనీలు 25 వరకూ ఈ జాబ్ ఫెయిర్లో పాల్గొంటున్నాయి. ఎలాంటి సభ్యత్వ రుసుం చెల్లించాల్సిన పనిలేకుండా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని విద్యార్ధులు జాబ్ ఫెయిర్లో పాల్గొనొచ్చని నిర్వాహకులు సూచించారు.

10వ తేదీన ఉదయం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జాబ్ ఫెయిర్ ప్రారంభించనున్నారు. రాజధానిగా మారిన నేపథ్యంలో విజయవాడకు ప్రాధాన్యం పెరిగింది. కొత్త కంపెనీలు ఇక్కడ తమ శాఖలను నెలకొల్పుతున్నాయి. వాటన్నిటిలోనూ అవకాశాలు ఉంటున్నాయి. ఈ జాబ్ ఫెయిర్ లో, ఫ్రేషేర్స్ మాత్రమే కాకుండా, అందరికీ అవకాశం ఉంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read