ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. సావరకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకానికి ఆయన ఇవాళ శంకుస్థాపన చేసారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో రూ.180 కోట్లతో తలపెట్టిన బొంతు ఎత్తిపోతల పథకానికి నేడు శంకుస్థాపన చేసారు. వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసేలా, 67 గ్రామాల దాహార్తి తీర్చేందుకు ఈ ప్రాజెక్టును‌ ఉపయోగపడనుంది. నిర్థిష్ట సమయానికి పూర్తి చేసి సారవకోట రూపురేఖలు మారుస్తామని చెప్పారు. సారవకోట మండలం రంగసాగరంలో నీరు చెట్టు పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పితాని, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

cbn 15052018 2

అనంతరం రంగసాగారం వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్ లో చంద్రబాబు పాల్గున్నారు. బీజేపీకి కొత్త పూజారి వచ్చాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడని కన్నా సర్టిఫికెట్ ఇచ్చారని, వైసీపీకి వెళ్ళటానికి సిద్ధమైన నేతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చేసిందని విమర్శించారు. శుక్రవారం కోర్టుకు వెళ్లే వారు తనపై విమర్శలు చేయడం బాధాకరమని సీఎం అన్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, ఐదు బడ్జెట్లలో తెలుగు ప్రజలకు కేంద్రం అన్యాయం చేసిందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమంపై తన కంటే బాగా చేస్తే చర్చకు రావాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.

cbn 15052018 3

కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముసలం వచ్చిన సంగతి తెలిసిందే.. సోము వీర్రాజు వర్గం, సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేసి వాటిని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు, ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌కు పంపారు. అయితే, రాత్రికి, వీరు మెత్త బడ్డారు. రాజీనామా చేసి, జగన్ పార్టీలోకి మరో గంటలో చేరాల్సి ఉండగా, హాస్పిటల్ లో చేరిన, కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యకుడుగా ప్రకటించారంటేనే, వారి పార్టీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చి, ఒక సంవత్సరం బీజేపీలో ఉండి, రాజీనామా చేసిన వ్యక్తి, బీజేపీ అధ్యక్ష పదవికి దిక్కు అయ్యాడు.. ఇలాంటి స్థితిలో ఉన్న బీజేపీ, చంద్రబాబుకి చుక్కలు చూపిస్తుంది అంట... ఇదే విషయం పై, ఈ రోజు చంద్రబాబు పంచ్ వేసారు.

దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అయితే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. వందకుపైగా సీట్లతో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీకి దగ్గరలో నిలిచిపోయింది. ఇక అధికార కాంగ్రెస్‌ 70కిపైగా సీట్లతో రెండోస్థానంలో ఉంది. హంగ్‌ దిశగా సాగుతున్న కన్నడ రాజకీయాల్లో 35కుపైగా సీట్లతో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారిన పరిస్థితుల్లో ఆ రాష్ట్ర గవర్నర్‌పైనే అందరి దృష్టి ఉంది. గవర్నర్‌ వాజుభాయి వాలా నిర్ణయం కీలకం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని ఆహ్వానిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

amitshah 1502018 2

గుజరాత్‌ మాజీ భాజపా నేత అయిన వాజుభాయి వాలా ‌ 2002లో నరేంద్ర మోదీ కోసం తన నియోజకవర్గాన్ని వదులుకున్నారు. అనంతరం గుజరాత్‌లో మోదీ ప్రభుత్వంలో వాజుభాయి ఆర్థిక శాఖమంత్రిగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఈ నేపధ్యంలో అమిత్ షా తన యాక్షన్ ప్లాన్‌ను మొదలుపెట్టారు. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన కేంద్ర మంత్రి ప్రకాష్‌జవదేకర్‌తో అమిత్ షా సమావేశమయ్యారు. అంతేకాదు, జేడీ(ఎస్) తరపున గెలిచిన 10మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డాలను బెంగళూరుకు పంపించి.. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలపై ఎప్పటికప్పుడు సంప్రదించాల్సిందిగా అమిత్ షా ఆదేశించారు.

amitshah 1502018 3

అయితే కాంగ్రెస్, జేడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరక్క పోవడంతో దీనిపై క్లారిటీ రాలేదు. కాగా ప్రభుత్వ ఏర్పాటు గురించి రాష్ట్ర గవర్నర్‌ను కాంగ్రెస్ పార్టీ అపాయింట్‌మెంట్ కోరగా చుక్కెదురైంది. ఆ వెంటనే బీజేపీ నేతలు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడంతో రాజకీయ సమీకరనలు మారనున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని గత ఎన్నికల పరిణామాలే చెబుతున్నాయి. అయితే సీఎం పదవి జేడీఎస్‌కేనని ప్రకటించిన కాంగ్రెస్‌కు కలిసి వస్తుందా లేదా చూడాలి.

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్లియర్ మెజారిటీ వస్తుంది అనుకున్న బీజేపీకి సీట్లు తగ్గటంతో, రసపట్టులో పడింది. మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ దూరం అవుతుండగా, ఆ స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అరగంట క్రితం 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ నుంచి ఇప్పుడు మూడు స్థానాలు కాంగ్రెస్ ఆధిక్యతలోకి, ఒక స్థానం జేడీఎస్ ఆధిక్యతలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం బీజేపీ 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఆధిక్యత 74 స్థానాలకు పెరిగింది. జేడీఎస్ 40, ఇతరులు రెండు చోట్ల ముందంజలో ఉన్నారు.

karatnaka 15052018

మ్యాజిక్ ఫిగర్ అయిన 112 స్థానాలకు ఏ పార్టీ చేరుకోకపోతే, కన్నడ రాజకీయం మరింత రసకందాయంలో పడుతుంది. బీజేపీకి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత వచ్చినప్పటికీ... కాంగ్రెస్ తో పోల్చితే ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం మాత్రం తక్కువే. కాంగ్రెస్ కు 38.1 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి కేవలం 36.7 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. కాంగ్రెస్ పై బీజేపీ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీ స్వల్ప మెజార్టీని మాత్రమే సాధించడం దీనికి కారణం. మరోవైపు, బీజేపీపై కాంగ్రెస్ గెల్చిన స్థానాల్లో మార్జిన్ ఎక్కువగా ఉంది.

karatnaka 15052018

ఈ నేపథ్యంలో, రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. ఈ తరుణంలో బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జేడీఎస్ కు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో, కాంగ్రెస్, జేడీఎస్ కలిసి గవర్నర్ దగ్గరకి వెళ్లి, ప్రభుత్వం ఏర్పాటుకు పిలవవలిసిందిగా కోరనున్నాయి... మరో పక్క, బీజేపీ ఈ పరిణామం పై స్పందించింది.. దీనికి విరుగుడు ఉందని, మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా, మేమే ప్రభుత్వం ఫార్మ్ చేస్తాం అంటున్నాయి...

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కన్నడ ఓటర్లు ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో ఎన్నికల ఫలితాలు హంగ్‌ దిశగా పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల ప్రకారం భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్‌ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. సాధారణ మెజార్టీకి కొద్ది స్థానాల దూరంలోనే భాజపా నిలిచిపోయిన నేపథ్యంలో కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపడుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

devagowada 15052018 2

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జేడీఎస్‌ అగ్రనేతలతో మంతనాలు జరిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి కోరనున్నారు. గవర్నర్‌ నిర్ణయమే కీలకంగా మారనుంది. జేడీఎస్‌ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. జేడీఎస్‌కు బయటి నుంచి మద్దతిచ్చే దిశగా కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ అధ్యక్షుడు దేవగౌడతో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఫోన్లో మాట్లాడినట్లుగా తెలియవచ్చింది.

devagowada 15052018 3

ఈ నేపధ్యంలో రెండు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసేందుకు వెళ్ళగా, గవర్నర్ అపాయింట్‌మెంట్ దక్కలేదని తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రతినిథి వర్గం గవర్నర్‌ విజుభాయ్ వాలాను కలిసేందుకు ప్రయత్నించింది. జీ పరమేశ్వర నేతృత్వంలోని ఈ బృందానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేనట్లు తెలుస్తోంది. దీంతో ఈ బృందం తిరిగి వెనుకకు వచ్చేసినట్లు సమాచారం. మరో పక్క, ఇప్పటికీ బీజేపీ, అధికారంలోకి వచ్చేది మేమే అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పటం, ఆశ్చర్యం కలిగిస్తుంది.. మరే బీజేపీ నేతలు, కాంగ్రెస్ నుంచి చీలుస్తారా, జేడీఎస్ నుంచి చీలుస్తారా అనేది చూడాల్సి ఉంది... మొత్తానికి, ఈ ఎపిసోడ్ అయ్యేదాకా, గవర్నర్ కీలకం కానున్నారు.. కొంత మంది గవర్నర్లు లాగా కేంద్రం చెప్పినట్టు ఆడతారా, స్వతంత్రంగా పని చేస్తారా అనేది చూడాలి..

Advertisements

Latest Articles

Most Read