ప్రతి సంవత్సరం, జనవరి 26న కాళ్ళు చేతులు కట్టుకుని, కృష్ణా నదిలో ఈదుతూ, ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న విజయవాడ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ లంకె ఉమామహేశ్వరరావు, ఈ సారి కూడా జనవరి 26కు, గిన్నిస్‌ రికార్డు సాధించాలి అని, ఇవాళ కృష్ణా నదిలో సాధన చేస్తూ, గుండెపోటుతో మృతి చెందారు.

కాళ్లకు గోనె సంచులు కట్టుకుని ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు ఈది గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకోవాలి అనే సంకల్పంతో, కొద్దిరోజులుగా కృష్ణా నదిలో కఠోర సాధన చేస్తున్నారు. ఈరోజు ఉదయం కృష్ణా నదిలో కాళ్లకు గోనె సంచులు కట్టుకుని ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు ఈత సాధన చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో నీరసించి పోయారు. తోటి ఈతగాళ్లు ఆయన్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

ఉమామహేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరు. పోలీసు ఉద్యోగం రాకముందు కృష్ణానది కాల్వలో ఈత కొట్టడం ఆయన అభిరుచి. 1994లో ఎస్పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆయన పాల్వంచ, విజయవాడ, దుర్గగుడి, అసెంబ్లీ, సచివాలయం తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. కాళ్లు, చేతులు కట్టుకుని కృష్ణా నదిలో ఈత కొట్టడం ద్వారా ఇప్పటికే అనేక జాతీయస్థాయి అవార్డులు సొంతం చేసుకున్నారు. లిమ్కాబుక్‌ ఆప్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఉమామహేశ్వరరావు పేరు నమోదైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read