మాస్క్ అడిగిన డాక్ట‌ర్ సుధాక‌ర్ జ‌గ‌న్ దెబ్బ‌కి పిచ్చోడ‌య్యాడు. మ‌ద్యం ధ‌ర‌లు దోపిడీపై ప్ర‌శ్నించిన ఓంప్ర‌తాప్ జ‌గ‌న్ పాల‌న‌లోనే శ‌వం అయ్యాడు. జ‌గ‌న్ రెడ్డి ట్రీట్మెంట్ ఎలా వుంటుంది అనే దానికి ఇవి ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. తాజాగా ఒంగోలుకి చెందిన వైసీపీ నేత‌ సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మాజీ మంత్రి బాలినేని, ఆయ‌న త‌న‌యుడిపై ఆరోప‌ణ‌లు చేశాడు. వెంట‌నే సుబ్బారావు గుప్తాపై జ‌గ‌న్ మార్క్ ట్రీట్మెంట్ ఆరంభ‌మైంది. గంజాయి కలిగి ఉన్నాడని గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. గతంలోనూ వైసీపీ తీరుని ఎండ‌గ‌ట్టి, అప్ప‌టి మంత్రి బాలినేనిపై ఆరోప‌ణ‌లు చేశాడ‌ని సుబ్బారావు గుప్తాపై బాలినేని అనుచ‌రులు సుభానీ గ్యాంగ్ దాడి చేసింది. తాజాగా బాలినేని గ్యాంగ్ ఓ హాస్ట‌ల్, దుకాణాల‌పై దాడి చేయ‌గా సుబ్బారావు గుప్తా మ‌ళ్లీ ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో ఏకంగా జ‌గ‌న్ రెడ్డి స్టైల్ గంజాయి కేసులు బ‌నాయించి మ‌రీ అరెస్టు చేశారు. ఒంగోలుకు చెందిన వైసీపీనేత వైశ్యుడైన‌ సుబ్బారావుగుప్తాపై గంజాయి కేసు బ‌నాయించ‌డాన్ని టీడీపీ వాణిజ్యవిభాగం రాష్ట్రఅధ్యక్షులు డూండీ రాకేశ్ ఖండించారు. ఈ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ది ఉంటే రాష్ట్రంలో గంజాయి అమ్మేవాళ్లలో ఒక్క‌రినినైనా ప‌ట్టుకోవాల‌ని, ఆర్యవైశ్యుడైన సుబ్బారావుగుప్తాపై క‌క్ష సాధించేందుకు గంజాయి కేసులు బ‌నాయించ‌డం ముఖ్యమంత్రి సిగ్గుప‌డాల‌ని రాకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వైసీపీ అధికారంలోకి రావాల‌ని తాను రాజ‌శ్యామ‌ల యాగం చేశాన‌ని, విశాఖ శార‌దా పీఠం స్వ‌రూపానంద స్వామి గ‌తంలోనే చెప్పారు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక స్వామి అన‌ధికారిక దేవాదాయ‌శాఖా మంత్రిగా అధికారం చెలాయిస్తున్నార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఇటీవ‌ల ఏమైందో ఏమో కానీ విశాఖ పీఠం తాము న్యూట్ర‌ల్ అని చెప్పుకోవ‌టానికి ప్ర‌య‌త్నిస్తోంది. వైసీపీ దారుణ ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని డిసైడ్ అయిన త‌రువాతే స్వాములు ఇలా ప్లేటు ఫిరాయిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి రావాల‌ని కురుక్షేత్రకు సమీపంలోని ఆశ్రమం ఆధ్వర్యంలో లక్ష చండీ మహాయజ్ఞం నిర్వ‌హించార‌ని వార్త‌లు గుప్పుమన్నాయి. దీనిపై పీఠం ఉత్త‌రాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి స్పందించారు. విశాఖ శారదా పీఠం ఒక రాజకీయపార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. విశాఖ శారదాపీఠం ఎవరికీ వత్తాసు పలకదని తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీల కోసం పూజలు చేయడం లేదని స్ప‌ష్టం చేశారు. మొదటి నుంచీ పీఠంపై కొందరు ఉద్దేశపూర్వకమైన ముద్ర వేస్తున్నారని.. ఎవరైనా శారదా పీఠాన్ని ఆశ్రయిస్తే యాగాలు చేస్తాం తప్పితే ఏ పార్టీకో, వ్యక్తికో అధికారం రావాలని ఎప్పుడూ చేయలేదు అని చెప్పుకొచ్చారు. మొద‌టిసారిగా త‌మ పీఠంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై స్వామి వివ‌ర‌ణ ఇవ్వ‌డంలోనే ఏదో మ‌త‌ల‌బు ఉందంటున్నారు. ల‌క్ష చండీయాగం  లైవ్ చేస్తే, ఒక్క‌రు చూడ‌టం కూడా సోష‌ల్మీడియాలో ట్రోలింగ్‌కి గురైంది. అధికారం దూరం అవుతుంద‌ని తెలిసే, శార‌దా పీఠం స్వాములు జ‌గ‌న్ రెడ్డికి దూరం అవుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ లో విజ‌య‌సాయిరెడ్డిని కూర‌లో క‌రివేపాకులా వాడి పారేసార‌ని ఆయ‌న అభిమానులు వాపోతున్నారు. కొద్దిరోజులుగా తాడేప‌ల్లి ప్యాలెస్‌కీ, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు సాయిరెడ్డి. ఒక్కో ప‌ద‌వి నుంచి త‌ప్పించేయ‌డంతో తీవ్ర నిస్పృహ‌లో ఉన్న విజ‌య‌సాయికి మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డిన‌ట్టు వ‌ర‌స విషాదాలు, కేసులు వెంటాడుతున్నాయి. అల్లుడు అన్న అర‌బిందో శ‌ర‌త్ చంద్రారెడ్డి డిల్లీ లిక్క‌ర్ కేసులో బుక్క‌య్యాడు. ఎలా విడిపించుకోవాలో తెలియ‌క ఢిల్లీ పెద్ద‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. అయితే వైసీపీ అధిష్టానం విజ‌య‌సాయిరెడ్డికి ఈ కేసు విష‌యంలో ఎటువంటి సాయం అందించ‌డంలేద‌ట‌. మ‌రోవైపు సాయిరెడ్డికి కుమార్తె వ‌ర‌స‌య్యే అలేఖ్య రెడ్డి భ‌ర్త తార‌క‌ర‌త్న మ‌ర‌ణం మ‌రింత కుంగ‌దీసింది. మూడు త‌రాలుగా వైఎస్ కుటుంబాన్నే న‌మ్ముకుని ఉన్న న‌మ్మ‌క‌మైన ఆడిట‌ర్‌ మాన‌సికంగా అలిసిపోయి వున్న ద‌శ‌లో జ‌గ‌న్ రెడ్డి నుంచి క‌నీస మ‌ద్ద‌తు క‌రువైంది. కొద్దిరోజులుగా ట్వీట్లు కూడా త‌గ్గించేశారు. వేసేవి కూడా చాలా మ‌ర్యాద భాష‌లో ఉంటున్నాయి. విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు ప‌ట్ల ఇటీవ‌ల క‌న‌బ‌రుస్తున్న గౌర‌వం కూడా తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఆగ్ర‌హావేశాల‌కు మ‌రో కార‌ణం అని తెలుస్తోంది. అయితే ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు, ప్ర‌ముఖుల‌తో లాబీయింగ్‌లో ఆరితేరిన సాయిరెడ్డిని వైసీపీ దూరం పెట్టింది. గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌కి కూడా పెద్ద‌గా పాత్ర‌లేదు. కానీ సాయిరెడ్డి సేవ‌లు వాడుకోవాల‌నుకుని చెవిరెడ్డిని రాయ‌బారం పంపారు. స‌మ్మిట్‌కి ముందు విశాఖ‌లో లెక్క‌ల మాస్టారుని దింపినా..ఎక్క‌డా ఆయ‌న మార్కు క‌న‌ప‌డ‌లేదు. పిలిచి మ‌రీ సాయిరెడ్డిని అవ‌మానించార‌ని ఆయ‌న మ‌నుషులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read