china conins 1

మనం ఎక్కడికి వెళ్ళిన, మార్కెట్లో చిల్లర ఇమ్మని అడుగుతారు. చిల్లర లేకపోతె చిరాకు పడతారు వ్యాపారస్తులు. ఇక బస్సు కండక్టర్లు అయితే సరే సరి. కాని చైనాలో చిల్లర అంటే హడలి పోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే, చైనాకు చెందిన ఓ మహిళ కొన్ని సంవత్సరాలు నుంచి సంపాదించిన ఈ చిల్లరను ఇప్పటి వరకు ఇంట్లోనే దాచుకుంది. అయితే, ఇప్పుడు బ్యాంకులో వేయాలన్న ఐడియా వచ్చింది. వెంటనే ఆ చిల్లరను మూటల్లో సర్దేసి వాటిని ట్రక్కులో వేసుకుని బ్యాంకుకు బయలుదేరింది. ఇంతకీ ట్రక్ ఎందుకు అనుకుంటున్నారా ? ట్రక్ ఎందుకంటే అమె దాదాపు 1.2 కోట్ల విలువ చేసే చిల్లరను డిపాజిట్‌ చెయ్యాలి అనుకుంటుంది.

బ్యాంకు వాళ్ళు మాత్రం అంత చిల్లరను లెక్కపెట్టటం మా వల్ల కాదు, వాటిని దాచే స్థలం తమ వద్ద లేవు అని చేతులు ఎత్తేసారు. ఏ బ్యాంకులో ప్రయత్నించినా అందరూ ఇలాగే చేతులెత్తేశారు.

చివరకు ఆమె ప్రయత్నం ఫలించి, అగ్రికల్చర్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంకు ఆ చిల్లరను తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఆ డబ్బును వారం రోజుల పాటు తమ బ్యాంకు సిబ్బంది అందరి చేతా లెక్కించి డిపాజిట్‌ చేసుకుందట. ఆ బ్యాంకు ఖాతాదారుల్లో ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉండడం, వారికి చిల్లరతోనే ఎక్కువ పని ఉండడం వల్ల ఆ బ్యాంకు అంత చిల్లర తీసుకుందట.

china conins 2

Advertisements

1.2 కోట్ల చిల్లరతో బ్యాంకకు వెళ్ళింది ఆ మహిళ....బ్యాంకు వాళ్ళు ఏమన్నారో తెలుసా ? Last Updated: 23 March 2016