శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీసమేతంగా వచ్చారు. సరస్వతి దేవి అవతారంలో ఉన్న దుర్గా దేవిని దర్శించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడానికి చంద్రబాబునాయుడు దంపతులు బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రి చేరుకున్నారు.

ఆలయ మర్యాదలతో ముఖ్యమంత్రి కి స్వాగతం పలికారు, ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు.. సాంప్రదాయ వస్త్ర ధారణలో అమ్మవారి దర్శనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు.

మేళతాళాలుతో సంప్రదాయ రీతిలో ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికారు దుర్గగుడి అధికారులు... వేదపండితులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికి ముఖ్యమంత్రికి పరివేష్టం కట్టి సంప్రదాయ పద్దతిలో ఆలయంలోనికి తోడ్కొని వెళ్లారు. ఈసందర్బంగా అమ్మవారికి సీఎం దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికిన వారిలో మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్, పాలక మండలి చైర్మన్ గౌరంగ బాబు, ఆలయ ఈఓ సూర్యకుమారి, కలెక్టర్ బి. లక్ష్మీ కాంతం, తదితరులు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read