ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది లేనట్టు, లేనివి ఉన్నట్టు చెప్పే బ్యాచ్ ఎక్కువ. ఓవర్ హైప్ చేయటం ఉసూరు మనిపించటం, అలవాటు. అసలు వార్త ఏదో నకిలీ వార్త ఏదో చెప్పటం కష్టం అయిపోయిన రోజులు ఇవి. దీనికి ముఖ్య కారణం, ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేయటానికి, ట్విట్టర్ ఉపయోగించుకోవటం, దీని కోసం డబ్బులు ఇచ్చి ఏజెన్సీలను పెట్టుకోవటం, బురద చల్లటం, లేదా తమకు లేని డబ్బా కొట్టుకోవటం అలవాటు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే, ట్విట్టర్ కూతలు అనగానే, విజయసాయి రెడ్డి గుర్తుకు వస్తు ఉంటారు. అధికార పార్టీలో నెంబర్ 2 కావటంతో, ఆయన ట్వీట్ లు వార్త అవుతాయి. అయితే విజయసాయి రెడ్డి వేసే ట్వీట్ లు అన్నీ ఫేక్ అని అనేక సార్లు రుజువు అయ్యింది. వాలంటీర్ వ్యవస్థను బ్రిటన్ గమనిస్తుందని, పెట్టుబడుల్లో ఏపి నెంబర్ వన్ అని, వ్యాక్సిన్ వేయించి పదేస్తున్నాం అని, ఇలా అనేక ఫేక్ ట్వీట్లతో అడ్డంగా దొరికారు విజయసాయి రెడ్డి. వేసే ట్వీట్లు ఆయనకు చూపించి వేస్తారో, లేక ఆయన్ను అభాసుపాలు చేయటానికి వేస్తారో కానీ, విజయసాయి రెడ్డి మాత్రం నవ్వుల పాలు అవుతున్నారు. ఇప్పుడు మరోసారి అలాగే నవ్వుల పాలు అయ్యారు విజయసాయి రెడ్డి. వారం క్రితం విజయసాయి రెడ్డి వేసిన ట్వీట్ ఫేక్ అని తేలిపోయింది.

ఏపీఎస్ ఆర్టీసి గురించి విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వేసారు. జగన్ మోహన్ రెడ్డి విజన్ వల్ల, ఎప్పుడూ లేని విధంగా, 15 ఏళ్ళ తరువాత ఏపీఎస్ ఆర్టీసికి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చేసాయని ట్వీట్ చేసారు. యదావిధగా చంద్రబాబుని కూడా నాలుగు తిట్లు తిట్టేసారు. జగన్ ను చూసి నేర్చుకోవాలని ఎలివేషన్ ఇచ్చారు. నెంబర్ టు లాంటి విజయసాయి రెడ్డి ట్వీట్ చేయటంతో, వాస్తవాలు తెలుసుకోకుండా, తమకు అనుకూలంగా ఉన్న మీడియా చానల్స్ లో డబ్బా కొట్టించారు. అయితే ఇప్పుడు అసలు విషయం బయట పడింది. ఏకంగా ఆర్టీసి ఎండీ అసలు విషయం చెప్పేసారు. ఆర్టీసికి దాదపుగా 6 వేల కోట్ల నష్టం ఉందని, నష్టాల్లో ఉన్న ఆర్టీసిని ఉద్యోగులు అధిక ఖర్చులు చేయకుండా, చూడాలని, కష్టపడి పని చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. ఏకంగా ఆర్టీసి ఎండీ చెప్పటంతో, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఫేక్ అని తేలిపోయాయి. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. విజయసాయి రెడ్డి పోరాపాటున ఆయన సొంత కంపెనీలు లాభాల్లోకి వచ్చిన విషయం చెప్పారేమో అని, కౌంటర్ ఇస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read