ఏమీలేని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కోట్లాధిప‌తి ఎలా అయ్యారని, అవినీతిని ప్ర‌శ్నిస్తే జ‌గ‌న్ రెడ్డి ఫోన్ చేసి మ‌రీ బెదిరించార‌ని  వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది సీఎంలని చూశాన‌ని ప్రజాస్వామ్యాన్ని ఇంతగా దిగ‌జార్చిన సీఎంని తొలిసారి చూస్తున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను క్రాస్ ఓటింగ్ చేశానని బుర‌ద చ‌ల్లుతున్నార‌ని, సజ్జల ముందురోజు ఓ మాట, తర్వాత రోజు ఓ మాట మాట్లాడార‌ని మండిప‌డ్డారు.  సీక్రెట్ బ్యాలెట్‍లో తాను ఎవరికి ఓటేశానో స‌జ్జ‌ల‌కి ఎలా తెలుసు అని ప్ర‌శ్నించారు. త‌న నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇంచార్జిగా నియమించిన రోజే  ఆ పార్టీకి దూరంగా ఉన్నాన‌ని చెప్పుకొచ్చారు. అంద‌రూ అమ్ముడుపోయార‌ని అంటోన్న సజ్జల కోట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగారో త‌న‌కి తెలుసు అని అన్నారు. ప్ర‌భుత్వంలో అవినీతిని ప్రశ్నిస్తే సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి మంద‌లించార‌ని ఆనం వెల్ల‌డించారు. ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేశాన‌ని, ఎవరికి ఓటు వేశానో చెప్పన‌ని ఆనం రాంనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యవస్థల్లో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయ‌ని, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి రావడం దారుణం అని వాపోయారు. జిల్లాలో జరిగే దోపిడీ వ్యవస్థల గురించి ప్రశ్నించాన‌ని, అభివృద్ధి నిలిచిపోయింది.. ప్రాజెక్టులు, నిర్మాణాలు జరగట్లేదని ప్రశ్నించినందుకే త‌న‌ గొంతుకను అణచి వేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. న‌ల‌భై ఏళ్లుగా అనేకమంది నాయకుల వద్ద పనిచేశాన‌ని, ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంత దిగజారడం చూడలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పేరు చివ‌ర‌న రెడ్డి ఉంద‌ని ఒకే ఒక్క కార‌ణంతో జ‌గ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు ఇచ్చిన రెడ్లు ఇప్పుడు త‌మ‌లో తాము మ‌థ‌న‌ప‌డుతున్నారు. ఇంత అరాచ‌కుడికి మ‌ద్ద‌తు ఎందుకు ఇచ్చామ‌ని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మాజీ మంత్రి ఇదే విష‌యాన్ని ప‌దేప‌దే చెబుతూ గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డు వంతు వ‌చ్చింది. వైసీపీకి నెల్లూరులో ఎదురులేని విజ‌యం క‌ట్టబెట్ట‌డంలో రెడ్డి సామాజిక‌వ‌ర్గ నేత‌లు ఎంతో కృషి చేశారు. వార్డు మెంబ‌ర్ల నుంచి పార్ల‌మెంటు మెంబ‌ర్ల వ‌ర‌కూ అంతా వైసీపీ వారే గెలిచారంటే ఏ స్థాయిలో ప‌నిచేశారో అర్థం చేసుకోవ‌చ్చు. కులాభిమానం, ఆర్థిక స‌హ‌కారం నెల్లూరు పెద్దారెడ్ల నుంచి జ‌గ‌న్ రెడ్డికి బాగానే అందింది. వైసీపీకి వెన్నుద‌న్నుగా నిలిచిన నెల్లూరు పెద్దారెడ్ల‌లో ఒక్కొక్క‌రినీ దూరం పెడుతూ వ‌స్తున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి. అప్ర‌తిహ‌త గెలుపు తెచ్చిన అహంకారం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో అణువ‌ణువూ పేరుకుపోయింది. త‌న క్రైమ్ పార్ట‌న‌ర్ విజ‌య‌సాయిరెడ్డిది కూడా నెల్లూరే. ముందుగా సాయిరెడ్డిని దూరం పెడుతూ వ‌చ్చారు. ఇప్పుడు ఆనం రాం నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిల‌ను ఏకంగా పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీకి అన్నీ తామైన నెల్లూరు పెద్దారెడ్ల‌కి జ‌గ‌న్ రెడ్డి పెద్ద దెబ్బే వేశారు.

త‌న బాబాయ్ హ‌త్య‌కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అడ్డంగా బుక్క‌య్యార‌ని, నేడో రేపో అరెస్టు త‌ప్ప‌ద‌ని సీబీఐయే ప్ర‌క‌టించింది. కోర్టుకి కూడా ఇదే విష‌యాన్ని అఫిడ‌విట్ రూపంలో తెలియ‌జేసింది. కోర్టు కూడా సీబీఐ ఇచ్చిన విచార‌ణ ప్రాసెస్, వాంగ్మూలాలు, సేక‌రించిన సాక్ష్యాలు ప‌రిశీలించి సీబీఐ అరెస్టుని ఆప‌లేమ‌ని ప్ర‌క‌టించింది. దీంతో ఆ త‌రువాత రోజు వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డిల‌ను సీబీఐ అరెస్టు చేస్తుంద‌ని అంతా అనుకున్నారు. స‌డెన్‌గా అసెంబ్లీ స‌మావేశాలు కూడా వ‌దిలేసి జ‌గ‌న్ రెడ్డి అవినాష్ రెడ్డిని తీసుకుని ఢిల్లీ చేరాడు. మోడీ, అమిత్ షాల‌ను క‌లిశాడు. అటునుంచి జ‌గ‌న్ రెడ్డి వ‌చ్చిన వెంట‌నే సీబీఐ అవినాస్ రెడ్డిని విచార‌ణ‌కి కూడా పిల‌వ‌డంలేదు. ఏపీకి సంబంధించి అదానీ అడిగిన కీల‌క ఆస్తులు అప్ప‌గించ‌డానికి జ‌గ‌న్ రెడ్డి సై అన‌డంతో అదానీ కేంద్రంలో పెద్ద‌ల‌ను మేనేజ్ చేశార‌ని, దీంతో అవినాష్ రెడ్డి అరెస్టు ఆగిపోయింద‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. సీబీఐ అధికారి రాంసింగ్ ని కూడా ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని అదానీని కోర‌గా,  కోర్టు ప‌రిధి అంశం కావ‌డంతో సాధ్యం కాలేద‌ని ప్ర‌చారం సాగుతోంది. మొత్తానికి కేంద్రంలోని పెద్ద‌ల‌కు ఏ తాయిలాలు ఇచ్చాడో కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుని ఆప‌గ‌లిగాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో ఆరితేరిపోయిన వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి, మ‌రో ప్ర‌మాద‌క‌ర ఎత్తుగ‌డ‌కి తెర‌తీస్తున్నాడ‌ని అనుమానాలు వ‌స్తున్నాయి. బాబాయ్ హ‌త్య‌కేసులో అడ్డంగా బుక్క‌యిపోయిన అబ్బాయ్ అవినాశ్ రెడ్డి అరెస్టు త‌ప్ప‌దంటూ వార్త‌లు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో ఢిల్లీ వెళ్లి వ‌చ్చాడు. అవినాష్ ద‌ర్యాప్తు కూడా ఆగిపోయింది. ఇదే స‌మ‌యంలో సుప్రీంకోర్టు వివేకా హ‌త్య‌కేసు ఆల‌స్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. ఈ నేప‌థ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టు త‌ప్ప‌ద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అవినాష్ రెడ్డి అరెస్టు అయితే దానిని డైవ‌ర్ట్ చేయ‌డానికి ఏకంగా చంద్ర‌బాబుని అరెస్ట్ చేయాల‌నే వ్యూహంతో జ‌గ‌న్ రెడ్డి  పావులు క‌దుపుతున్నాడ‌ని అర్థం అవుతోంది. రాజ‌ధాని భూముల కేసులో ఏమీ చేయ‌లేక‌పోయాడు. అలైన్ మెంట్ మార్పు పేరుతో టిడిపి  కీల‌క‌నేత నారాయ‌ణ వైపు సీఐడీని పంపాడు. అదీ వ‌ర్క‌వుట్ అవ్వలేదు. మార్గ‌ద‌ర్శి కేసులంటూ ఈనాడు రామోజీరావుపై దృష్టి సారించినా, అదీ బెడిసి కొట్టిన‌ట్టే ఉంది. ఎమ్మెల్సీల ఓట‌మి, వివేకా హ‌త్య కేసు అరెస్టుల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చాలంటే ఏదైనా పెద్దది చేయాల‌నుకుంటున్నార‌ని వైసీపీ క్యాంప్ నుంచి లీకులు వ‌స్తున్నాయి. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కామ్ పేరుతో చంద్ర‌బాబుని అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంద‌ని, బాబాయ్ హ‌త్య‌కేసులో త‌మ అరెస్టులని జ‌నం లైట్ తీసుకుంటార‌ని..జ‌గ‌న్ భావిస్తున్నార‌ని వైసీపీ నేత‌లే న‌ర్మ‌గ‌ర్భంగా చెబుతున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ దేశంలోనే అతి పెద్ద స్కామ్ అని, ఇందులో చంద్రబాబు, లోకేష్‌ అరెస్టు అవుతార‌ని మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్ మీడియాకి చెబుతూ జ‌గ‌న్ రెడ్డి వ్యూహాన్ని చెప్ప‌క‌నే చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read