బెంజిసర్కిల్ వద్ద నిర్మించబోతున్న ఫ్లైఓవర్ ను ఇంటిగ్రేటెడ్ ఫ్లైఓవర్ గా మార్పు చేయడానికి సర్కారు నిర్ణయించింది. ఫ్లైఓవర్ ను చూసి అంతా అబ్బురపడేలా డిజైన్ లో మార్పులకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. కాంట్రాక్టు సంస్థ దిలీప్ బిల్డ్ కాన్ ఇప్పటికే మట్టి నమూనాల విశ్లేషణ కోసం ఆరు చోట్ల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ పంపింది. నివేదిక వచ్చాక పనులు చేపట్టే అవకాశమున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిజైన్ లో మార్పులు చేపట్టాలని సూచించారు.

విజయవాడ నగరంలో అత్యంత రద్దీగల ప్రాంతం బెంజిసర్కిల్, ఈ కూడలి మీదుగా జాతీయ రహదారి 16 (చెన్నై- కోల్కతా) వెళుతుంది. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలు ఈ కూడలి దాటాల్సిందే. కనీసం 80 నుంచి 90 వేల వాహనాలు ఇక్కడ తిరుగుతాయి అని అంచనా. ఇదే కూడలికి బందరు నుంచి వచ్చే రహదారి కలుస్తుంది. దీంతో అక్కడ నిత్యం ట్రాఫిక్ కష్టాలే. ఈ కూడలి దాటాలంటే కనీసం 30 నిమిషాలు పడుతుంది. అమరావతి రాజధాని కావటం, భవిషత్తు అవసరాలు పరిగణలోకి తీసుకుని, అక్కడ ఫైఓవర్ నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది.

అమరావతికి ముఖ ద్వారంగా, ఫ్లైఓవర్ నిర్మాణం
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా విజయవాడ గుర్తింపు పొందడం, జనాభా పెరగడం, భవిష్యత్తులో మహా నగరంగా విస్తరించనున్న నేపథ్యంలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఫైఓవర్ నగరానికి ఓ మణిహారంగా ఉండేలా నిర్మించాలని ప్రభుత్వ భావిస్తోంది. అందువల్లే డిజైన్లను మార్చడానికి సిద్ధమైంది. అనతర్జాతీయ స్థాయిలో డిజైన్ ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం తన నిర్ణయాన్ని వెల్లడించారు.

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ఎంత దూరం ఉండాలన్న దానిపై ఇప్పటికి రెండుసార్లు మార్పులు జరిగాయి. మొదట్లో 200 మీటర్లుగా నిర్ణయించిన ఫ్లైఓవర్‌ను ఆ తర్వాత 600 మీటర్లకు పొడిగించారు. ఎంపీ కేశినేని నాని కృషితో మరో 800 మీటర్లకు పొడిగించారు. దీంతో మొత్తం 1.4 కిలోమీటర్ల మేర బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి నూతన డిజైన్‌ రూపొందించాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read