revanth telangana 30032016

ప్రస్తుతం తెలంగాణా అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్ ఇదే. రేవంత్ కు కెసిఆర్ సీటు కేటాయించారు కదా అనే చర్చ కొనసాగుతోంది. ఇంతకీ విషయం ఏంటి అంటే. టీడీపీలో ఉన్న మొత్తం 15 మందిలో 12 మంది టీఆర్ఎస్ లో చేరాక, అసెంబ్లీలో కూర్చునే సీట్లల్లో మార్పులుచేర్పులు చేశారు. రేవంత్ రెడ్డికి సీటు నెంబర్ 123 కేటాయించారు స్పీకర్ మధుసూదనాచారి.

అయితే ఏంటి అంటారా ? 123 నెంబర్ సీట్లో గతంలో కేసీఆర్ కూర్చునే వారు. 1999లో టీడీపీకి గుడ్ బై చెప్పిన కేసీఆర్, ఉప ఎన్నికల్లో గెలిచారు. అప్పుడు స్పీకర్ గా ఉన్న ప్రతిభా భారతి ఆయనకు సీటు నెంబర్ 123 కేటాయించారు.

గతంలో కేసీఆర్ కూర్చున్న సీటునే ఇప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణా అసెంబ్లీలో కూర్చోబెట్టారు. ఆ సీట్లో కూర్చున్న కేసీఆర్ ఇప్పుడు సిఎం అయ్యారు. ఆ సెంటిమెంట్ తో, భవిష్యత్ లో రేవంత్ రెడ్డి కుడా సిఎం అవుతారేమో అని గుసగుస లాడుతున్నారు. చూద్దాం...

Advertisements

తెలంగాణా అసెంబ్లీలో రేవంత్ కు కెసిఆర్ సీటు కేటాయించారు Last Updated: 30 March 2016