చంద్రబాబు ఎప్పుడూ అంటూ ఉంటారు, మన పిల్లలకి సరైన ప్రోత్సాహం ఇవ్వలే కాని, ప్రపంచాన్ని జయిస్తారు అని... అలానే, ప్రభుత్వ ప్రోత్సాహంతో, ఇప్పుడు ఏకంగా, మౌంట్ ఎవరెస్ట్ నే అధిరోహించింది, మన ఆంధ్రప్రదేశ్ యువత... ఎవరెస్ట్ పై నవ్యాంధ్ర పాతాకం గర్వంగా ఎగిరింది... మౌంట్ ఎవరెస్టు పై కీర్తిపతాకం ఎగురేసారు మన విద్యార్థులు... ఎవరెస్ట్ శిఖరాన్ని గురువారం 5గురు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు అధిరోహించారు. వారిలో జె.ప్రవీణ్(పెదవేగి,ప.గో),భాను సూర్యప్రకాశ్(కొత్తూరు,తూ.గో), జి.రాజు(గోలుగొండ,విశాఖ), వెంకటేశ్(చిట్టేడు,నెల్లూరు), ప్రసన్న(అడ్డతీగల,తూ.గో) ఉన్నారు. వాతావరణం అనుకూలిస్తే తరువాత బ్యాచ్ మరో 5గురు శనివారం శిఖరాగ్రం చేరే అవకాశం ఉంది.21మంది విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కితే అది ఆల్ టైం రికార్డు అవుతుంది.గతంలో 9మంది విద్యార్ధుల రికార్డు కూడా ఆంధ్రప్రదేశ్ దే.

everest 17052018 2

రెండేళ్లుగా శిఖరారోహణలో సోషల్ వెల్ఫేర్,ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్ధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. పర్వతారోహణ నిపుణుడు శేఖర్ బాబు ద్వారా వీరికి శిక్షణ ఇవ్వడం జరిగింది.మూడు దశలుగా విద్యార్ధులకు శిక్షణ అందించారు.పాఠశాల స్థాయిలో లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ తదితర శారీరక పోటీలలో 184మందిని తొలుత ఎంపిక చేశారు.విజయవాడ కేతనకొండ సిబిఆర్ అకాడమిలోవారికి ప్రాధమిక దశలో శిక్షణ ఇవ్వడం జరిగింది.వారినుండి మెరుగైన 65మందిని ఎంపిక చేశారు.రెండవ దశలో మనాలిలో,డార్జిలింగ్ లో మూడువారాలు శిక్షణ ఇచ్చారు. వీరినుండి 36మందిని ఎంపిక చేయడం జరిగింది.తరువాత దశలో లడఖ్ లో మైనస్ 30డిగ్రీల ఉష్ణోగ్రతలో శిఖరారోహణ తర్ఫీదు పొందారు.

everest 17052018 3

ఆ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే 22మందిని తీసుకుని ఎవరెస్ట్ అధిరోహించడం ప్రారంభించారు.అందులో ఒకరు మధ్యలో డ్రాప్ కాగా మిగిలిన 21మంది ఎవరెస్ట్ అధిరోహణలో ఉన్నారు.వారిలో 5గురు ఇప్పటికే గమ్యాన్ని చేరుకున్నారు. అత్యంత కఠినమైన శిక్షణను తట్టుకుని అనుకున్న గమ్యం చేరుకున్న విద్యార్ధులను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు,మంత్రి ఆనంద్ బాబు ప్రశంసించారు. ‘‘శిఖరారోహణ ద్వారా విద్యార్ధుల్లో ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాల పెంపునకు దోహదపడుతుంది.పట్టుదల పెరుగుతుంది,కష్టాలను తట్టుకునే దృఢత్వం అలవడుతుంది,భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఇది బాటలు వేస్తుంది.శిఖరారోహణ ద్వారా రాష్ట్రానికి ప్రతిష్ట పెంచారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్ధులను ప్రశంసించారు

కర్ణాటక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జేడీఎస్ అధినేత దేవేగౌడ ఫోన్ చేశారని తెలుస్తోంది. బాబుతో పాటు తెలంగాణా సియం, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు ఫోన్ చేశారు. జేడీఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు కోరారు. కర్ణాటకలో రాజకీయాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో యడ్యూరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన మరికొద్ది రోజుల్లో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. అందుకు మరికొంత మంది శాసనసభ్యులు భాజపాకు మద్దతివ్వాలి. కర్నాటకలో ఉంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టమని భావిస్తున్న ఆ రెండు పార్టీలు వారిని వేరే రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

cbn phone 17052018 2

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు తమ ఎమ్మెల్యేలు భాజపాలోకి వెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు కలిసి జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్‌ వీరికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికే కాంగ్రెస్‌, జేడీఎస్‌ సభ్యులను బెంగళూరులోని రిసార్ట్‌ ఉంచారు. కానీ మరింత జాగ్రత్త కోసం జేడీఎస్‌ ఎమ్మెల్యేలను వైజాగ్‌, హైదరాబాద్‌లకు తరలిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కేరళకు పంపించనున్నట్లు సమాచారం. కేరళలోని వామపక్ష ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

cbn phone 17052018 3

కాగా, కర్ణాటకఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌తు 38 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో గవర్నర్ అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. తమకు ఇతర ఎమ్మెల్యేల మద్దతు ఉందని యడ్యూరప్ప చెబుతున్నారు. కానీ ఆ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు చెబుతున్నాయి. బీజేపీ కొంత మంది కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు గాలం వేస్తోంది. జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడుతూ.. కేంద్రంపై పోరాటానికి ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలన్నారు. బాబు, కేసీఆర్, నవీన్ పట్నాయక్, మమతలు ముందుకు రావాలన్నారు. కర్ణాటకలో గవర్నర్ చర్య అనైతికమన్నారు.

కన్ను మిన్ను కాన రాక, అధికార అహంతో, నోటికి ఏమి మాట్లడతున్నమో తెలుసుకోకుండా, రెచ్చిపోతున్న బీజేపీ నాయకులకు ఎక్కడకు వెళ్ళినా ఆంధ్రులు వదిలిపెట్టటం లేదు.. మా రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు అంటూ, నిలదీస్తున్నారు... సాక్షాత్తు అమిత్ షా కే, తిరుపతిలో ఈ నిరసన తగిలింది... అయితే తాజాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుకు, ఈ నిరసన సెగ తాకింది. మీకు అమరావతి ఎందుకు, మయసభ కట్టుకుంటారా అని, ఎగతాళి చేసింది ఈయనే... ఇలా ఆంధ్రా పై అడ్డగోలుగా వాదించినందుకు, బహుమానంగా, రాజ్యసభ ఇచ్చి సత్కరించారు అమిత్ షా... అందుకే ఆ విశ్వాసం చూపిస్తూ, ఆంధ్రా పై మరింతగా విరుచుకు పడుతున్నాడు జీవీఎల్... సరిగ్గా కర్ణాటక ఎన్నికల ప్రచార హడావిడి ముగిసిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ కు చుక్కలు చూపిస్తాం అంటున్నారు..

gvl 17052018 2

ఈ నేపధ్యంలో, అమెరికాలో, న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ లో బీజేపీ ఒక కార్యక్రమం నిర్వహించింది. కర్ణాటక ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని విజయోత్సవ సభ లాగా దీనిని నిర్వహించారు. దీనికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ను ఆహ్వానించారు. ఆయన ఎప్పటిలాగానే.. ప్రత్యేకహోదా వంచన విషయంలో పాచిపోయిన పాట పాడడం ప్రారంభించారు. హోదా ను మించిన ప్యాకేజి ఇస్తున్నామని, చంద్రబాబు తీసుకోవడం లేదని, నానా అవాకులు చెవాకులు పేలడం ప్రారంభించారు. ఈ వరుస అబద్దాలను సహించలేకపోయిన సభికులైన ప్రవాసాంధ్రులు లేచి నిల్చుని, మీరు అన్నీ అబద్దాలు చెబుతున్నారంటూ నిలదీశారు.

gvl 17052018 3

సభలో గందరగోళం చెలరేగింది. “ఈ నిరసనలు కూడా వ్యూహాత్మకంగా చేస్తున్నవే అని, మీరు అందరూ దుష్ప్రచారపు మాయలో పడుతున్నారని” నరసింహారావు కాసేపు బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆ పాచిక కూడా పారలేదు. ఈలోగా నరసింహారావు బుకాయింపులను అడ్డుకున్న వారిని బలవంతంగా సభనుంచి బయటకు పంపించారు. “గత ఎన్నికల్లో మేము కూడా మోడీ మాటలను నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాం. అందువల్ల మా మిత్రులను కూడా కోల్పోయాం. కానీ మీరు తెలుగు జాతిని వంచించారు” అంటూ పలువురు తీవ్రంగా విమర్శించారు. ఈ తాకిడి తట్టుకోలేకపోయిన నరసింహారావు తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించేశారు. మొత్తానికి ఆంధ్రా వారికి ద్రోహం చేసి, ఎదురు చుక్కలు చూపిస్తాం అంటున్న బీజేపీకి, ఎక్కడకు వెళ్ళినా చుక్కలు కనిపిస్తున్నాయి..

కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు దేశం మొత్తం చూస్తుంది. గవర్నర్ ను అడ్డు పెట్టుకుని, మోడీ, అమిత్ షా ఎలాంటి రాజకీయం చేస్తున్నారో చూస్తున్నాం.. తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం అసన్నమైందని జేడీఎస్‌ శాసనసభాపక్ష నేత కుమారస్వామి పిలుపునిచ్చారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. దాన్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబునాయుడుతో పాటు, మమతాబెనర్జీ, కేసీఆర్‌, మాయావతి తమతో కలిసిరావాలని కోరారు. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. క

kumaraswamy 17052018 2

ర్ణాటకలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు భాజపా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని కుమారస్వామి అన్నారు. భాజపా మెజార్టీ లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించడం దారుణమని కుమారస్వామి అన్నారు. గవర్నర్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మరో పక్క కేంద్రం, ఈడీతో దాడులు చేపిస్తుందని, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, అన్నీ అమిత్ షా దగ్గర ఉండి నడిపిస్తున్నారని, వీళ్ళని ఎదుర్కోవాలి అంటే, అందరూ వస్తేనే కుదురుతుంది అని చెప్పారు.. కర్ణాటకలో అధికారం చేజిక్కని పక్షంలో ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చకు లేవనెత్తి బీజేపీని డిఫెన్స్‌లోకి నెట్టాలనే యోచనలో జేడీఎస్ ఉన్నట్లు సమాచారం.

kumaraswamy 17052018 3

మరో పక్క, ప్రముఖ న్యాయనిపుణుడు రాంజెఠ్మలానీ ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ వాజుభాయి వాలా తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగత హోదాలో ఆయన సవాల్ చేశారు. గవర్నర్ ఆహ్వానం మేరకు బీఎస్ యడ్యూరప్ప ఈ రోజు కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. బలనిరూపణకు ఆయనకు గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. అయితే, గవర్నర్ నిర్ణయంపై నిన్న రాత్రే కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపు తట్టగా, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో తమ తుది ఆదేశాలకు లోబడి ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం ఉంటాయని మాత్రం స్పష్టం చేసింది.

Advertisements

Latest Articles

Most Read