పిబి సిద్దార్ధ కళాశాల శిక్షణ ఉపాధి విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 5న జాతీయ సాఫ్ట్ వేర్ సంస్థ క్యాప్ జెమినీ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం రమేష్ తెలిపారు.

2016, 2017 సంవత్సరాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులంతా పల్గునవచ్చు అన్నారు. బిఎస్సీ, బికాం, బిసిఎ, బిబిఎలలో ఉత్తీర్ణులైన పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీల్లో కనీసం 55శాతం మార్కులు వచ్చిన విద్యారులు 5న ఉదయం పిబి సిద్దార్ధ కళాశాల ఉపాధి అధికారి శ్రీధర్ ను సంప్రదించాలని సూచిం చారు.

ఆసక్తి కలిగిన విద్యారులు బయో డేటా, ఫోటో, సర్టిఫికెట్ల, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డుతో హాజరుకావాలని తెలిపారు.

హాజరైన విద్యారులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తామని, ఎంపికైన విద్యారులకు దేశవ్యాప్తంగా ఉన్న క్యాప్ జెమినీ సంస్థలో నియామకం జరుగుతుంది అని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read