టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూశారు. ఆయన మృతిపట్లు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నెహ్రూ 1983, 1985, 1989, 1994, 2009లో ఎమ్మెల్యేగా నెహ్రూ గెలుపొందారు. బెజవాడ రాజకీయాల్లో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. ఒక్క కంకిపాడు నుంచే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నెహ్రూ గెలిచారు. విజయవాడ తూర్పు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

తెలుగుదేశం పార్టీలోకి తిరిగి చేరిన సందర్భంగా, దేవినేని నెహ్రూ అన్న మాటలు, అందరూ గుర్తు చేసుకుంటున్నారు... ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుని, ఇందుకేనేమో ఆ రోజు నెహ్రు గారు అలా మాట్లాడింది అని తలుచుకుని బాధ పడుతున్నారు.

ఇవి దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి తిరిగి చేరిన సందర్భంగా గుణదల బిషప్‌ గ్రాసీ హైస్కూల్‌లో జరిగిన బహిరంగ సభలో అన్న మాటలు:

‘రాజకీయంగా టీడీపీలో పుట్టాను. ఎన్టీఆర్‌ నాకు రాజకీయ బిక్ష పెట్టారు. చనిపోయినా టీడీపీ జెండా కప్పుకునే చనిపోతా. ఈ కోరిక తీరడానికే మళ్ళీ పార్టీలోకి చేరానేమో అనిపిస్తోంది. 23 ఏళ్ళ వయసులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. నాకు ఇప్పుడు 62 ఏళ్ళు. టీడీపీ జెండాతోనే చనిపోతా’ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అన్నారు. ఈ సందర్భంగా గుణదల బిషప్‌ గ్రాసీ హైస్కూల్‌లో జరిగిన బహిరంగ సభలో నెహ్రూ ఉద్వేగ పూరితమైన ప్రసంగం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read