cbn birthday 19042016

చంద్రబాబు నాయుడు, ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు...అయన 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం అలాంటిది మరి...66వ ఏట అడుగుపెడుతన్న మన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలతో...

ఆయన ఒక సామన్యుడు, ఏ రాజకీయ నేపధ్యం లేనివాడు, తండ్రి ఒక సామాన్య అయుదు ఎకరాలు సాగు చేసుకునే రైతు, తల్లి ఒక కష్ట జీవి...ఆయన మాత్రం నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను శాశిస్తూ, అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు...ఆయనే నారా చంద్రబాబు నాయుడు..

నారావారి పల్లె లాంటి మారు మూల గ్రామంలో పుట్టిన అతి సామాన్యుడు, తిరిగులేని శక్తిగా ఎలా మారారు...గవర్నమెంట్ స్కూల్ లో చుదువుకున్న ఒక సామాన్య కుర్రవాడు, టైమ్స్ మాగజైన్ లో స్పెషల్ స్టొరీ వేసే స్థాయికి ఎలా చేరాడు....క్లింటన్, టోనీ బ్లెర్ లాంటి దేశాధినేతల మనసు ఎలా దోచుకున్నారు....బిల్ గేట్స్ లాంటి కార్పొరేట్ దిగ్గజాల్ని ఎలా ఆకట్టుకున్నారు....

దేశం మొత్తం మీద, సారీ ప్రపంచం మొత్తం మీద 24/7 ప్రజా నాయకుడు అంటే ఆయనే...వ్యక్తిగత జీవితం లేదు, ఒక సరదా లేదు, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చెయ్యటం లేదు...66 ఏళ్ళ వయసులో మనవడితో ముచ్చటించలేని స్థితి ఆయనది....ఆయన ఎంజాయ్ చేసేది అయన పనిని, అయన కష్టాన్ని...పొద్దున్న లెగిసిన దెగ్గర నుంచి, పడుకునే దాక, విశ్రాంతి అనేది ఉండదు ఆ మనిషికి....రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామం, ప్రతి మండలం స్వరూపం మొత్తం తెలుసు ఆయనకు...డెబ్బైల్లో రాజకీయాలు చూసారు, ఎనభైల్లో రాజకీయాలు చూసారు, తొంబైల్లో రాజకీయాలు చూసారు, ఇప్పుడు 2016 రాజయకీయలు చూసారు...పాతికేళ్ళకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఇప్పటికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనది...రాజాకీయ అపర చానిక్యుడు అంటారు ఆయనని...అయన చూడని ఎత్తులు లేవు, ఆయనకి ఎదురైన అవరోధాలు లేవు...అన్ని తట్టుకుని ముందుకు సాగరు, సాగుతూనే ఉన్నారు....రాష్ట్ర రాజకీయం కాదు, కేంద్ర రాజకీయ్యాల్లో కుడా ఆయనకి ప్రత్యెక స్థానం ఉంది...

రాజకీయాల్లో పోలిటీషియన్ లే ఉంటారు, కాని ఆయన అడ్మినిస్ట్రేటర్గానే ప్రజలు గుర్తిస్తారు....రాష్ట్రానికి IT పరిచియం చేసిన హై-టెక్ CM ఆయనే, 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేత గా, మళ్ళి ఇప్పుడు నవ్యాంధ్ర మొదట ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో ఎవరకి లేని అవకాసం ప్రజలు ఆయనకి ఇచ్చారు...

ఎలిమినేటి మాధవరెడ్డి, ఎర్రం నాయుడు, దేవినేని రమణ, పరిటాల రవి లాంటి ఎంతో ముఖ్యమైన నాయకలు చనిపోయినా...రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన రాజకీయం, 2012 జగన్ హవా, 2014 రాష్ట్ర విభజన, 2015 లో తెలంగాణాలో కెసిఆర్ వేసిన దెబ్బ....ఇలా అన్ని దెబ్బలు తగిలినా, మళ్ళి లేగుస్తాడు, సరిచేసుకుంటాడు, మళ్ళి మొదలు పెడతాడు..అది ఆయన సైలె... ఎన్ని ఎదురుదెబ్బలు తిన్న, పోరాట పటిమ అస్సలు తగ్గకుండా, అంతే వేగంతో దూసుకు వెళ్తున్న పొలిటికల్ మిస్సైల్ ఆయన...ఆయన నినాదాలతో పార్టి రూపు రేఖలను, ఆయన విధానాలతో రాష్ట్ర అభివ్రుది రూపు రేఖలను మార్చేసిన ఘనుడు ఆయన....సంస్కరణలు అంటే ఏంటో దేశానకి చెప్పి, గవర్నమెంట్ అంటే ఎలా పని చెయ్యాలో చేసి చూపించాడు ఆయన....జన్మభూమి, ప్రజల వద్దకు పాలనా అంటూ, నిద్రపోతున్న ఉద్యోగులను పరుగులు పెట్టించిన నాయకుడు ఆయన...ఇప్పుడు ఏమి లేని నవ్య ఆంధ్రకి పెద్ద దిక్కు ఆయనే...పెట్టుబడిదారులకు అయస్కాంతం ఆయన..ఆయన పడుకోడు, ఎదుటివాళ్ళని పడుకోనివ్వాడు...పని పని పని....అదే ఆయన బలం...ఇంత పనిలో కుడా ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటారు...చక్కటి ఆహరం, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా...ఇదే ఆయన హెల్త్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్....క్రమశిక్షణ, కష్టపడటం, నిజాయితీ ఇది ఆయన సక్సెస్ సీక్రెట్....

ఇది ఆయన వ్యక్తిగత జీవన ప్రస్థానం...

  • 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా, నారావారి పల్లెలో తండ్రి ఖర్జూర నాయుడు, తల్లి అమ్మన్నమ్మ కు జన్మించారు చంద్రబాబు...డిగ్రీ చదివే రోజుల్లోనే కాలేజి రాజకీయాల్లో అడుగుపెట్టారు. డిగ్రీ కంటే ముందే, కాంగ్రెస్ పార్టీలో చేరారు...ఆచార్య ఎన్జీరంగా, పాతూరి రాజగోపాల్ అయన రాజకీయ గురువులు...
  • 1978 ఎన్నికలలో చంద్రబాబుకి MLA టికెట్ ఇచ్చారు. 28 ఏళ్ళకే, 1980-83 మధ్య మంత్రిగా పనిచేసారు.
  • చంద్రబాబుకి ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు..
  • ఆయనకి కష్టం అనేది చిన్ననాటి నుంచే పరిచయం...ఆయన స్కూల్ కి రోజు అయుదు కీ.మీ నడుచుకుంటూ వెళ్ళే వారు...
  • 1980 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ కుమార్తె భువనేస్వరిలో వివాహం జరిగింది.
  • 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి భాద్యతలు అప్పగించారు.

అధినేతగా పార్టీని, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని తనదైన స్టైల్ లో ముందుకి తీసుకువేల్తున్నారు..44 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళి పుట్టారేమో...

ఆయన కష్ట జీవి...కష్టం అనేది చాలా మజానిస్తుంది, సక్సెస్ కూడా ఇవ్వలేనంత గొప్ప సంతృప్తిని ఇస్తుంది. కష్టం ఇచ్చిన మజాకి రుచి మరిగిన వాడికి విజయం గురించి పెద్దగా పట్టింపు ఉండదు. విజయమైనా, అపజయమైనా వాడికి కావలసిన సంతృప్తి వాడు ఆల్రెడీ ఆస్వాదించాడు. అదీ శ్రమైక జీవన సౌందర్యం!! అదే చంద్రబాబు నైజం....

హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారు....మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి....

Advertisements

చంద్రబాబు నాయుడు, 66వ ఏట అడుగు పెడుతూ, హై స్పీడ్ తో దూసుకు పోతున్న పొలిటికల్ మిస్సైల్ Last Updated: 19 April 2016