వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన ఆరోపణలు చేశారు. విజయనగరం జిల్లా సాలూరు రోడ్‌షో లోపాల్గొన్న చంద్రబాబునాయుడు జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బాబాయ్‌ని ఇంత దారుణంగా చంపేసి, ఎవరో చంపేసినట్టు నాటకాలు ఆడుతున్నారు. ‘ముందు నాటకం, తర్వాత నేనే (చంద్రబాబు) చంపానని బూటకం. ఆ తర్వాత డ్రైవర్‌ను రమ్మంటే చంపేశాడని లెటర్ రాశారట. దీన్ని ఎవరైనా నమ్ముతారా? నేను చీఫ్ క్రిమినల్ అంట. ఎప్పుడైనా నా జీవితంలో ఒక్క కేసైనా ఉందా? వారి జీవితంలో ఎప్పుడూ కేసులే. ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే మీకు రక్షణ ఉంటుందా? ఆడబిడ్డలు బయటకు వస్తే ఇంటికి రాగలరా? వీధికి ఒక రౌడీ తయారవుతాడు.’ అని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.

pulivendula 22032019

వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. తనను చూస్తే పరిశ్రమలు వస్తాయని.. జగన్ మోహన్ రెడ్డిని చూస్తే పరిశ్రమలు పారిపోతాయన్నారు. ఆయన గతంలో పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్‌లను జైలుకు తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శించారు. విజయనగరం జిల్లా సాలూరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీలో యువత కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తుతుంటే వైసీపీలో యువతకు సారా పోయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయ్. జగన్‌ను చూస్తే పరిశ్రమలు పారిపోతాయి. జగన్ జైలుకు తీసుకుపోతారని అందరకీ భయం. నన్ను చూస్తే అనుమతులు సులభంగా వస్తాయని, పెట్టుబడులు పెడితే ఇబ్బందులు ఉండవని, వాటాలు అడగబోమని అందరూ నా దగ్గరికి వస్తారు. జగన్ మాత్రం వాటాలు తీసుకోవడమే కాదు... జైలుకు తీసుకెళ్తారు. ఇంతకు ముందు చాలా మందిని జైలుకు తీసుకెళ్లారు. వైసీపీకి సహకరిస్తే మీకు తెలియకుండా మిమ్మల్ని నేరాల్లో ఇరికించి జైల్లో పెట్టిస్తారు. జాగ్రత్త. అది పనికిమాలిన పార్టీ. నేరాల చిట్టా.’ అని చంద్రబాబునాయుడు అన్నారు.

pulivendula 22032019

కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో రూ.1000 కోట్లు జగన్ మోహన్ రెడ్డికి పంపించారని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులను కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఆస్తులు ఉన్న లీడర్లను కేసీఆర్ భయపెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఐటీ దాడులతో మోదీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఓటుకు రూ.5వేలు ఇచ్చి కొనేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారని అన్నారు. ఒక్కసారి వైసీపీకి అవకాశం ఇస్తే మొత్తం దోచేసుకుంటారని చంద్రబాబు అన్నారు. వైసీపీకి ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రం శాశ్వతంగా అంథకారం అయిపోతుందన్నారు.

మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీకి బీజేపీ నాయకత్వం టికెట్‌ నిరాకరించింది. పార్టీ 184 మందితో ప్రకటించిన మొదటి జాబితాలో ఆయన పేరు లేదు. ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గాంధీనగర్‌ నుంచి బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ అయిన అమిత్‌ షా పేరును ప్రకటించడం పాత తరానికి చెందిన పార్టీ శ్రేణుల్ని విస్మయానికి గురిచేసింది. గత 6 పర్యాయాలుగా ఆడ్వాణీ గాంధీనగర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విశేషమేమంటే తొలినాళ్లలో అమిత్‌ షా- ఆడ్వాణీకి గాంధీనగర్‌లోనే పోలింగ్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఓ ఆరెస్సెస్‌ నేత గతవారం ఆడ్వాణీ నివాసానికి వెళ్లి బీజేపీ నిర్ణయాన్ని ఆయనకు తెలియపర్చినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. వయసు పైబడ్డ దృష్ట్యా ఆయనను ఎంపిక చేయలేదని ఆయన చెప్పినట్లు సమాచారం. బయటికి మాత్రం ఆడ్వాణీయే పోటీకి విముఖత ప్రదర్శించారని బీజేపీ ప్రచారం చేసింది. బీజేపీ దశ దిశలను మార్చి ఓ పటుతర రాజకీయ శక్తిగా నిలిపిన ఈ 91-ఏళ్ల అగ్రనాయకుణ్ని బీజేపీ నాయకత్వం దాదాపుగా వెళ్లగొట్టిందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

pulivendula 22032019

పోటీ చేయడం, చేయకపోవడం అనేది ఆయన ఇష్టానికే వదిలేసినట్లు నిన్న మొన్నటి దాకా బీజేపీ అధికారికంగా నమ్మబలికింది. అయితే గాంధీనగర్‌ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ నాయకత్వం ఆయనను అడగనే లేదని, ఆయన కూడా తాను పోటీచేస్తానని వారికి చెప్పలేదని, ఆయన స్థాయికి అలా అడుక్కోవడం సరికాదని ఆడ్వాణీ వ్యక్తిగత కార్యదర్శి దీపక్‌ చోప్రా మంగళవారం వ్యాఖ్యానించడంతో పార్టీ ఆయనను దూరం పెట్టిందన్న సంకేతాలు వెలువడ్డాయి. 1989-92 ప్రాంతాల్లో సోమ్‌నాథ్‌- అయోధ్య రథయాత్రను చేపట్టి ఆడ్వాణీ బీజేపీని ఓ బలవత్తర రాజకీయ పార్టీగా మార్చడంలో సఫలమయ్యారు. హిందూత్వానికి ప్రతీక అయ్యారు. 1991లో విఫలమైనా 1998, 1999ల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆడ్వాణీ మార్గం ఉపకరించింది.

pulivendula 22032019

వాజ్‌పేయి ప్రధాని అయినపుడు ఆడ్వాణీ ఉప ప్రధాని పదవిని కూడా అలంకరించారు. హోంమంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో ఓ వెలుగువెలిగిన ఆడ్వాణీ 2014లో మోదీ ప్రభంజనం తరువాత మసకబారిపోయింది. పార్టీపై పట్టు పెంచుకోవడానికి అమిత్‌ షాను అధ్యక్షుఢిగా చేసిన మోదీ- ఆ క్రమంలో ఆడ్వాణీని, మరో ఇద్దరు సీనియర్‌ అసమ్మతి నేతలు - మురళీ మనోహర్‌ జోషి, శాంతకుమార్‌ వంటి వారిని ‘మార్గదర్శక్‌ మండల్‌’ పేరిట మూల కూర్చోబెట్టారు. ఈ మండలి ఎన్నడూ సమావేశమైనది లేదు. పైపెచ్చు, ఆడ్వాణీని ఓ మీటింగ్‌లో మోదీ అసలు పలకరించకుండా చూసీ చూడనట్లు వెళ్లిపోయి నట్లు వీడియోలు వెలువడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఐదు రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. పార్టీ అభ్యర్థులు, రెబెల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లకు తరలిరావడంతో కార్యాలయాలు సందడిగా మారాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి శుక్రవారం అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్ వేశారు. ఇటీవల నియోజకవర్గంలోని ఖగ్గల్లు గ్రామంలో జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిక్కారెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అంబులెన్స్‌లో వచ్చిన తిక్కారెడ్డిని అనుచరులు స్ట్రెచర్‌పై కార్యాలయం లోపలికి తీసుకెళ్లి నామినేషన్ వేయించారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం తిక్కారెడ్డి అంబులెన్స్‌లోనే తిరిగి వెళ్లిపోయారు.

pulivendula 22032019

ఈ సందర్భంగా తిక్కారెడ్డికి మద్దతుగా ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పెద్దయెత్తున ర్యాలీ చేపట్టారు. గతవారం ప్రచారంలో భాగంగా ఖగ్గల్లు గ్రామానికి వెళ్లిన తిక్కారెడ్డి అక్కడ టీడీపీ జెండాను ఎగురవేశారు. ఖగ్గల్లు ప్రస్తుత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి(వైసీపీ) స్వస్థలం కావడంతో ఆయన భార్య జయమ్మ, కుమారుడు ప్రదీప్‌ రెడ్డి గ్రామస్థులతో కలిసి తిక్కారెడ్డిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తిక్కారెడ్డి గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. అందులో ఓ బుల్లెట్ తిక్కారెడ్డి కాలులోకి దూసుకెళ్లడంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. నడిచే అవకాశం లేకపోవడంతోనే ఆయన స్ట్రెచర్‌పై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.

pulivendula 22032019

మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి భార్య వెంకటేశ్వరమ్మ ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. ఖగ్గల్లు ప్రచారంలో తిక్కారెడ్డిపై వైసీపీ శ్రేణులు దాడికి దిగడం.. గన్‌మెన్లు జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డి గాయపడటం తెలిసిందే. హైదరాబాద్‌లో తిక్కారెడ్డి చికిత్స పొందుతున్నారు. ప్రచార బాధ్యతలను ఆయన భార్య వెంకటేశ్వరమ్మ భుజాన వేసుకున్నారు. ఊరూరు.. వీధివీధి.. ఇంటింటికీ తిరుగుతున్నారు. తన భర్తపై జరిగిన దాడిని వివరిస్తూ కన్నీరు పెడుతున్నారు. ‘మీ ఓటుతో నా భర్త ప్రాణాలను కాపాడండి’ అని ఓటర్లకు విన్నవిస్తున్నారు. భర్త లేకుండా ప్రచారానికి వస్తున్న వెంకటేశ్వరమ్మను చూసి గ్రామీణులు చలించిపోతున్నారు. కోసిగిలో పలువురు కన్నీరు పెట్టారు. ‘అయ్యో.. దుర్మార్గులు ఎంత పని చేశారు.. మీరు ధైర్యంగా ఉండండి.. మా ఓటు మీకే..’ అని ఆమెకు ధైర్యం నూరిపోస్తున్నారు. ఒక పల్లె నుంచి మరో పల్లెకు వెళుతూ, పంటచేలల్లో రైతులు కనిపించినా.. కూలీలు కనిపించినా.. వారిని పలకరిస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. ఆమెతో పాటు తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి, మరదలు కల్పన ప్రచారంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.

నామినేషన్లు జోరందుకున్నాయి. ప్రచారం హీటెక్కుతోంది. అయినా వైసీపీలోని కొంతమంది సీనియర్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్‌ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న సీనియర్లకు పార్టీ అధ్యక్షుడు జగన్‌ మొండిచేయి చూపారు. కనీసం వీరి అభ్యర్థిత్వాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో వీరంతా ఎన్నికలకు దూరంగా నిలిచి ఇంటికే పరిమితమయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి ఇటీవల వైసీపీలో చేరారు. ఆమె టెక్కలి అసెంబ్లీ నుంచైనా.. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచైనా పోటీచేస్తారని భావించారు. కానీ ఆమె పేరు వినిపించలేదు.

pulivendula 22032019

ఇక విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి అవకాశం ఇస్తారని అనుకున్నా.. దీనిని జగన్‌ నిరాకరించారు. ఈ సీటును ఆమెకుగానీ, తన మేనల్లుడు చిన్న శ్రీనుకుగానీ ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరారని సమాచారం. కానీ అసెంబ్లీకే బొత్స కుటుంబాన్ని పరిమితం చేశారు. గత ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పోటీ చేశారు. కానీ, ఈసారి ఆమెకు ఎక్క డా స్థానం కల్పించలేదు. ఈ ఎన్నికల్లో ఆమె ఉనికి కనిపించలేదు. మాజీ ఎంపీ, జగన్‌ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు లోక్‌సభ స్థానం ఇవ్వకుండా జగన్‌ హ్యాండిచ్చారు.

 

pulivendula 22032019

గత ఎన్నికల్లో ఆయన చేతిలో ఓటమి చవి చూసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి గౌరవ మర్యాదలు చేసి.. వైవీకి మాత్రం పొగ పెట్టారంటూ విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇక నెల్లూరులోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మాగుంటను నెల్లూరు నుంచి బరిలోకి దింపితే.. ఒంగోలు నుంచి మేకపాటి రాజమోహనరెడ్డికి అవకాశం ఇస్తారని వైసీపీ వర్గాలు భావించాయి. కానీ నెల్లూరు రూరల్‌కు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్‌ పొందిన ఆదాల ప్రభాకరరెడ్డిని పిలిపించుకుని మరీ నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ను ఇచ్చారు. ఇక జగన్ బాబాయి, వైవీ సుబ్బారెడ్డి అయితే అడ్రస్ లేరు. ఇక్కడ ఉండ లేక విదేశాలకు కూడా వెళ్లి వచ్చారు.

Advertisements

Latest Articles

Most Read