మళ్ళీ మూడు రాజధానుల అంశం తెర పైకి వచ్చింది. గత రెండేళ్లుగా, ఈ అంశంలో ముందుకు వెళ్ళలేక పోతున్న జగన్ ప్రభుత్వం, కోర్టులో కేసులు ఉండటం, కోర్టు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉండటంతో, ఇప్పుడే వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి వైసీపీనేతలు కొత్త రాగం అందుకున్నారు. రాజధాని తరలింపు అంశం పై నిన్న విజయసాయి రెడ్డి, ఈ రోజు మంత్రి బొత్సా సత్యన్నారాయణ, వీరు ఇరువురు చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. డేట్ అడగవద్దు, రాజధాని ఎప్పుడైనా తరలిస్తాం, జగన్ ఎక్కడ ఉంటే అదే రాజధాని, ఎక్కడ నుంచి అయినా పరిపాలించవచ్చు అని నిన్న విజయసాయి రెడ్డి ప్రకటించగా, క్యాంప్ కార్యాలయం తరలించటానికి సీఆర్డీఏ రద్దు అంశం అడ్డుకాదని చెప్పి, బొత్సా సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. ఏ క్షణంలో అయినా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం విశాఖపట్నం నుంచి పని చేస్తుందని చెప్పి, బొత్సా వ్యాఖ్యానించారు. అయితే అమరావతి పరిరక్షణ సమితి మాత్రం, ఇదంతా డైవర్షన్ పోలిటిక్స్ అని చెప్పి, కొట్టిపారేసాయి. రైతులు మాత్రం, తమ త్యాగాలను, తాము చేస్తున్న దీక్షలను గుర్తించకుండా, ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడితే, హైకోర్టులోనే దీని ఎదుర్కుంటాం అని పేర్కొన్నారు. అయితే రాజధాని అంశానికి సంబంధించి, సిఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల అంశం పై, ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతుంది.

botsa 03062021 2

క-రో-నా కారణంగా, ఆలాగే వేసవి సెలవులు తరువాత, దీని పై విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని, త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు పై విచారణ చేయనుంది. అయితే గతంలో విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూల్ కు తరలిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలోనే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో పై, రాజధాని రైతులు హైకోర్టులో సవాల్ చేయగా, హైకోర్టు ఈ జీవోని కొట్టేస్తూ, ఆ కార్యాలయాన్ని తరలించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు రాజధానుల విషయంలో కూడా ఇప్పుడు హైకోర్టులో స్టేటస్ కో మైంటైన్ అవుతుంది. ఈ స్టేటస్ కో, ఇచ్చిన సందర్భంగా, కార్యలయాలను తరలించేందుకు వీలు లేదని రాజధాని రైతులు చెప్తున్నారు. ఒక వేళ కోర్టు ఆదేశాలు ధిక్కరించి, అలా చేస్తే కనుక, కోర్టు దిక్కరణ కేసు పెడతామాని, రాజధాని రైతులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎక్కడ నుంచి అయినా పని చేయవచ్చని, దానికి కోర్టులు అనుమతులు అవసరం లేదని, తాము విశాఖ వెళ్లి తీరతాం అని చెప్తున్నారు. మరి న్యాయస్థానాలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

నర్సాపురం ఎంపీ రఘురామరాజు స్పీడ్ పెంచారు. ఈ రోజు దేశంలో ఉన్న ఎంపీలు అందరికీ తనకు జరిగిన అన్యాయం పై లేఖలు రాసారు. అటు పార్లమెంట్, ఇటు రాజ్యసభ ఎంపీలతో పాటుగా, న్యాయశాఖ చైర్మెన్, సభ్యులకు కూడా లేఖలు రసారు. ఏపి పోలీసులు తన పై జరిపిన దా-డి-ని ఈ లేఖలో పొందుపరిచారు. భారత దేశానికీ స్వాతంత్రం వచ్చిన తరువాత, తొలిసారిగా ఒక ఎంపీ పైన పోలీసులు థ-ర్డ్ డి-గ్రీ ప్రయోగించటం, ఇదే మొదటిసారి అని, ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలో ఆయన్ను అరెస్ట్ చేసిన విధానంతో పాటుగా, ఆ తరువాత పోలీసులు థ-ర్డ్ డి-గ్రీ ప్రయోగించటం, ఇలా ఇతర అంశాలు అన్నీ కూడా అందులో పొందు పరిచారు. స్థాయి సంఘం చైర్మెన్ ఉపేంద్ర యాదవ్ ఇతర సభ్యులు కూడా రఘురామకృష్ణం రాజు లేఖలు రాసారు. రఘురామరాజు రాసిన లేఖకు, ఇతర ఎంపీల నుంచి మద్దతు లభిస్తుంది. ఆ లేఖ చూసి ఇతర ఎంపీలు ఆశ్చర్య పోయారు. తెలంగాణా కాంగ్రెస్ ఇంచార్జ్ అలాగే, కాంగ్రెస్ ఎంపీ అయిన మానిక్కం ఠాగూర్ ఈ లేఖ చూసి ఆశ్చర్య పోయారు. ఆ లేఖను, రఘురామరాజుని కొట్టిన ఫో-టో-ల-ను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. రఘురామకృష్ణం రాజు, ఇతర ఎంపీలు అందరికీ లేఖలు రాసినట్టు మానిక్కం ఠాగూర్ ట్వీట్ ద్వారా వెలుగులోకి వచ్చింది.

jagan 03062021 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అని మానిక్కం ఠాగూర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అ-రా-చ-కా-ని-కి, పిచ్చితనానికి కూడా ఈ చర్యలు నిదర్శనం అని ఆ ట్వీట్ లో చాల ఘాటుగా మానిక్కం ఠాగూర్ విమర్శించారు. ఏపిలో హిట్లర్ రాజ్యం నడుస్తుందా అంటూ, మానిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. సిద్ధాంతపరంగా, రఘురామకృష్ణం రాజుతో విభేదిస్తున్నామని, అయితే రఘురామరాజు పై జరిగిన దాడిని మాత్రం, ఖండిస్తున్నామని ఆయన తన ట్విట్టర్ లో తెలిపారు. అయితే ఎంపీలు అందరికీ రాసిన ఈ లేఖలో, జరిగిన విషయం మొత్తం తెలిపారు. నిబంధనలు అన్నీ ఉల్లంఘించారని తెలిపారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో, తను ఈ అంశాన్ని లేవనెత్తుతానని, పార్టీలకు అతీతంగా, తనకు ఈ అంశంలో మద్దతు తెలిపాలి అంటూ, ఆయన ఆ లేఖలో కోరారు. అయితే ఎంపీలకు రఘురామరాజు లేఖ ద్వారా మొత్తం, తెలపటంతో, ఇప్పుడు వైసీపీ దీనికి ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.

దేశంలో క-రో-నా నియంత్రణ చర్యల పై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, సుమోటోగా తీసుకుని ఈ కేసును విచారణ చేస్తుంది. ఈ కేసు విచారణ సందర్భంగా, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం టీకా విధానం పై, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను వాటి మానన వాటిని వదిలేస్తే, ఏ విధంగా ఉంటుంది ? టీకా ధరల పై ఏకీకృత విధానం ఎందుకు లేకుండా పోయింది ? గ్రామీణులను, నిరక్ష్యరాస్యులు టీకా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు ? వయసులు వారీగా టీకాలు ఇవాలనే నిర్ణయం హేతుబద్ధమేనా ? దేశవ్యాప్తంగా ఒకే ధరల విధానం ఎందుకు లేకుండా పోయింది ? ఈ వయసుల వారీగా టీకాలు ఇవ్వాలనే నిర్ణయం ఎవరు నిర్ణయించారు ? ఇలా అనేక ప్రశ్నలు కేంద్రానికి సంధిస్తూ, కేంద్రానికి సుప్రీం కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. టీకా కొనుగోలు, అదే విధంగా పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పై తమకు స్పష్టత కావాలని, అంతే కాకుండా సంబధిత ఫైల్స్ అన్నీ కూడా సుప్రీం కోర్ట్ ముందు ఉంచాలని కూడా , కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత బడ్జెట్ లో టీకాల కొనుగోలుకి సంబంధించి 35 వేల కోట్లు కేటాయించారు, ఈ 35 వేల కోట్లతో అందరికీ టీకాలు ఎందుకు ఉచితంగా ఇవ్వలేక పోతున్నారు అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆదేశించింది.

sc 02062021 2

ఈ 35 వేల కోట్లను, మీరు ఏ విధంగా ఖర్చు చేయబోతున్నారు అనే అంశం చెప్పాలని ఆదేశించింది. 45 ఏళ్ళు దాటిన వారికి కేంద్రమే టీకాలు కోనోగులు చేస్తూ, రాష్ట్రాలకు పంపిస్తుందని, 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వారి విషయంలో మాత్రం, ఎందుకు ద్వంద్వ విధానాలు అవలంభిస్తున్నారని ? ప్రశ్నించింది. టీకాల ఉత్పత్తిదారులు, రాష్ట్రాలకు, కేంద్రం నిర్ణయించిన ధరకు సరఫరా చేయాలని, మిగతా 50 శాతం ప్రైవేటు హాస్పిటల్ కు ఇవ్వాలి అనే నిర్ణయం ఎవరు తీసుకున్నారు ? ఎంత హేతుబద్దత ఈ నిర్ణయానికి ఉంది అంటూ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. అసలు కేంద్రం కంటే, రాష్ట్రాలకు ఎక్కవు ధరకు ఇవ్వాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారని, టీకాల ధరలు ఒక్కో చోట ఒక్కో విధంగా కాకుండా, కేంద్రమే ఒకే ధరను నిర్ణయం తీసుకోవాలి కదా అని ప్రశ్నించింది. అసలు కోవీషీల్డ్ ఎంత కొన్నారు, కోవాక్సిన్ ఎంత కొన్నారు, స్పుత్నిక్ ఎంత కొన్నారు, ఇలా పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. అలాగే థర్డ్ వేవ్ పై కూడా ఒక బ్లూ ప్రింట్ ను తమకు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.

ఒక పక్క ఏపి ప్రభుత్వం పెట్టిన రాజద్రోహం కేసు, సంచలనం అవుతున్న నేపధ్యంలో, ఇదే తరహా కేసు పై, సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. ఇటీవల ప్రభుత్వాల పని తీరు, లోపల పట్ల ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల పైన పలు చోట్ల రాజద్రోహం కేసులు నమోదు చేయటం, వారిని అరెస్ట్ చేయటం పైన, ఇలాంటి నిరంకుశ చర్యల పై దేశ వ్యాప్త చర్చ జరుగుతుంది. తాజాగా వినోద్ దువా అనే జర్నలిస్ట్ పై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన రాజద్రోహం కేసు విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత ఏడాది క-రో-నా ప్రారంభం అయిన తరువాత, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రారంభించటం, ఆ పరిణామాలు ఆలోచన చేయకుండా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజలు పడిన ఇబ్బందులు తీరు, ఇలా అనేక అంశాలు, లోపాలు పై, వినోద్ దువా అనే జర్నలిస్ట్ తన అభిప్రాయాలు తెలియ చేస్తూ ఒక వీడియో చేసారు. అయితే దేశ వ్యాప్తంగా ప్రభుత్వ చర్యల పై ప్రజల్లో అనుమానం కలిగే విధంగా, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రయత్నం చేసారు అంటూ, ఆయన పై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి, పలు సెక్షన్ లు కింద వినోద్ దువా పై కేసులు పెట్టారు. ముఖ్యంగా 124 ఏ అనే సెక్షన్ కింద రాజద్రోహం కేసు పెట్టారు. దాంతో పాటుగా, పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసుతో పాటుగా, ఆయన పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

sc 03062021 2

అయితే ఒక జర్నలిస్ట్ పై రాజద్రోహం కేసు మోపటం, ఇతర సాకులు చెప్పి ఆయన్ను అరెస్ట్ చేయటం పై, వినోద్ దువా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుని, అలాగే ఆ తరువాత సుప్రీం కోర్టుని కూడా ఆశ్రయించటం జరిగింది. 2020 మార్చ్ లో నమోదు చేసిన ఈ కేసు పైన, 2020 జూన్ లోనే సుప్రీం కోర్టు, వినోద్ దువా ని అరెస్ట్ చేయటానికి వీలు లేదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ రోజు సుప్రీం కోర్టు, ఈ అంశం పై తుది తీర్పు ఇచ్చింది. జస్టిస్ లలిత్ తో కూడిన ధర్మాసనం, ఈ కేసులో తీర్పు ఇచ్చింది. రాజద్రోహం కేసు ఎఫ్ఐఆర్ ని కొట్టేస్తూ, సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రతి జర్నలిస్ట్ కు రక్షణ ఉంటుంది అంటూ సుప్రీం కోర్టు తెలిపింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని ఈ సందర్భంగా ఉదహరించింది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నమోదు అయిన రాజద్రోహం కేసు విషయంలో, మీడియా పై పెట్టిన రాజద్రోహం కేసు కూడా సుప్రీంలో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో, ఆ కేసులో కూడా న్యాయం జరుగుతుందని, విమర్శలు చేస్తే రాజద్రోహం కింద ప్రభుత్వాలు చూడటం మానుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read