పెగాసెస్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి, దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ పై నిఘా పెట్టటానికి, తద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు అంటూ, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. కేంద్రం పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో, నిన్న మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు, మన రాష్ట్రంలో కూడా చర్చకు దారి తీసాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయాలి అంటూ, తనకు నాలుగేళ్ల క్రితమే ఆఫర్ వచ్చిందని, అయితే దానికి తాను ఒప్పుకోలేదని, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ సియంగా ఉన్న చంద్రబాబు, దాన్ని కొనుగోలు చేసినట్టు తమకు సమాచారం ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నిన్న ప్రముఖంగా పత్రికల్లో, టీవీల్లో వచ్చాయి. అయితే మమతా బెనర్జీ వ్యాఖ్యల పైన నారా లోకేష్ స్పందించారు. నిన్న మాండాలి వాయిదా పడిన తరువాత, లోకేష్ విలేఖరులతో చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, మమతా బెనర్జీకి కౌంటర్ ఇచ్చారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, ఇలాంటి చట్ట వ్యతిరేకత కార్యక్రమాలు టిడిపి ఎప్పుడూ చేయదని అన్నారు.

lokesh 18032022 2

ఒక వేళ తాము కనుక పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే, అసలు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉండేవారా అని లోకేష్ ప్రశ్నించారు. ఒక వేళ మేము కనుక పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే, జగన్ మోహన్ రెడ్డి అసలు మమ్మల్ని వదిలి పెట్టే వారా ? మూడేళ్ళ నుంచి జగన్ రెడ్డి మమ్మల్ని ప్రశాంతంగా ఉంచే వారా అని లోకేష్ ఎదురు ప్రశ్నించారు. టిడిపి ఏమి తప్పులు చేసిందో చెప్పండి అంటూ, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అన్ని వ్యవస్థలను జగన్ మోహన్ రెడ్డి వాడుకుని, మొత్తం అన్ని శాఖలు తనిఖీ చేయించారని, మేము పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే బయట పాడేది కదా ఆని అన్నారు. మమతా బెనర్జీ నిజంగా ఆ కామెంట్ చేసి ఉంటే కనుక, ఆమెకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని, లోకేష్ అన్నారు. వ్యవస్థలను నమ్మి, అవే శాస్వతం అని నమ్మే వ్యక్తి చంద్రబాబు గారని, చంద్రబాబు ఎప్పుడూ చట్ట వ్యతిరేకత పనులు చేయరని, అందుకే 40 ఏళ్ళు, ఆయనను ఎవరూ ఏమి చేయలేక పోయారని అన్నారు.

చేసింది అంతా చేసారు. అటు రాష్ట్రాన్ని నాశనం చేసారు, ఇటు ప్రజలను ఇబ్బందులు పెట్టారు. బయటకు రాకుండా ఊహల్లో బ్రతికారు. ఇప్పుడు వాస్తవం తెలిసి లబోదిబో అంటూ హడావిడి చర్యలు మొదలు పెట్టారు. ఇది జగన్ మోహన్ రెడ్డి గారు గత వారం రోజులుగా ప్రవతిస్తున్న తీరు. రియాలిటీలోకి వచ్చారని భావించినా, ఇప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోయిందని, ఇక వెనక్కు రావటం కష్టమే అనే భావన ప్రజల్లో ఉంది. ఇక విషయాని వస్తే, జగన్ మోహన్ రెడ్డి గత మూడేళ్ళుగా బయటకు వచ్చింది లేదు చేసింది లేదు. ఆయన లోపలే ఉంటూ, అంతా సూపర్ అంటూ భ్రమల్లో ఉండే వారు. నా పాలనలో అందరూ సంతోహంగా ఉన్నారని ఆయన భావన. ఎవరు తప్పులు ఎత్తి చూపినా, వారిని శత్రువులుగా ఉన్మాదులుగా చూసేవారు. చివరకు ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, సొంత పార్టీ ఎంపీని కొట్టే దాకా వెళ్ళింది. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అపాయింట్మెంట్ కూడా ఉండేది కాదు. అలా ఊహా లోకాల్లో విహరిస్తూ, 30 ఏళ్ళ వరకు నాకు తిరుగు లేదు అంటూ, జగన్ మోహన్ రెడ్డి బ్రతికేసేవారు. అయితే మొత్తానికి ఆయన రియాలిటీలోకి వచ్చారు. భ్రమలు తొలగిపోయాయి. వాస్తవం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అందుకే ఉన్నట్టు ఉండి జగన్ లో మార్పు కనిపిస్తుంది.

ysrcp 17032022 2

మూడేళ్ళ తరువాత, ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. ఇప్పటి వరకు ఎంజాయ్ చేసింది చాలు, ఇక ఇంటిఇంటికీ తిరగాలని ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇన్నాళ్ళు మనం ప్రజల్లో లేమని, ఆయనే చెప్తున్నాడు. ఇక 50 మంది ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉందని జగనే చెప్తున్నారు. బయటకు 50 మంది మీద వ్యతిరేకత అంటే, లోపల ఇంకా రిపోర్ట్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మూడేళ్ళకే పరిస్థితి ఇంత దారుణంగా ఉందని జగన్ గమనించారు. ముఖ్యంగా జగన మోహన్ రెడ్డికి వచ్చిన సర్వే రిపోర్ట్ లో దారుణమైన ఫలితాలు ఉండటం, రెండు మూడు సర్వే సంస్థలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయటంతో, జగన్ మోహన్ రెడ్డి వాస్తవంలోకి వచ్చారు. అందుకే రెండేళ్ళ ముందు నుంచి, ఎన్నికలు ఎన్నికలు అంటూ పాట పాడుతున్నారు. దారుణమైన ఆర్ధిక పరిస్థితికి తోడు, దారుణమైన పాలన తోడయ్యి, జగన్ ప్రభుత్వం రోజు రోజుకీ ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. ఈ పరిస్థితిలో, ప్రజల వద్దకు వెళ్ళటం ఒక్కే మార్గం అని జగన్ మోహన్ రెడ్డి గమనించి, దిద్దుబాట చర్యలు మొదలు పెట్టారు.

వైసీపీ ప్రభుత్వం గుట్టుగా చేసిన వ్యవహరం ఇది. అయితే వాళ్ళ పార్టీ ఎంపీలే గుట్టు రట్టు చేసిన అనూహ్య ఘటన నిన్న పార్లమెంట్ లో జరిగింది. న్యూక్లియర్ శక్తి కోసం ఉపయోగపడే బీచ్ స్యాండ్ మన రాష్ట్రంలో అధికంగా ఉంది. వీటిని వైసీపీ ప్రభుత్వం విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసినట్టు కేంద్రం భావిస్తుంది. సహజంగా ఇవి ఎగుమతి చేయాలియా అంటే, కేంద్రం అనుమతి తప్పని సరి. అణు ఇంధన సంస్థ ప్రత్యేక అనుమతి ఉంటే కానీ, ఇది సాధ్య పడదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవి అక్రమంగా తరలిస్తుంది అంటూ కేంద్రానికి ఫిర్యాదులు వెళ్ళటంతో, కేంద్రం దీని పై సమగ్ర విచారణ కోరింది. అంతే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బీచ్ సాండ్ కోసం కోరిన అనుమతులు కూడా కేంద్రం రద్దు చేసింది. ఈ నేపధ్యంలోనే అనూహ్యంగా వైసీపీ ఎంపీలు నిన్న కేంద్రాన్ని ఇదే అంశం పై ప్రశ్నించారు. ఏపి ప్రభుత్వం బీచ్ సాండ్ మైనింగ్ అనుమతిని కేంద్రం పరిగణలోకి తీసుకుండా లేదా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. అనూహ్యంగా ఈ ప్రశ్నకు, ప్రధాని కార్యాలయ మంత్రి జితేందర్‌సింగ్‌ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సమాచారం ఉంది. అసలు వైసీపీ ఎంపీలు, కావలని, ఈ ప్రశ్నలు ఎందుకు అడిగి, ఎదురు వాళ్ళ గుట్టు బయట పెట్టుకున్నారు అనేది అర్ధం కాని ప్రశ్న.

ycp 17032022 2

ఇక కేంద్రం సమాధానంలో ఉన్న అంశాలు ఏమిటి అంటే, మచిలీపట్నం, భీమిలి నుంచి బీచ్ సాండ్ తీసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఏపి నుంచి ఈ బీచ్ సాండ్ పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్లినట్టు మాకు ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం తెలిపింది. ఈ ఫిర్యాదులు న్యూక్లియార్ ఎనర్జీకి సంబంధించినవి కావటంతో, కేంద్రం సీరియస్ గా తీసుకుని, దీని పై సమగ్ర నివేదిక కావాలని రాష్ట్రాన్ని కోరాయి. అక్రమ మైనింగ్ పై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరినా రాష్ట్రం ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 17 చోట్ల అనుమతి కోరగా, తాము రెండు చోట్ల అనుమతి ఇచ్చామని, అక్కడ కూడా అక్రమాలు జరిగాయని తెలియటంతో, మిగతా 15 చోట్ల అనుమతి ఇవ్వలేదని కేంద్రం చెప్పింది. మిగతా రెండు చోట్ల నుంచి తీసిన బీచ్ స్యాండ్ ఏమి చేసారు అని రాష్ట్రాన్ని కోరగా, ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి సమాధానం లేదని కేంద్రం చెప్పింది. మొత్తానికి దేశ భద్రతకు సంబంధించి కీలక అంశం అయిన, న్యూక్లియర్ పవర్ లో కూడా, రాష్ట్ర ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతుందని అర్ధం అవుతుంది.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి, వైసిపీ ప్రభుత్వంలో చేస్తున్న అనేక స్కాంలు బయట పెడుతూ ఉంటారు. ఆయన చేతిలో కాగితం, ఆధారాలు లేనిదే ప్రెస్ మీట్ పెట్టరు. గాల్లో ఆరోపణలు చేసి, బురద జల్లి వెళ్ళిపోరు. అందుకే పట్టాభిని ఎలాగైనా ఇరికించాలని ఎంత ప్రయత్నం చేసినా, ఆయన పైన ఎలాంటి ఫేక్ కేసులు పెట్టే సాహసం వైసిపి చేయలేక పోయింది. చివరకు అసహనంతో ఆయన పై రెండు సార్లు అటాక్ చేసారు, ఇంటి మీదకు వెళ్ళారు. పట్టాబి ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే, ఎవరికో మూడి నట్టే. ఈ వారం కూడా పట్టాభి, అలాగే టార్గెట్ చేసారు. తణుకులో టీడీఆర్ బాండ్ల జారీ పై అతి పెద్ద స్కాం జరిగిందని, అందులో వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి హస్తం ఉంది అంటూ, పట్టాబి గత రెండు రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి, ఆధారాలు బయట పెట్టి, వైసీపీని ముప్పు తిప్పలు చేసారు. ముందుగా వైసీపీ యధాప్రకారం బుకాయించింది, పట్టాభి పై ఎదురు దా-డి చేసారు. అయితే ఏమైందో ఏమో కానీ, అడ్డంగా ఇరుక్కున్నాం అని ప్రభుత్వానికి అర్ధమైందో, లేదా కోర్టుకు వెళ్తే ఇబ్బంది అని భావించారో కానీ, పట్టాభి దెబ్బకు ప్రభుత్వం దిగి వచ్చింది. ముందుగా చేసిన బుకాయింపులను పక్కన పెట్టింది. 24 గంటల్లో చర్యలు తీసుకుని, పట్టాభి బయట పెట్టిన స్కాం నిజమే అని తేల్చింది.

pattabhi 17032022 2

టీడీఆర్ బాండ్ల జారీలో అవకతవకలకు సంబంధించి, తణుకు మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి రామకృష్ణ, సూపర్ వైజర్ ప్రసాద్ లను సస్పెండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. పట్టాభి ఆరోపణల నేపధ్యంలో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. టీడీఆర్ బాండ్లు అంటే, బదిలీకి వీలు ఉన్న హక్కు పత్రాలు. పురపాలక అవసరాలు కోసం అంటూ, రెండు స్థలాలకు ఈ బండ్లు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా, మొత్తం నిబంధనలకు ఉల్లంఘించి, ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇదంతా వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి ఒత్తిడితో జరిగిందని, దీని వెనుక ఆయనే ఉన్నాడు అంటూ, పట్టాభి ఆరోపించారు. ఇప్పుడు అవే నిజం అని తేలాయి. ఎప్పటి లాగే నాయకులు తప్పించుకున్నారు, అధికారులు బలయ్యారు. చేపించిన ఎమ్మెల్యే సేఫ్ అయ్యాడు అని, అధికారులను సస్పెండ్ చేసి తప్పించుకోలేరని, ఎమ్మెల్యే పై చర్యలు తీసుకునే వరకు, వదిలి పెట్టేది లేదని పట్టాభి అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read