నవ్యాంధ్ర రాజధాని ఆమరావతి పరిధిలో ఆంఫీబీయోస్‌ బస్సులు (బోటు కం బస్సు) అందుబాటులోకి వచ్చేసాయి... ఈ వాహనం చూడడానికి బస్సు మాదిరిగా ఉంటుంది. రోడ్డు మీద టైర్ల సహకారంతో ఇతర వాహనాల మాదిరిగా ఉంటుంది. నీటిలో దిగిన తర్వాత లాంచి మాదిరిగా తేలుతూ పయనిస్తున్నాయి. విదేశాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి ప్రత్యేక బస్సులను తొలిసారి అమరావతిలో ప్రవేశపెట్టిన పర్యాటక శాఖ అధికారులు, నిన్న ట్రయిల్ రన్ నిర్వచించారు..

బస్సును పది రోజుల క్రితమే విజయవాడకు తీసుకొచ్చారు. అనంతరం రహదారి పై పరీక్షించారు. నదిలోకి దింపేందుకు పన్నమి ఘాట్ సమీపంలో నిర్మించిన ర్యాంప్ అనువుగా లేకపోవడంతో ట్రయల్ రన్ నిలిపివేశారు. ర్యాంప్ సరిచేసి, నిన్న ట్రయిల్ రన్ నిర్వచించారు.. ట్రయిల్ సక్సెస్ అవ్వటంతో, త్వరలోనే ఈ బోటును పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు పర్యాటకశాఖ ఏర్పాట్ల చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు.

బస్సులో సుమారు 32 సీట్లు ఉంటాయి. ఇవి రోడ్డుపై గంటకు గరిష్టంగా 94 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. నీటిలో ఎనిమిది నాట్స్‌ వేగంతో వెళ్లగలవు.

వెలగపూడి సచివాలయం చేరుకోవటానికి చాలా ఉపయోగం:
విజయవాడ నుంచి వెలగపూడి మధ్య 25 కిలోమీటర్ల ప్రయాణం. అంతదూరం వెళ్లాలంటే సుమారు 45 నిముషాల సమయం పడుతుంది. ఆంఫీబీయోస్‌ బస్సులను ప్రవేశపెడితే ఈ దూరం 5-6 కిలోమీటర్లకు తగ్గుతుంది. పవిత్రసంగమం వద్ద ఆంఫీబీయోస్‌ బస్సు ఎక్కితే కేవలం 15 నిమిషాల్లో తాళ్లాయపాలెం చేరుకుని అక్కడి నుంచి 10 నిమిషాల్లో వెలగపూడికి వెళ్లే ఆవకాశం ఉంటుంది. గుంటూరు నుంచి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చేవారు కూడా తాళ్లాయపాలెం నుంచి ఆంఫీబీయోలలో నేరుగా దుర్గా ఘాట్ కు చేరుకోవచ్చు. వీటివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

పర్యాటకంగా కూడా:
ఆంఫీబీయోల వల్ల ప్రజలకు సేవ చేయడంతో పాటు ఆమరావతి ప్రాంతం పర్యాటకంగా అభివృధి చెందుతుంది. వీటిని పర్యాటకంగా ఉపయోగించటం కోసం, ఒక రూట్ ప్లాన్ చేసారు. భవానీపురం ఘాట్‌ నుంచి నదిలో బయలుదేరి భవానీ ద్వీపం మీదుగా లోటస్‌ హోటల్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి గుహలు, మంగళగిరి లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయం, అమరావతి సచివాలయం, ఉద్దండరాయపాలెం, శ్రీశివక్షేత్రం ప్రాంతాల్లో పర్యటిస్తుంది. తిరుగు ప్రయాణంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవాలయ దర్శనం, మ్యూజియం, తదితరాలు ఉంటాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read