నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి, తాత్కాలిక రాజధాని విజయవాడలో మొదటి ఫైవ్ స్టార్ట్ హోటల్ రెడీ అవుతుంది. ఇప్పటికే బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడుకు వెళ్ళే సర్వీస్ రోడ్ లో, వినాయక్ ధియేటర్ ఎదురుగ నోవాటెల్‌ ఫైవ్ నక్షత్రాల స్టార్‌ హోటల్‌ నిర్మాణంలో ఉంది.

నోవాటెల్‌ మొత్తం 16 ఫ్లోర్స్ లో కడుతున్నారు. ఈహోటల్‌లో సకల సౌకర్యాలు గల 110 గదులు ఉంటాయి. వరుణ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఈ హోటల్‌ నిర్మాణం జరుగుతుంది.

డిసెంబర్‌ నాటికి సిద్ధమవుతుందని వరుణ్‌ గ్రూప్‌ చెప్తుంది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు. నోవాటెల్‌ ఫైవ్ స్టార్ట్ హోటల్‌ విజయవాడకు ప్రథమ ఆకర్షణగా ఉండనుంది.

అమరావతి పరిధిలో గుంటూరు, విజయవాడ పరిధిలో మరిన్ని ఫైవ్ స్టార్ట్ హోటల్స్ రానున్నాయి.. ఐటీసీ.. మారియేట్.. నోవాటెల్.. గ్రీన్‌పార్క్.. కీస్(కేఈవైఎస్) వంటి అనేక స్టార్ హోటళ్లు నగర పరిసర ప్రాంతాలకు రానున్నాయి. కొన్ని ఇప్పటికే, నిర్మాణాలు కూడా మొదలుపెట్టాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read