balayya into tamil politics

నందమూరి బాలకృష్ణ, తెలుగు ప్రజలకి బాగా తెలిసిన ఈ పేరు ఇప్పుడు తమిళ రాజకీయ నేతల నోట్లో కుడా నానుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటు తెలుగు రాజకీయాల్లో కూడా తండ్రికి తగ్గ తనుయుడిగా వారసుడిగా బాలయ్యకి కావలసినంత ఫాలోయింగ్ ఉంది. మొన్నటి వరకు కేవలం సినిమాలకి పరిమితం అవుతూ,అవసరమైనప్పుడు పిలవకుండానే వచ్చి తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీకి సేవ చేశాడు బాలయ్య.

బాలయ్య పసుపు కండువా వేస్తే చాలు ఆరోజు అక్కడ జనం ఈలలు వేసి పూలుజల్లుతూ జై బాలయ్య అంటూ స్వాగతం పలికేవారు అది బాలయ్య రేంజ్.స్వయంగా రాజకీయ అపర చాణక్యుడుగా పిలవబడే బాలయ్య బావ చంద్రబాబు సైతం బావమరిది సాయం చాలా సార్లు తీసుకున్నాడు. బ్రతికుండగా ఎన్టిఆర్ స్వయంగా బాలయ్య గొప్పతనం, రాజకీయాల్లో బాలయ్య చేసిన మ్యాజిక్ ఏంటో స్వానుభూతి పొంది.పార్టీ నాయకులకి బాలయ్యని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

అలాంటి బాలయ్య రాజకీయాల్లోకి రావాలంటూ ఎప్పటి నుండో కోరుకుంటున్న అభిమానుల కోరిక మొన్న జరిగిన తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో నిజం చేశాడు బాలయ్య. అయితే మంత్రి పదవి బాలయ్య పాదాల వద్దకు వచ్చిన తను ప్రస్తుతం ఉన్న పర్స్తితిలో దాన్ని తీసుకుని న్యాయం చేయలేను అని తెలిసి ఏ పదవి తీసుకోకుండా ఆగిపోయాడు బాలయ్య. అది బాలయ్య గొప్పతనమో మంచి తనమా అనేది పక్కన పెడితే బాలయ్య ఒక నటుడిగా, నాయకుడిగా, సంఘ సంస్కర్తగా, బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా, ఒక తండ్రిగా, భర్తగా ఇలా అనేక బాధ్యతలు సమర్దవంతంగా నిర్వహిస్తుంది. అయితే తమిళనాడులో పుట్టి పెరిగా అంటూ అనేక ఫంక్షన్ లలో చెప్పిన బాలయ్య కోసం ఇప్పుడు తమిళులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

త్వరలో రానున్న తమిళ ఎన్నికల్లో బాలయ్యని వాడుకోవాలని ఆశగా చూస్తుంది తెలుగుదేశం మిత్ర పక్షం అయిన బీజేపి. ఇప్పటికే అక్కడ తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన బీజేపి తాజాగా విశాల్ మీద అసలు పెట్టుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల సరిహద్దు, తెలుగువారు ఎక్కువగా ఉండే చోట బాలయ్య ఇమేజ్ ని వాడుకుని సుమారు 10 సీట్లు అయిన కొట్టొచ్చు, పైగా బాలయ్య ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ విజయం తప్పక వరిస్తుంది అని ఆసతో ఉన్నారంట తమిళ బీజేపినాయకులు. ఎలాగు మిత్రపక్షమే కాబట్టి బాలయ్య కూడా కొంచెం సహకరించే అవకాశం ఉంది అంటున్నారు. ఇదే విషయం పై కేంద్ర నాయకులూ త్వరావు బాబు ద్వారా బాలయ్యని సంప్రదించే అవసకాశం ఉంది. చూద్దాం మరి నటసింహం ఏమంటాడో? తమిళ తంబీలకి చేయ్యిచ్చి ఆడుకుంటాదో లేక కుదరదని సున్నితంగా తిరస్కరిస్తాడో.

Advertisements

తమిళ రాజకీయాల్లోకి బాలయ్య ఎంట్రి Last Updated: 22 March 2016