నిన్న కందుకూరులో జరిగిన దురదృష్ట సంఘటన పై ప్రధాని నరేంద్ర మోడి స్పందించారు. చనిపోయిన టిడిపి కార్యకర్తల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయాలుపాలు అయిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ప్రార్ధించారు. ఇక ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చనిపోయిన వారికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు పరిహారంతో పాటుగా, గాయపడినవారికి రూ.50 వేలు ఇస్తామని ప్రధాని మోడి తెలిపారు. దీనికి సంబంధించి, ప్రధాని మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. కందుకూరు ఘటనలో మృతి చెందిన వారికి సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేసారు.
news
కందుకూరు మృతుల పోస్టుమార్టంలో హైడ్రామా.. పోలీసులు పై టిడిపి ఆగ్రహం...
నిన్న కందుకూరు ఘటనలో మృతి చెందిన టిడిపి కార్యకర్తల మృతదేహాలు, కందుకూరు ఏరియా ఆస్పత్రిలో ఉన్నాయి. హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో టిడిపి శ్రేణులు బాధతో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న మృతి చెందిన ఎనిమిది మంది, టీడీపీ కార్యకర్తల మృతదేహాలు హాస్పిటల్ వద్ద ఉన్నాయి. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్ లు ఏర్పాటు చేసారు. అయితే మృతుల పోస్టుమార్టంలో అధికారుల అత్యుత్సాహం చూపించటం పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికీ చెప్పకుండా, ఉదయం 4 గంటలకే పోస్టుమార్టం ప్రారంభించడమేంటి? అంటూ టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు గారు ఆసుపత్రికి వస్తారనే సమాచారం ఉండటంతో, చంద్రబాబు గారు వచ్చే ముందే, హుటాహుటిన పోస్ట్ మార్టం చేసి, ఇక్కడ నుంచి తరలించి వేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యక్రమాలంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేసారు.
చంద్రబాబు నెల్లూరు వస్తున్న సమయంలోనే, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆనం...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్న సమయంలోనే, సీనియర్ నేత, మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే ఆనం చేసిన వ్యాఖ్యలు, వైసీపీని ఇరకాటంలో పడేశాయి. వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో ఆనం ఈ రోజు పాల్గుని, అక్కడ తన ఆవేదన మొత్తం కక్కేశారు. వాలంటీరు వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు, అంతకు మించి చేస్తున్నది ఏంటి ? రోడ్లుకు కనీసం గుంటలు పూడ్చామా ? తాగటానికి నీళ్ళు ఇచ్చామా ? అసలు ఈ నాలుగు ఏళ్ళలో మనం ఏమి చేసాం ? ప్రజలను రేపు ఏమని ఓట్లు అడుగుదాం ? ఎన్నికల సమయంలో ఎస్ఎస్ కెనాల్ కడతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాం, గెలిచిన తరువాత ఏమి చేసాం ? పెన్షన్లు మనం కాదు కదా, గతంలో తెలుగుదేశం కూడా ఇచ్చిందని అన్నారు. వైఎస్ఆర్ కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మన ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రజలు నన్ను కూడా నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. గ్రామాల్లో కనీసం బిందెడు నీళ్ళు ఇవ్వలేక పోయామని అన్నారు. పెన్షన్లు ఇస్తేనే ఓట్లు వేసేస్తారా అని ప్రశ్నించారు. ఆనం వ్యాఖ్యలతో వైసీపీ ఒక్కసారిగా ఖంగుతింది.
చంద్రబాబు మీటింగ్ లో అపశ్రుతి... మీటింగ్ ఆపేసిన చంద్రబాబు...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కందుకూరు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు కందుకూరు ntr సర్కిల్ కు రాగానే, ప్రజలు ఒక్కసారిగా పోటెత్తారు. ప్రజలు పెద్ద ఎత్తున రావటంతో, డ్రైన్ అవుట్ లెట్ లో టిడిపి కార్యకర్తలు జారి పడిపోయారు. దీంతో చంద్రబాబు తన ప్రసంగం ఆపేసారు. వెంటనే వారిని ఆసుపత్రికి పంపించారు. దాదపుగా ఎనిమిది మందిడ్రైన్ లో పడిపోయారు. అయితే దురదృష్టవ సాత్తు ఇద్దరు కార్యకర్తలు చనిపోయినట్టు సమాచారం. మరో అయుదు మందికి గాయాలు అయ్యాయి. దీంతో సమాచారం తెలుసుకుని చంద్రబాబు వెంటనే హాస్పిటల్ కు వెళ్లారు. తడుపురి వివరాలు తెలియాల్సి ఉంది.