దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనుల్లో కీలక ఘట్టం శ్లాబ్‌ బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆరువరుసల ఫ్లైఓవర్ కు స్లాబ్ పనులు మొదలుపెట్టారు. చివరి ఘట్టమైన స్పైన్స అండ్‌ వింగ్స్‌ పనులు ప్రారంభమయ్యాయి. భవానిపురం కాస్టింగ్‌ డిపోలో తయారైన శ్లాబ్‌లను బిగించేందుకు వీలుగా పిల్లర్‌ టు పిల్లర్‌ దృఢమైన బారికేడ్లతో ఐరన్ డయాఫ్రమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భారీ ట్రాలీలపై శ్లాబ్‌ విడిభాగాలను భవానీపురం నుంచి కుమ్మరిపాలెం వద్దకు తీసుకు వచ్చారు. భారీ క్రేన్ల సహాయంతో డయాఫ్రమ్‌ పైకి చేర్చటం మొదలుపెట్టారు. అక్కడ పిల్లర్‌ నుంచి పిల్లర్‌కు శ్లాబ్‌ భాగాలను కొలత ప్రకారం పిల్లర్‌ క్యాప్స్‌పై అమర్చుతున్నారు. ఇందుకోసం అత్యంత ఆధునికమైన భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు.

ఈ అమరికలో ఏమాత్రం పొరపాటు దొర్లినా శ్లాబ్‌ భాగం కిందకు పడిపోయి విరిగిపోయే అవకాశాలున్నాయి. అందుకే ఈ పనులు చాలా కీలకమైనవి. రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఫ్లై ఓవర్‌ విషయంలో గతంలో జరిగిన పొరపాట్లకు ఇక్కడ తావివ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఐరనడయా ఫ్రేమ్‌ ఏర్పాటు కూడా ఈ జాగ్రత్తలో భాగమే. ఒకవేళ వాసిలో తేడా వచ్చి.. బిగింపులో శ్లాబ్‌ భాగం కింద పడిపోకుండా ఐరన్ డ యాఫ్రమ్‌పై ఒరుగుతుంది. దీనివల్ల మళ్ళీ దానిని సవ్యంగా బిగించటానికి అవకాశం కలుగుతుంది.

ఇంజనీరింగ్‌ అద్భుతం..
సీతాకోక చిలుక(బటర్‌ ఫ్లై) అమరికను పోలిన సాంకేతిక విధానంలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇదో ఇంజనీరింగ్‌ అద్భుతమనే చెప్పాలి. ఆరు నెలలుగా సింగిల్‌ పిల్లర్ల నిర్మాణం మాత్రమే చేపట్టడం.. ఆ పిల్లర్‌ చిన్నపాటి కాంక్రీట్‌ క్యాప్స్‌ మాత్రమే ఏర్పాటు చేయటంతో పైన డబుల్‌ లేనకు మించి అవకాశం ఉంటుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఇది ఆరు వరసల ఫ్లై ఓవర్‌ అన్న సంగతిని గుర్తించాలి. పిల్లర్‌ క్యాప్స్‌ రెండు వరసల శ్లాబ్‌ ఉంటుంది. అటు, ఇటు చెరో రెండు వరసలు దీనికి అటాచ అవుతాయి. ఇలా మొత్తం ఆరు లేన్లు చిన్నపాటి పిల్లర్‌ క్యాప్‌పైన ఇమిడి ఉండటం గమనార్హం. సీతాకోక చిలుక మధ్య భాగాన్ని దుర్గగుడి ఫ్లై ఓవర్‌లో మనం స్పైన్ అంటాము. స్పైన్‌లో భాగంగా మెయిన్ శ్లాబ్స్‌ అమర్చుతారు. సీతాకోక చిలుక రెక్కల మాదిరిగా.. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ మధ్య భాగానికి రెండు వైపులా రెక్కల మాదిరిగా మిగిలిన శ్లాబ్‌ భాగాలను అమర్చుతారు.

ఆగష్టు 15కి పూర్తి చెయ్యాలి అని లక్ష్యం ఉన్నా, కీలకమైన పనులు, కృష్ణా నిదిలో పిల్లర్లు లాంటి క్లిష్టమైన పనులు ఉండటం వలన, తొందర పడుకుండా పనులు చేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా నిర్మాణం పూర్తి చేసి ఫ్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకోవచ్చే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు క్రింద వీడియోలో చూడవచ్చు. అలాగే పనులు జరుగుతున్న ఫోటోలు చూడవచ్చు....

kanakduraga flyover 02052017 1

kanakduraga flyover 02052017 2

kanakduraga flyover 02052017 3

kanakduraga flyover 02052017 4

kanakduraga flyover 02052017 5

Advertisements

Advertisements

Latest Articles

Most Read