విభజన చట్టంలోని మరో హామీని కేంద్రం నెరవేర్చింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకు ఇచ్చిన హామీ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు విజయవాడ ఎయిర్ పోర్ట్ కు తప్పకుండా అంతర్జాతీయ హోదా వస్తుందని గతంలో పలుమారు పేర్కొన్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇక్కడి ఎయిర్ పోర్ట్ కు ప్రాధాన్యం ఇస్తుండడంతో కేబినెట్ లో సానుకూల నిర్ణయం వచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లోని విమానాశ్రయమే అంతర్జాతీయ స్థాయి కలిగి ఉండేది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. విభజన తర్వాత నవ్యాంధ్రలో ఈ స్థాయి ఎయిర్ పోర్ట్ లేదు.

రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా విస్తరిస్తోంది. రన్వే, మౌలిక సదుపాయాలు, టెర్మినల్ బిల్లింగ్ సాంకేతిక పరిజ్ఞానం, పార్కింగ్ బే, ఇలా అన్నింట్లోనూ విజయవాడ ఎయిర్ పోర్ట్ రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశంలోని ఏ మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్ట్ సాధించని వృద్ధిని విజయవాడ ఎయిర్ పోర్ట్ మూడేళ్లుగా సాధిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మిలియన్ ప్రయాణికుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్లో ఎయిర్పోరుకు అంతర్జాతీయ హోదా కల్పించటం సంతోషించాల్సిన విషయం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read