jagan somireddy 08042016

వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పై టిడిపి ఎంఎల్ సి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెల్లడం ఖాయమని , అధినేత జైలు కి వెళితే తమ పరిస్థితేమిటనే ఆలోచనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ ఈడీ కేసుల నుంచి బయటపడే అవకాశం లేదని, 11 కేసుల్లో జగన్ పై విచారణ జరుగుతోందని, జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో వైసిపి ఎమ్మెల్యేలు గందరగోళంలో పడిపోయారని అన్నారు.

దీంతో ముందు వారి భవిష్యత్తును చూసుకోవడంలో నిమగ్నమయ్యారని, ఆ కోవలోనే ఈ వలసలు అని, మున్ముందు మరింత మంది వైసిపి ఎంఎల్ఏ లు టీడీపీలోకి చేరనున్నారని అయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు జైల్లోనే ఉంటుంది ? బయట ఉండదు? అనే అనుమానంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యం స్పష్టంగా తెలుస్తుందని అందుకే వైసిపి ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని సోమిరెడ్డి అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు అని , అయన మూర్ఖపు వైఖరి వల్లే వైసిపి పార్టీ కి ఆ గతి పట్టిందని , రానున్న రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి అయన కుటుంబ సభ్యులు , రోజా తప్ప ఆ పార్టీ లో ఎవరు ఉండరని సోమిరెడ్డి ఎద్దేవా చేసారు.

Advertisements

జగన్ బ్రతుకు జైలు కే... సోమిరెడ్డి ఫైర్ Last Updated: 08 April 2016