ఏపీలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నుంచి ప్ర‌తిప‌క్షం హ‌క్కుల‌కు దిక్కులేదు. ప్ర‌శ్నించే ప్ర‌జ‌ల్నీ నిర్బంధిస్తున్నారు. అయినా టిడిపి ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించేందుకు ఎన్నో దా-డు-ల‌ని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. టిడిపి త‌ల‌పెట్టే స‌భ‌లు, స‌మావేశాల‌కు అనుమ‌తి ఇవ్వ‌కుండా పోలీసులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. శాంతియుతంగా ప్రజాస‌మ‌స్య‌ల‌పై పోరాటం కొనసాగిస్తున్న టిడిపిపై ఇప్ప‌టివ‌ర‌కూ ఖాకీలే ప్ర‌తాపం చూపేవారు. ఇప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే గూండాల్లా మారి టిడిపి కార్య‌క్ర‌మాల‌పై దా-డు-ల‌కు దిగుతున్నారు. ఈ దా-డు-లు చూస్తూ పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తున్నారు. మాచ‌ర్ల‌లో ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి నిర్వ‌హించిన టిడిపిపై వైసీపీ చేసిన దా-డు-లు రాష్ట్ర‌మంతా నివ్వెర‌పోయి చూసింది. టిడిపి ఆఫీసు, టిడిపి నేత‌ల ఇళ్లు లూటీలు చేశారు. కార్లు కాల్చేశారు. పోలీసులు మాత్రం వైసీపీ పెద్ద‌ల ఆదేశాల‌తో టిడిపిపై నాన్ బెయిల‌బుల్ కేసులు బ‌నాయించారు. మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖా పుంగ‌నూరు, తంబ‌ళ్ల‌ప‌ల్లెలోనూ ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి కార్య‌క్ర‌మాన్ని అడ్డుకుని టిడిపి నేత‌ల ఇళ్ల‌పై దా-డు*లకి దిగారు.

గుడివాడ‌లో రంగా వ‌ర్ధంతి టిడిపి నిర్వ‌హించ‌కూడ‌దంటూ ఏకంగా పెట్రోల్ బాంబులు వేసి చంపేస్తామంటూ టిడిపి ఇన్చార్జి రావి వెంక‌టేశ్వ‌ర‌రావుని బెదిరించారు. టిడిపి నేత‌ల‌పై దా-డు-ల‌కి దిగారు. ఇక్క‌డా పోలీసులు కాంతారా సినిమా చూసిన‌ట్టు వైసీపీ దౌర్జ‌న్యాల‌ను చూస్తూ ఉన్నారు. ఉన్న‌ట్టుండీ వైసీపీలో ఇంత అస‌హ‌నం ఎందుకు పెరిగిపోయింది అనేది ఇప్పుడు రాజ‌కీయ ప‌రిశీల‌కుల‌ని తొలిచేస్తున్న ప్ర‌శ్న‌. తాము గ‌డ‌ప గ‌డ‌ప‌కీ వెళ్తుంటే తిర‌గ‌బ‌డుతున్న ప్ర‌జ‌లు, టిడిపి చేప‌ట్టిన `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి ` కార్య‌క్ర‌మాన్ని స్వాగ‌తిస్తున్నార‌ని ఆ అక్క‌సా? ఐప్యాక్‌, ఆత్మ‌సాక్షి గ్రూపులు చేసిన స‌ర్వేలో ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త కార‌ణంగానా? ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు స‌భ‌ల‌కు జ‌నం పోటెత్తుతుండం ఓర్వ‌లేక ఇలా దాడులు చేసి భ‌య‌పెడుతున్నారా? అనే కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

నీటిపారుద‌లని నోటి పారుద‌ల‌గా, ఇరిగేష‌న్ శాఖ‌ని ఇరిటేష‌న్ శాఖ‌గా మార్చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ఇటీవ‌ల కాలంలో చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నారు. బుల్లెట్టు దిగిందా లేదా అంటూ అసెంబ్లీలో రౌడీభాష‌తో క‌ల‌కలం రేపిన అనిల్ కి అస‌మ్మ‌తి బుల్లెట్టు దిగి చాలా రోజులైనా, నెత్తికెక్కిన అధికారం వ‌ల్ల క‌న‌ప‌డ‌టంలేద‌ని నెల్లూరు వైసీపీ నేత‌లు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి కాక ముందు బాబాయ్ రూప్ కుమార్ యాద‌వ్‌తో క‌లిసే పంచాయ‌తీలు, సెటిల్మెంట్లు, వ్యాపారాలు వెల‌గ‌బెట్టారు అనిల్ కుమార్ యాద‌వ్‌. మంత్రి అయ్యాక బాబాయ్ అబ్బాయ్ మ‌ధ్య గ్యాప్ పెరిగింది. అబ్బాయ్ మంత్రి ప‌ద‌వి ఊడింది. జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల‌తోనూ చెడింది. అండ‌గా ఉండే రెడ్డి సామాజిక‌వ‌ర్గం వారూ అనిల్ అంటేనే అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు. బాబాయ్ రూప్ కుమార్ అనిల్‌ అస‌మ్మ‌తి వ‌ర్గానికి ఇష్టుడ‌య్యాడు. నెల్లూరు డిప్యూటీ మేయ‌ర్ అయిన రూప్ కుమార్‌.. అనిల్ సీటుపైనా క‌న్నేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ రెడ్లు కూడా రూప్ కుమార్‌కి మ‌ద్ద‌తుగా తెర‌వెనుక స‌హ‌కారం అందిస్తున్నారు.

అవివాహితుడైన రూప్ కుమార్‌కి అబ్బాయ్ అనిల్ గుట్టుమ‌ట్ల‌న్నీ తెలుసు. దీంతో బాబాయ్ ఎదురు తిరిగినా ఏం చేయ‌లేక మౌనంగా వుంటున్నాడు. నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు రూప్ కుమార్ ప‌వ‌ర్ సెంట‌ర్ అయ్యారు. త‌న అనుచ‌రుడైన మైనారిటీ నేత షాపు మెట్ల‌ను కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. దీని వెనుక అనిల్ కుమార్ యాద‌వ్ ఆదేశాలు ప‌నిచేశాయ‌ని రూప్ కుమార్ అనుమానించారు. అయితే 24 గంట‌లలోగానే ఆ షాపు ముందు మెట్లు నిర్మించిన డిప్యూటీ మేయ‌ర్ రూప్ కుమార్ దమ్ముంటే తనను ఆపేవారు ఎవరో రావాలని సవాల్ విసిరారు. ఈ స‌వాల్ అబ్బాయ్ అనిల్‌కేన‌ని వేరే చెప్ప‌క్క‌ర్లేదు.

నిన్న ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన  ఘటనలో  బాధిత కుటుంబాలను చంద్రబాబు ఈరోజు  పరామర్శించనున్నారు. కందుకూరులో చనిపోయిన 8 మందికి  ఏరియా హాస్పిటల్ లో  పోస్టుమార్టం పూర్తి అయ్యింది.వీరి మృతదేహాలను వారివారి కుటంబసభ్యులకు అప్పచెప్పారు. డాక్టర్లు పోస్టుమార్టం  చేసేప్పుడు వీడియో మొత్తం రికార్డ్ చేసారు. ఒకరు మీద ఒకరు  పడి ఊపిరాడకే చనిపోయారని వైద్యులు ప్రాధమిక అంచనాలో  తెలిపారు. మృతి చెందిన వారి ఇళ్ళకు చంద్రబాబు స్యయంగా వెళ్లి  నివాళులు అర్పించానున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది చనిపోగా , మరికొంత మంది గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన వారి ఎనిమిది మంది ఇళ్లకు వెళ్లి నివాళులర్పించనున్నారు చంద్రబాబు.

ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖా మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుని టిడిపి ప‌లాస ఇన్చార్జి ప‌శువు అంటుంటారు. డాక్ట‌ర్ అయిన ఒక మంత్రిని ఇలా అన‌డ‌మేంటి అని చాలా మంది వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే నీచ‌పు కూత‌లు కూస్తుండ‌డం, ప‌శువు కంటే దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌డంతో ఇలా ప‌శువు అన‌క త‌ప్ప‌డంలేద‌ని గౌతు శిరీష అంటుంటారు. టిడిపి అధినేత చంద్ర‌బాబు కందుకూరు ప‌ర్య‌ట‌న‌లో తొక్కిస‌లాట జ‌రిగి 8 మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ ఘటనపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తూ కందుకూరులో జరిగింది ప్రమాదం కాదు అని, దాని వెనుక కుట్ర ఉందంటారు. నేష‌న‌ల్‌ మీడియాలో హైప్ కోసమే ఈ కుట్ర ప‌న్నార‌ని అవాకులు చెవాకులు పేలారు. పథకం ప్రకారం తొక్కిసలాట జరిపించి 8 మందిని చంపేశారని, చంద్రబాబును విచారించాల‌ని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది చ‌నిపోయి కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ రోదిస్తుంటే, శ‌వ‌రాజ‌కీయాల‌కు తెర‌తీసిన మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుని శిరీష ప‌శువు అన‌డం త‌ప్పులేద‌ని జ‌నాలు అనుకుంటున్నారు. ప్ర‌భుత్వంలో ఉండి కూడా ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌వాడిని ప‌శువు అనే అంటారంటున్నారు టిడిపి నేత‌లు.

Advertisements

Latest Articles

Most Read