వైసీపీ కీల‌క నేత చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం చంద్రగిరిలో అడుగిడిన నారా లోకేష్ ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డిని టార్గెట్ చేశారు. ఎటువంటి మొహ‌మాటాల్లేకుండా బ్యాటింగ్ చేశారు. అట‌, ఇట అంటూ శ‌ష‌భిష‌లు లేకుండా చెవిరెడ్డి, ఆయ‌న త‌మ్ముడి అవినీతిపై ధ్వ‌జ‌మెత్తారు. తొండవాడ బహిరంగసభలో నారా లోకేష్ మాట్లాడుతూ ల్యాండ్, శాండ్, వైన్, మైన్, ఎర్రచందనం మాఫియా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చెల‌రేగిపోతోంద‌న్నారు. చంద్రగిరిలో మూడు సీ లు ఉన్నాయ‌ని, అవి 1.చంద్రగిరి 2. చెవిరెడ్డి. 3.చెవిలో పువ్వు అంటూ సైటైర్లు పేల్చారు. చంద్రగిరిలో చెవిరెడ్డి కొండంత దోచుకుని ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాడ‌న్నారు. చెవిరెడ్డి ఎమ్మెల్యే, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్, ప్రభుత్వ విప్ అనే 4 పదవులు చేతిలో పెట్టుకుని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నార‌ని ఆరోపించారు. జ‌నం ఓట్ల‌తో గెలిచిన చెవిరెడ్డి వెయ్యి రూపాయలు దోచుకుని...జ‌నం చేతిలో రూ.10 పెడుతున్నాడ‌న్నారు. చెవిరెడ్డి, ఆయన అనుచరులు ఎర్రచందనంతో వెయ్యికోట్లు దోచుకున్నార‌ని ఆరోపించారు. చెవిరెడ్డి తమ్ముడు రఘ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా అధికారం చెలాయిస్తున్నాడ‌ని, ర‌ఘుకి చీటీల ఎమ్మెల్యే అనే పేరుంద‌ని, రూ.120కోట్ల విలువగల 60ఎకరాల భూమిని దోచుకున్నాడ‌ని ఆరోపించారు. చెరువుల భూములు క‌బ్జా చేసి, స్వర్ణముఖి నదిలో ఇసుక మాఫియా కూడా చెవిరెడ్డి త‌మ్ముడిదేన‌ని స‌భ‌లోనే ప్ర‌క‌టించారు. ఎర్ర‌చంద‌నం ఎక్క‌డున్నా ఎత్తుకుపోయేది చెవిరెడ్డి మ‌నుషులేన‌ని లోకేష్ ఆరోపించారు.

వ‌చ్చే ఎన్నిక‌లు వైసీపీకి జీవ‌న్మ‌ర‌ణ పోరాటం. ఇప్ప‌టికే ఓట‌మి సంకేతాలు అందుతున్నాయి. స‌ర్వేలు ఎదురుత‌న్నుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు జెండా ఎగ‌రేస్తున్నారు. జ‌గ‌న్ రెడ్డి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌త్యేకంగా కాపు కార్డుతో బీఆర్ఎస్ ఏపీ శాఖ‌ని దింపారు. కాపు ఓట్లు జ‌న‌సేన‌, టిడిపి వైపు పోకుండా చీల్చే వ్యూహం ప‌న్నారు. ఇది అంత‌గా వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించ‌క‌పోయేస‌రికి కాపు బ్రాండ్ వంగ‌వీటిని టార్గెట్ చేశారు. వైసీపీ కోసం ప‌నిచేసే ఐ ప్యాక్ బృందం ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఫేక్ అక్కౌంట్ల‌తో వంగవీటి రాధా పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని తీవ్రం చేశారు. అన్నీ జ‌న‌సేన పేరుతో ఐ ప్యాక్ ఆధ్వ‌ర్యంలో ఉన్న ఫేక్ ఖాతాల నుంచి ఒకే ర‌క‌మైన కంటెంట్ పోస్టు కావ‌డంతో అంద‌రిలోనూ అనుమానాలు తీవ్రం అయ్యాయి. దీనిపై వంగవీటి రాధా యువసేన స్పందించింది. రాధాపై కొంద‌రు కావాల‌నే దుష్ప్రచారాలు చేస్తున్నార‌ని,  రాధా ప్రతిష్టను మసకబార్చాలని కొందరు కుయుక్తులు పన్నుతున్నార‌ని,  ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు అని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  రాధా టిడిపిలోనే కొనసాగుతారని పదేపదే చెప్పాల్సిన అవసరం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. పదవుల కోసమో, ఇతర అవసరాల కోసం పార్టీలు మార్చే నైజం రాధాది కాద‌ని తేల్చి చెప్పారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో రాధా ప్రతిష్టను మంట కలపాలని చూసే వారి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవ‌ని తేల్చి చెప్పేశారు.

విశాఖ ఎప్పుడెప్పుడు వెళ‌దామా అని ఎదురుచూస్తోన్న సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి ఏ ముహూర్తం క‌లిసి రావ‌డంలేదు. తానొక‌టి త‌లిస్తే, సుప్రీంకోర్టు మ‌రొక‌టి త‌ల‌చింది. ఇల్లు చూసుకున్నానని, పోర్టు గెస్ట్ హౌస్ విడిది, రుషికొండ సీఎం ఆఫీసు అంటూ త‌న బులుగు మీడియాలో ప్ర‌చారం చేసుకున్నారు. మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ ఒక‌డుగు ముందుకు వేసి ఏకంగా మార్చి 22న సీఎం విశాఖ వ‌చ్చేస్తున్నార‌ని ప్ర‌క‌టించారు. అమరావ‌తి రాజ‌ధానిపై సుప్రీంకోర్టులో కేసులు ఉండ‌డంతో అవి త్వ‌ర‌గా తేల్చాల‌ని ఏపీ స‌ర్కారు న్యాయ‌వాదులు కోరినా ఫ‌లితంలేకుండా పోయింది.  జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం ముందు ఏపి ప్రభుత్వం తరపున న్యాయవాదులు త్వ‌ర‌గా విచార‌ణ ముగించాల‌ని కోరారు. స్పందించిన బెంచ్‌ మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అమరావతి పిటిషన్లపై గత వారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్ లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేస్తూ సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశాలు ఇవ్వ‌డంతో వాయిదా ప‌డింది. ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తే అని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లింది ఏపీ స‌ర్కారు. ఈ పిటిషన్ల పై విచారణ తేదీ కూడా ప్రకటించలేదు. అయితే వైసీపీ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తున్న టీవీ9 అయితే విశాఖ రాజ‌ధానికి లైన్ క్లియ‌ర్ అంటూ సుప్రీంకోర్టు పేరుతో బ్రేకింగ్ కూడా వేసేసింది.  ఈ నేప‌థ్యంలో విశాఖ తొంద‌ర‌గా షిఫ్ట్ అవ్వాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న సీఎం వైఎస్ జ‌గ‌న్ త‌న న్యాయవాదుల‌తో మార్చి 7 లోగా విచార‌ణ‌కొచ్చేలా చేయాలని కోరినా కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు.మార్చి 28వ తేదీ విచారణ జాబితాలో ఉంచుతామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో విశాఖ రాజ‌ధానికి అనుకూలంగా తీర్పు వ‌స్తే వెంటనే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాల‌నుకున్న స‌ర్కారు ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాాలంటూ గ‌త ఏడాది హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఏపీ స‌ర్కారు ఆరు నెలల తర్వాత సుప్రీం కోర్టులో స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్‌ దాఖలు చేసింది.

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌-త్య కేసులో నిందితుడు సునీల్ యాద‌వ్ దాఖ‌లు చేసిన మ‌రో బెయిల్ పిటిష‌న్‌ని కోర్టు కొట్టేసింది. గ‌తంలోనూ వేసిన పిటిష‌న్లు కొట్టేసిన కోర్టు, ఈ సారి సీబీఐ వాద‌నతో ఏకీభ‌విస్తూ బెయిల్ పిటిష‌న్ ని కొట్టివేసింది. సునీల్ కి బెయిల్ ఇవ్వొద్ద‌ని వివేకా కుటుంబ‌స‌భ్యులు కూడా హైకోర్టుని ఆశ్ర‌యించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ-త్య కేసు విచారణ దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. హ-త్య కేసును సీబీఐ విచారిస్తున్నందున ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని స్ప‌ష్టం చేసిందిద‌. నిందితుల స్వేచ్ఛ కంటే సాక్షుల భద్రత, నిష్పాక్షిక దర్యాప్తు ముఖ్యమని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. హ‌-త్య‌ కేసులో కీల‌క నిందితుడు సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ న్యాయ‌స్థానాన్ని కోరింది. వివేకా హ-త్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుందని కోర్టుకి విన్న‌వించింది. హ-త్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు వివరించింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. వివేకా నంద‌రెడ్డి హ‌-త్య‌కేసులో సీబీఐ చెబుతున్న పెద్ద‌త‌ల‌కాయ‌లు ఎవ‌రో తెలుగు రాష్ట్రాల‌లో సామాన్య ప్ర‌జ‌ల‌కీ కూడా తెలిసిపోయింది. వివేకా హ‌-త్య కేసు విచార‌ణ‌లో భాగంగా ఇప్ప‌టికే రెండుసార్లు క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ పిలిపించింది. అవినాశ్‌రెడ్డికి ఏమీ తెలియ‌ద‌ని, ఆయ‌న త‌న త‌మ్ముడ‌ని, చాలా అమాయ‌కుడ‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డ‌మే ఆ పెద్ద‌త‌ల‌కాయ‌ల‌పై అనుమానాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి.

Advertisements

Latest Articles

Most Read