అద్భుత విన్యాసాలకు కృష్ణాతీరం మరోసారి వేదిక కాబోతుంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో తొలిసారిగా ఇటీవల నిర్వహించిన వైమానిక విన్యాసాలు ప్రజలనుంచి విశేష ఆదరణ లభించింది. ప్రజలకు ఎంటర్టైన్మెంట్గా ప్రతి నెలా ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అందులో భాగంగా ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో పన్నమి, భవానీ ఘాట్లలో నేవీ విన్యాసాలను నిర్వహించేందుకు విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చిన నావికాదళం సిబ్బందితో పన్నమి ఘాట్ సందడి సందడిగా మారింది.

విన్యాసాలలో ఉపయోగించే సెయిలింగ్ బోట్లను తమ వెంట తెచ్చుకున్న నేవీ బెటాలియన్ కృష్ణా నదిలో టైల్ రన్ నిర్వహించుకుంటున్నారు. ఫిబ్రవరి 2, 3 తేదీలలో ముందుగా రిహార్సిల్స్ చేసుకుంటారు. నేవీ విన్యాసాలను తిలకించేందుకు వచ్చే సందర్శకుల కోసం పున్నమి ఘాట్లో 10 ఫుడ్ కోర్టులను పర్యాటక శాఖ సిద్ధం చేసింది.

రెండు రోజులపాటు జరిగే రిహార్సిల్స్ అనంతరం 4వ తేదీన జరిగే విన్యాసాలు కీలకమైనవిగా నిలుస్తాయి. హెలీకాప్టర్ సహాయంతో నది పైకి దిగి ఆపదలో ఉన్న వారిని రక్షించే విధానాన్ని తెలియచేస్తారు. నదిలో తేలియాడే తెరచాప పడవలు, హెలీకాప్టర్ నుంచి తాళ్ల సహాయంతో నదిలోకి దిగి ఆపదలో ఉన్నవారిని రక్షించటం వంటి అనేక విన్యాసాలతో కనులవిందు చేయనున్నారు.

ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నేవీ బ్యాండ్ ఫిబ్రవరి 5వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. వివిధ రకాల వాయిద్యాలతో వీనుల విందుగా వినసొంపైన సంగీతంతో ఏర్పాటు చేసే ఈ బ్యాండ్లో 36 మంది పాల్గొంటారు.

యువతను నావికాదళం వైపు ఆకర్షించేందుకు ఈ విన్యాసాలు దోహదపడతాయి. అలాగే నావికాదళం అందించే సేవలు యువతలో స్పూర్తిని కలిగించేలా ఉంటాయని నేవీ అధికారి తెలిపారు. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సు లో యువతకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని, తాము నిర్వహించనున్న విన్యాసాలు భారత నావికాదళం గొప్పదనాన్ని తెలియచేస్తాయని అధికారి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read