కంపెనీ నుంచి మన ఇంటికి చేరే సీల్డ్ గ్యాస్ సిలెండర్ నిండు బండ కాదంటే మీరు నమ్ముతారా? మంత్రి తనిఖీల్లో వెల్లడయిన నిజం ఇది. గ్యాస్ డీలర్ల కాదు, గ్యాస్ కంపెనీలే మనల్ని మోసం చేస్తున్నాయి. నమ్మి తీరాల్సిందే. కమర్షియల్ సిలెండర్లలో రెండు కిలోలు, డొమెస్టిక్ సిలెండర్లో 700 నుంచి 800 గ్రాముల వరకు గ్యాస్ తక్కువగా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ ఆయిల్ సంస్థలు ఫిల్లింగ్ చేసి పంపుతున్న గ్యాస్ సిలెండర్లలోనే తరుగుదల వస్తోంది. విజయవాడ నగరంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఒక కంపెనీ గుట్టురటు అయింది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన హెచ్-పీ ఫిల్లింగ్ ప్లాంట్ నుంచి గ్యాస్ లోడుతో వచ్చిన సిలెండర్లు నిర్ణీత ప్రమాణాల కంటే తక్కువగా ఉంటున్నాయనే బండారం తేటతెల్లమైంది. ఫిల్లింగ్ స్టేషన్ నుంచే సిలిండర్లలో గ్యాస్ పరిమాణం తక్కువుగా ఉండటం చూస్తే ప్లాంట్లో భారీ స్తాయిలో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీని పై ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు చేపడితే తప్ప ఈ భాగోతం బయటపడదు.

దీంతో ఆగ్రహించిన మంత్రి సంబంధిత గ్యాస్‌ కంపెనీపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత... గ్యాస్‌ డెలివరీ స్లిప్పులపై ఉన్న వినియోగదారుల ఫోన్‌ నెంబర్లకు మంత్రి స్వయంగా ఫోన్‌ చేశారు. గ్యాస్‌ డెలివరీ ఎలా జరుగుతుంది? అదనంగా డబ్బులు అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. డెలివరీ బాయ్‌లు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. లోపాలు సరిదిద్దుకోని గ్యాస్‌ ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి ప్రత్తిపాటి హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read