kcr and Tirumala 31032016

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రత్యేక రైలులో తిరుపతికి రానున్నారు. ఆయనతో పాటు పది జిల్లాల ప్రజలు కుడా వస్తున్నారు. ఎందుకో తెలుసా ?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మొక్కు చెల్లించుకోవడానికి తిరుపతికి కెసిఆర్ వస్తున్నారు. అందుకోసం ఓ ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. శ్రీవారికి రూ.5 కోట్ల కానుక‌లు చెల్లిస్తారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి తాను ఒక్కడినే కాకుండా పది జిల్లాల నుంచి ప్రజలను తీసుకెళ్తానని చెప్పారు.

కేసీఆర్ తిరుమ‌ల వెంక‌న్న‌కు మొక్కులు తీర్చుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం గ‌తంలోనే జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం తిరుమల వెంకన్నకు ఏడు కోట్ల ఆభరణాలు కానుకగా ఇవ్వనున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 15 గ్రాములతో ముక్కుపుడక మొక్కు కుడా కెసిఆర్ త్వరలో తీర్చుకోనున్నారు.

Advertisements

ప్రత్యెక రైలులో తిరుపతికి కెసిఆర్ Last Updated: 31 March 2016