విజయవాడలో ఉన్న ఏకైక స్టేడియం అయిన, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి అంతర్జాతీయ స్థాయిలో హంగులు సమకూరనున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగిన చరిత్ర ఉన్న స్టేడియం, గత కొన్ని సంవత్సరాలు గా నిర్లక్షానికి గురైంది. అమరావతిలో నేషనల్ గేమ్స్ కు ఆంధ్రప్రదేశ్ బిడ్ వేసిన నేపధ్యంలో, స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నారు.

ఇందుకుగాను, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ తర్వాత, ఈనెల 27వ తేదీ నుంచి ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించటం జరగదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్ ప్రకటించారు. దాదాపు రెండు నెలల పాటు స్టేడియంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి స్టేడియాలకు ధీటుగా తీర్చిదిద్దేలా పనులు చేస్తున్నట్లు వెల్లడించారు.

మార్చిలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లేదా సినీ తారల క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు తగినట్లుగా అభివృద్ధి పనులు ఉంటాయని తెలిపారు.

CCL-సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో, మార్చ్ 2వ వారంలో, సినీ ఆర్టిస్ట్ లు, క్రికెట్ ర్లు కలిసి, రెండు రోజుల పాటు మ్యాచ్లు ఆడనున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఈ మ్యాచ్లు ఆడనున్నారు. ఈ మ్యాచ్లకి, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఆడమ్ గిల్-క్రిస్ట్, వెస్ట్ ఇండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా, టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, తెలుగు సినీ ఇండస్ట్రీ హీరోలు, హీరోయిన్ లు రానున్నట్టు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read