తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై ఏపీ ప్ర‌జ‌లు చాలా కోపంగా ఉన్నారని నిర్మాత యలమంచిలి రవిచంద్ తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు పోరాటం చేస్తుంటే సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని అన్నారు. అదే తెలంగాణ రాష్ట్రం అడిగినా… అడగకపోయినా సినీ పరిశ్రమ వెంటనే స్పందిస్తుందని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు టికెట్స్ రూపంలో సంవత్సరానికి రూ. 1000 కోట్లు ఇస్తున్నారని, అటువంటి ఆంద్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న ఉద్యమంపై ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని రవిచంద్‌ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు రావాలని డిమాండ్ చేస్తూ విజయవాడ పున్నమి ఘాట్ లో సినీ నిర్మాత రవిచంద్ జలదీక్ష చేసారు.

cinema 1052018 3

ప్రజలకు అన్యాయం జరిగినా పెద్ద హీరోలు , నిర్మాతలు, దర్శకులు స్పందించరా అని అయన ప్రశ్నించారు. వారికి సమస్యలు వస్తే వెంటనే సమావేశాలు పెట్టుకునే వాళ్లు .. ప్రజల కోసం ఎందుకు బయటకు రారు. ఆదివారం ఒక వేదిక ఏర్పాటు చేసుకుని హోదా కోసం ఉద్యమించాలని అయన అన్నారు. తమిళ హీరోలను చూసి అయినా తెలుగు హీరోలు బుద్ది తెచ్చుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమ ఉద్యమించేంత వరకు వివిధ రూపాలలో నా ఆందోళన కొనసాగిస్తానని అన్నారు. జల్లికట్టు, రైతుల సమస్యల గురించి తమిళ సినీ పరిశ్రమ ఏ విధంగా పోరాడిందో అందరికీ తెలుసని, ఆ మాదిరిగా మన హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎందుకు స్పందించరు? అని ప్రశ్నించారు.

cinema 1052018 4

ఈ విషయమై స్పందించమని కోరుతూ ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మా అసోసియేషన్ కు తాను ఇప్పటికే లేఖలు రాశానని, ఈ లేఖలను చూసి అక్కడి పెద్దలు నవ్వుకున్నారని తనకు సమాచారం ఉందని చెప్పారు. ఈ విషయం తెలిసి తనకు చాలా బాధ కలిగిందని, సినీ పరిశ్రమ పెద్దలు దిగొచ్చే వరకూ ఈ పోరాటం చేయాలని నిశ్చయించుకున్నట్టు చెప్పారు. ‘హోదా’ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు హీరో లెవ్వరూ ఆందోళనలకు దిగాల్సిన అవసరం లేదని, ప్రతి నెలా రెండో ఆదివారం దీక్ష చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆరు నెలల పాటు పోరాటం చేద్దామని, అలా చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే.. స్ట్రయిక్ చేద్దామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, హామీల అమలు విషయమై తెలంగాణ ప్రభుత్వమే సపోర్టు చేసిందని, పక్క రాష్ట్రాల్లో హీరోలకు ఉన్న బుద్ధిజ్ఞానం కూడా మీకు లేదా? అంటూ రవిచంద్ మండిపడ్డారు.

తిరుపతిలోని అలిపిరి వద్ద బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్ వస్తున్న సమయంలో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తిరుపతి ప్రజలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.. అయితే, ఆ సమయంలో బీజేపీ నేతలు దాడి చెయ్యటంతో, తెలుగుదేశం శ్రేణులు కూడా ఎదురుతిరిగి, వారి పై దాడి చేసిన వారి, కారు అద్దాలు పగలగొట్టిన విషయం తెలిసిందే... దీని పై, అమిత్ షా కార్ పై దాడి జరిగింది అంటూ, వీర్రాజు, విశాఖ రాజు, తెగ బాధపడుతూ, ఎదో జరిగిపోయింది అంటూ, పెర్ఫార్మన్స్ ఇరగదీస్తున్నారు.. అయితే, ఆ బీజేపీ వారికి మించిన పెర్ఫార్మన్స్, ఈ రోజు జగన్ ఇచ్చారు... ఆయన బాస్ అమిత్ షా పై, నిరసన తట్టుకోలేని జగన్, తన బాస్ పై దాడి జరిగింది అంటూ, దారుణం అంటూ, కైకలూరులో స్పందించారు...

jagan 12052018 2

ఇప్పటి వరకు అమిత్ షా పేరు కూడా తలవని జగన్, మొదటి సారి అమిత్ షా పేరు తలవటంతో అందరూ ఆశ్చర్యపోయారు... విభజన హామీల అమలు కోసం, ఒక్కసారి కూడా, అమిత్ షా ని కాని, మోడీ ని కాని ఇప్పటి వరకు జగన్ తలవని విషయం తెలిసిందే.. అయితే, అమిత్ షా పై, తెలుగుదేశం నిరసన విషయంలో మాత్రం, ఖండఖండాలుగా ఖండించారు జగన్.. రుమలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై సీఎం చంద్రబాబే దాడి చేయించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. ఆ పని తానే చేశానని చంద్రబాబు ధైర్యంగా చెప్పలేకపోయారని, అమిత్ షాపై దాడిని ఖండించి తూచ్ అనిపించారని అన్నారు.

jagan 12052018 3

ఈ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా కైకలూరు గాంధీబొమ్మ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్ మాట్లాడుతూ... అమిత్ షా వాహన శ్రేణిపై రాళ్లు వేయడం తనకు ఆశ్చర్యమేసిందన్నారు. రాక్షసుడు మనిషిగా పుడితే ఎలా ఉంటాడో చంద్రబాబే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. తాను ఎంతో శాంతి స్వరూపుడుని అని, ఇలాంటి దాడులు, ఎప్పుడూ చూడలేదని, దారుణం అంటూ, బాధపడ్డాడు జగన్... ఎన్నికలకు ఏడాది ముందు డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు... చంద్రబాబు అంతా పథకం ప్రకారమే చేశారని, పైగా ఆ దాడిని ఖండిస్తున్నట్లు మాట్లాడుతున్నారని జగన్ ఆరోపించారు... మొత్తానికి జగన్ బాధపడటం చూస్తుంటే, బీజేపీ వారి కంటే, అమిత్ షా పై నిరసన కార్యక్రమం జగన్ ని, ఎక్కువ బాధ కలిగించినట్టు ఉంది.. పాపం...

చంద్రబాబు రహస్య పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎమ్మెల్యేలు టాప్‌ గ్రేడ్‌ కొట్టేశారు. మిగిలిన వారిలో కొందరికి ఫస్ట్‌క్లాస్‌ రాగా, ఇంకొందరు సగటు మార్కులతో గట్టెక్కారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పనితీరును అంచనా వేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రహస్యంగా నిర్వహించిన పరీక్ష (సర్వే) ఫలితాలను గురువారం ఎమ్మెల్యేల సమావేశంలో వెల్లడించారు. కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ 79.66 శాతం మార్కులతో నెం.1 స్థానంలో నిలిచారు. ఆయన తరువాత స్థానంలో 70 శాతం పైబడిన మార్కులతో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలకు 60 శాతం మార్కులే వచ్చాయి.

cbn survey 12052018 2

జిల్లాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు... అచ్చెన్నాయుడు(శ్రీకాకుళం), లలితకుమారి(విజయనగరం), అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణ (విశాఖ), తోట త్రిమూర్తులు, జోగేశ్వరరావు (తూ.గో), చింతమనేని ప్రభాకర్‌, నిమ్మల రామానాయుడు, రాధాకృష్ణ (ప.గో), వల్లభనేని వంశీ, శ్రీరాంతాతయ్య, బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్ (కృష్ణా), గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల నరేంద్ర పనితీరు బాగుందని చంద్రబాబు కితాబిచ్చారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేయించి.. ‘మూడు నెలలకొకసారి సమాచారం తెప్పించుకుంటానని కార్యకర్తల మనోభావాలను గమనించాలని, పనితీరును మెరుగు పరుచుకోవాలని’ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ చేశారు.

cbn survey 12052018 3

పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల పని తీరును అంచనా వేయడానికి ఐదు ప్రశ్నలను తయారు చేసి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఒక్కో ప్రశ్నకు 70 శాతం దాటిన వారికి టాప్‌ గ్రేడ్‌ ఇచ్చారు. ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది? కార్యకర్తలకు అందు బాటులో ఉంటున్నారా? పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారా? ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపుతున్నారా? నియోజకవర్గంలోని నాయకులందరిని సమన్వయంతో కలుపుకెళ్తున్నారా లేదా? సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగే విధంగా పర్యవేక్షిస్తున్నారా? అనే ఐదు ప్రశ్నలకు కార్యకర్తల నుంచి సమాధానాలు సేకరించారు. ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఫోన్లు చేసి వివరాలు నమోదు చేసుకున్నారు.

విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దుర్గ గుడి దగ్గర ఫ్లై-ఓవర్ నిర్మాణంతో అటు వైపు ట్రాఫిక్ కష్టాలు కొంచెం తగ్గే అవకాసం ఉంది. బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లై ఓవర్, బందర్ రోడ్డు విస్తరణ తరువాత, అటు వైపు కూడా ఉపసమనం వచ్చే అవకాసం ఉంది. ఎటు పోయి, ఇప్పుడు సమస్య అంతా రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు. ఈ మార్గం గన్నవరం ఎయిర్ పోర్ట్ వైపు ఉండటం, సిటీ ఎక్కువగా ఇటు వైపు పెరగటం, విద్యా సంస్థలు, ఆఫీసులు ఎక్కువగా రావటంతో, ఈ రోడ్డులో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. సాయంత్రం వేళ నిడమానూరు నుంచి రామవరప్పాడు రింగ్ రావటానికి, దాదపుగా 30-45 నిమషాల సమయం పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారాలు ఆలోచిస్తుంది ప్రభుత్వం.

ramaravarappadu 12052018 2

బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ షడ్యుల్ ప్రకారం నడుస్తున్నా, దుర్గ గుడి ఫ్లై ఓవర్ మాత్రం నెమ్మదిగా నడుస్తుంది... ఇవి ఇలా ఉండగా, ఇప్పుడు మరో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది అనే సంకేతాలు వస్తున్నాయి... రామవరప్పాడు నుంచి ఎనికేపాడు వరకు ఐదు కిలో మీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మించే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒక పక్క గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే విఐపి మూమెంట్ ఉండటం, ఎక్కువ కాలేజీలు, ఆఫీసులు, స్కూల్స్ రావటంతో, గన్నవరం నుంచి ఎనికేపాడు దాకా కొంచెం ఫ్రీ గా ఉన్నా, ఎనికేపాడు నుంచి బెంజ్ సర్కిల్ వరకు నరకం కనిపిస్తుంది... ప్రధానంగా సిటీలోకి భారీ వాహనాలు రావటంతో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంగా నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పై అనేక ఫిర్యాదులు అందటం, అలాగే 1100 కు ఎక్కువ ఫిర్యాదులు దీని మీద రావటంతో, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ramaravarappadu 12052018 3

రామవరప్పాడు నుంచి ఎనికేపాడు వరకు ప్రస్తుతం రెండు లైన్ల రోడ్డు ఉంది. దీనిని విస్తరించాలంటే రహదారికి ఇరు వైపులా నివాస, వాణిజ్య భవనాలు అధికంగా ఉన్నాయి. రామవరప్పాడు - ప్రసాదంపాడు మధ్య 70 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. దీనిని రెట్టింపు విస్తరిస్తే గానీ ట్రాఫిక్ ఇబ్బందులు తీరవు. అందుకు భూమి కావాలి. సేకరించాలంటే రెండు వైపులా ఉన్న ప్రైవేటు ఆస్తులకు భారీగా పరిహారం చెల్లించాలి. ఇందుకు ప్రత్యామ్నాయంగా రామవరప్పాడు - ఎనికేపాడు మధ్య ప్రస్తుతం ఉన్న రోడ్డుపైనే ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడితే తక్కువ వ్యయం అవుతుందని అంచనాకు వచ్చారు. రోడ్డు విస్తరణ చేపడితే 2000 కోట్లు అవుతాయని, అదే ఫైఓవర్ నిర్మిస్తే రూ. 500-600 కోటు వ్యయం సరిపోతుందని ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. దీని పై చంద్రబాబు కూడా కసరత్తు చేసారు.. ఇది హైవే ప్రాజెక్ట్ అయినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం ఈ ప్రాజెక్ట్ తీసుకోదని, CRDA ద్వారా, ఈ ప్రాజెక్ట్ మనమే చేద్దామని, వర్క్ అవుట్ చెయ్యమని, అధికారులని ఆదేశించారు...

Advertisements

Latest Articles

Most Read