వాహనం వెళుతుంటే.. వెలుగును తగ్గించుకుంటాయి... రోడ్డు నిర్మానుష్యంగా ఉంటే ఆరిపోతాయి... చీకటిలో మనుషులు వస్తుంటే వాటంతటవే వెలుగుతాయి... సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ వీధిలైట్లు బెజవాడ నగరంలో తొలిసారిగా ఏర్పాటు కానున్నాయి. వాహనాలు, సెన్స్టర్లతో పనిచేసే ఈ ఎల్ఈడీ దీపాలు త్వరలో బందర్ రోడ్డులో వెలగనున్నాయి. ఇక్కడ విజయవంతమైతే నగరం మొత్తం సెన్బర్ వీధి దీపాలతో నింపుతారు. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టినట్లు నగరపాలక సంస్థ అధికారులు చెప్పారు.

విజయవాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటానికి అనేక నూతన అధునాతన ప్రాజెక్టులను అమలు చేయటానికి, నగరపాలక సంస్థ ప్రయత్నాలు చేస్తుంది.

బెంగళూరుకు చెందిన సిస్కో సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. కంట్రోల్ రూం నుంచి బెంజిసర్కిల్ వరకు 50 దీపాలను ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్నారు. పీవీపీ మాల్లో దీని కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు బెంగళూరుకు చెందిన సిస్కో సంస్థ సాంకేతిక ఆర్థిక సహకారం అందిస్తోంది. మొత్తం ఈప్రాజెక్టు వ్యయం రూ. 7.91 కోట్లుగా నిర్ధారించారు. దీనిలో సిస్కో రూ. 3.81 కోట్ల భరిస్తోంది. దీనికి సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. మిగిలిన రూ.4.10 కోట్ల విజయవాడ నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. వీఎంసీ ఇప్పటికే రూ.62 లక్షలు ఇచ్చింది.

గోల్డెన్ మైల్ ప్రాజెక్టు కింద సిసి కెమెరాలు, సెన్సార్‌లు నగరం అంతా ఏర్పాటు చేయటం ద్వారా నగర ప్రజలు నగరంలో ట్రాఫిక్, వాతావరణ సమాచారం, హ్యుమిడిటి, ఉష్ణోగ్రత, లొకేషన్ వంటి సమాచారం ప్రజలు తెలుసుకోగలరు. నగరంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వీడియో సర్వైవలెన్స్ ఆపరేషన్ ద్వారా సమాచారం తెలుసుకోవటమే కాకుండా ఆన్‌లైన్ పేమెంట్స్, ఆన్‌లైన్ ట్యాక్సెస్, థియేటర్స్ సమాచారం తెలుసకోవచ్చు. అత్యవసర పరిస్థితులలో అధికార యంత్రాంగాన్ని సంప్రదించే సదుపాయం కూడా ఇందులో ఉంటుండి.

గోల్డెన్ మైల్ ప్రాజెక్టులో భాగంగా బందరు రోడ్డులో పూర్తిస్థాయిలో వైఫై అందుబాటులోకి తెస్తారు. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటికే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఐజీఎం క్రీడా మైదానం, పీవీపీ మాల్ తదితర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది.

ప్రజా రక్షణ ఏ విధంగా ఉండాలనే దాని పై ప్రణాళికలు రూపొందిస్తున్నారు

స్మారు ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత భాగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జాం అయినా వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. దీంతో ట్రాఫిక్ మళ్లింపు చేపడతారు. ప్రస్తుతం యూటర్స్ల తీరు మార్చారు.

ఎంజీ రోడ్డులో కియోస్క్లు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా బస్సు, రైల్వే, సినిమా టిక్కెటు నమోదు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇవి ఇంకా ఏర్పాటు చేయలేదు

నగరంలో డిజిటల్ తరగతుల నిర్వహణకు నగరపాలక సంస్థలను ఎంపిక చేశారు. డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరానికి సంబంధించిన వివరాలతో సిటీ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఒక ఏజెన్సీకి అప్పగించారు.

ప్రత్యేకంగా డేటా కేంద్రాన్ని నిర్వహించాల్సి ఉంది. దీన్ని పీవీపీ మాల్ వద్ద ఏర్పాటు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read