నాడు శాసన మండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సిఎం వైఎస్ జగన్ కు ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్ర‌శ్నించారు. సీఆర్డీఏ ర‌ద్దు, మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను మండ‌లిలో ఆధిక్యం ఉన్న తెలుగుదేశం తిప్పి పంప‌డంతో ఏకంగా మండ‌లి ర‌ద్దుకి తీర్మానం చేసింది వైసీపీ ప్ర‌భుత్వం. ఆ త‌రువాత మండ‌లిలో వైసీపీ బ‌లం పుంజుకోవ‌డంతో మండ‌లి ర‌ద్దు తీర్మానాన్ని వైసీపీ లైట్ తీసుకుంది. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని టిడిపి అధినేత వైసీపీపై ప్ర‌యోగించారు. తన మాట నెగ్గలేదనే అహంకారంతో నాడు ఏకపక్షంగా జగన్ మండలి రద్దుకు తీర్మానం చెయ్యలేదా అని  చంద్ర‌బాబు ప్రశ్నించారు. శాసన మండలి వల్ల ప్రజా ప్రయోజనం లేదని, దీనిపై ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కూడా దండగే అని సిఎం జగన్ అనలేదా అని టిడిపి అధినేత నిల‌దీశారు. మండలి లాంటి వ్యవస్థలను అగౌర పరిచిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి...ఓట్లు అడుగుతారని చంద్రబాబు నాయుడు నిల‌దీశారు. పట్ట భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలపై పార్టీ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ మండ‌లి ర‌ద్దు వ్యాఖ్య‌ల‌ను అభ్య‌ర్థులు బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు.  నేతలంతా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక ఉందని.... అదే సమయంలో తెలుగుదేశానికి అనుకూలంగా పరిస్థితి ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఈ ఎన్నికలు ఇంచార్జ్ లు, నేతల పరితీరుకు, సమర్థతకు పరీక్ష గా ఉండబోతున్నాయని ఆయన అన్నారు. ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి  భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.చిరంజీవి రావు లను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ప‌ద‌వి ఈ సారి విస్త‌ర‌ణ‌లో ఎగిరిపోనుంద‌నే టాక్ వినిపిస్తోంది. మంత్రివ‌ర్గంలో చేర్పులు-కూర్పులు-మార్పులు వార్త‌లు వ‌చ్చిన త‌రువాత తొలిసారిగా స్పందించింది సీదిరి అప్ప‌ల‌రాజు కావ‌డంతో ఈ వికెట్ కేబినెట్ నుంచి అవుట్ అవ్వొచ్చ‌నే అనుమానాలు వ‌స్తున్నాయి. సీఎం కేబినెట్ నుంచి త‌ప్పిస్తున్నామ‌ని చెప్ప‌క‌పోతే సీదిరి అప్ప‌ల‌రాజు ఇలా స్పందించి వుండ‌ర‌ని వైసీపీ నేత‌లే గుస‌గుస‌లాడుకుంటున్నారు. మంత్రి వర్గంలో కొత్తగా కొన్ని వర్గాలకు ముఖ్య‌మంత్రి అవకాశం ఇవ్వాలనుకుంటే.. తానే మొదటిగా రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో సీదిరి సీటు ఖాళీ అవుతోంద‌ని అర్థం అవుతోంద‌ని వైసీపీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. గ‌త సారి సీదిరి అప్ప‌ల‌రాజుని మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పిస్తార‌ని వార్త‌లొచ్చినా, ఆయ‌న కేబినెట్లోనే కొన‌సాగారు. ఈ సారి మాత్రం సీదిరి ప్లేసులో పొన్నాడ స‌తీష్‌ని తీసుకుంటున్నార‌ని అప్పుడే వైసీపీ స‌ర్కిల్లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఇంత‌కంటే దిగ‌జార‌వ‌నుకున్న ప్ర‌తీసారీ మ‌రింత దిగ‌జారి మాట్లాడ‌టం ల‌క్ష్మీపార్వ‌తికి వ్య‌స‌నంగా మారిపోయింది. వైసీపీ అధినేత మెప్పు పొందేందుకు ఎంత‌కైనా తెగించే ల‌క్ష్మీపార్వ‌తిని చూసి వైసీపీ నేత‌లే అస‌హ్యించుకుంటున్నారు. నందమూరి తారకరత్న మృతి ప‌ట్ల వైసీపీ నేత‌లు, పేటీఎం సైకోలు వ్య‌వ‌హ‌రించిన తీరు దారుణ‌మంటే, తార‌క‌ర‌త్న‌కి నాయ‌న‌మ్మ‌ని అవుతాన‌ని చెప్పుకునే ల‌క్ష్మీపార్వ‌తి అంత‌కంటే ఘోరంగా వ్య‌వ‌హ‌రించి, ఛీకొట్టించుకుంటున్నారు.    జ‌న‌వ‌రి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాదయాత్ర ప్రారంభానికి హాజ‌రైన తారకరత్న గుండెపోటుతో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కుప్పంలో చికిత్స అనంత‌రం 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంత్య‌క్రియ‌లు కూడా పూర్త‌య్యాయి. పార్టీల‌కు అతీతంగా అంద‌రూ నివాళులు అర్పించారు. ఒక్క ల‌క్ష్మీపార్వ‌తి మాత్ర‌మే తార‌క‌ర‌త్న మ‌ర‌ణాన్ని కూడా రాజ‌కీయం చేసి ల‌బ్ధి పొందాల‌ని ప్ర‌య‌త్నించి అంద‌రితోనూ ఛీకొట్టించుకుంటోంది.  యువ‌గ‌ళం పాద‌యాత్ర ఆరంభం రోజే తారకరత్న చ‌నిపోయార‌ని, లోకేష్ పాద‌యాత్ర‌కి అడ్డంకి కాకుండా ఇన్నాళ్లూ దాచార‌ని నందమూరి లక్ష్మీపార్వతి విషం చిమ్మారు. తారకరత్న బ్రెయిన్ డెడ్ అయ్యార‌ని,   తారకరత్న మరణించినట్లు డాక్టర్లు తొలి రోజే నిర్ధారించారని లక్ష్మీపార్వతి త‌న దుష్ట‌బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకున్నారు.  తార‌క‌ర‌త్న భార్య‌కి బంధువైన విజ‌య‌సాయిరెడ్డే నందమూరి-నారా కుటుంబాలు మంచి వైద్యం అందించాయ‌ని కితాబునిచ్చారు. నిత్య‌మూ చంద్ర‌బాబు, లోకేష్‌, టిడిపిపై విరుచుకుప‌డే సాయిరెడ్డి త‌న హుందాగా ప్ర‌వ‌ర్తిస్తే..నంద‌మూరి ఇంటి పేరు త‌గిలించుకుని ఆ కుటుంబంపై అనునిత్య‌మూ విషం చిమ్మే ల‌క్ష్మీపార్వ‌తిపై ఎన్టీఆర్ అభిమానులు ఊస్తున్నారు. వైసీపీ వాళ్లే ఆమె తీరు ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ పాలన తారా స్థాయికి చేరుకుంది. బాదితుల పైనే దాడులు చేసి, బాధితుల పైనే కేసులు పెట్టి, బాధితులనే కొట్టి, బాదితులనే కోర్టులో ప్రవేశ పెట్టారు అంటే, రాష్ట్రంలో పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది. నిన్న గన్నవరం టిడిపి ఆఫీస్ పై అటాక్ చేసి, అక్కడకు సంఘీభావంగా వచ్చిన పట్టాభిని అరెస్ట్ చేసారు. ఒక రోజు తరువాత అరెస్ట్ చూపించి, ఆయన పై హత్యాయత్నం కేసు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయితే కొద్ది సేపటి క్రిందట పట్టాభిని గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా పట్టాభి జడ్జి ముందు సంచలన వ్యాఖ్యలు చేసారు. తన పై థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టారని పట్టాభి జడ్జికి తెలిపారు. తనను గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి అక్కడ కొట్టారని తెలిపారు. కొంత మంది ముసుగులు వేసుకుని వ్యక్తులు వచ్చారని, పోలీస్ స్టేషన్ లో తన ముఖానికి టవల్ చుట్టి, అటు ఇటూ ఈడ్చుకుని వెళ్లి, అరి కాళ్ళు, అరి చేతుల పై కొట్టారని పట్టాభి తెలిపారు. పట్టాభి తన బాధ చెప్పుకోవటం చూసి, అక్కడ ఉన్న వారి షాక్ తిన్నారు.

Advertisements

Latest Articles

Most Read