ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒకరోజు ముందు బీజేపీయేతర పక్షాల సమావేశం జరుగనుండటంపై సర్వత్రా చర్చజరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గద్దె దించి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఏకైక అజెండాతో సమావేశం నిర్వహిస్తున్నారు. గత నెలలో జాతీయస్థాయి ప్రతిపక్ష అధిపతులు, ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన చర్చల పర్యావసానం దేశంలో బీజేపీయేతర పార్టీలలో ఐక్యత, ఉమ్మడి కార్యాచరణకు మలి విడత సమావేశం నిర్వహిస్తున్నారు. ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సరికొత్త ఫ్రంట్ ఏర్పాటులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలకభూమిక వహించనున్నారు. దిల్లీలో ఎన్డీయేతర పక్షాల సమావేశానికి సోనియా, మన్మోహన్ సింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కూటమి పేరు, ఎజెండా నిర్ణయిస్తారని భావిస్తున్నారు. ప్రజా ప్రంట్ అనే పేరు ఉంటుందా.. మరేదైనా పేరా అనేది నిర్ణయిస్తారు.

cbn 10122018 2

ఏడు రాష్ట్రాల సీఎంలతో సహా.. ఇతర పార్టీల ముఖ్య నేతలు హాజరవుతారు. ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సరికొత్త ఫ్రంట్ ను రూపోమ్దిమ్చాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి రేపు ఫలితాలు విడుదల కానున్నాయి. మరోపక్క పార్లమెంట్ సమావేశాలు మొదలవనున్నాయి. జనవరి 8 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాల వేళ శీతాకాల సమావేశాలు వేడి పుట్టించనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వాన్ని , అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీయనున్నాయి. మోదీ ప్రభుత్వానికి పూర్తికాల చివరి సమావేశం ఇదే. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి దెబ్బ తప్పదని దేశ ప్రజలు ఆశిస్తున్నారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు సమావేశంలో తీసుకునే నిర్ణయాలు దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయి.

cbn 10122018 3

దేశ ప్రజలు నియంత పాలనను అంగీకరించరని ఎలుగెత్తి చాటనున్నారు. పార్లమెంటు అనుబంధ భవనంలో మధ్యాహ్నం 3.30 గంటలకు కీలక సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు మన్మోహన్‌సింగ్‌, గులాంనబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే, అహ్మద్‌ పటేల్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్‌ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఎంకే నేత స్టాలిన్‌, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, ఎన్‌సీ అగ్రనేత ఫరూఖ్‌ అబ్దుల్లా, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్‌సింగ్‌, ఆర్‌జేడీ యువనేత తేజస్వియాదవ్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎ నేత హేమంత్‌ సోరెన్‌, ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా అధ్యక్షుడు బాబూలాల్‌ మరాండీ, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌, రాష్ట్రీయ లోక్‌సమతాపార్టీ నేత ఉపేంద్రకుష్వాహా, అసోం యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ నేత బద్రుద్దీన్‌ అజ్మల్‌ -కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులు అమరీందర్‌సింగ్‌ (పంజాబ్‌), నారాయణస్వామి(పుదుచ్చేరి)లతో పాటు కర్ణాటక సీఎం కుమారస్వామి, ఎల్డీఎఫ్‌ సీఎం పినరయి విజయన్‌(కేరళ)లనూ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.

రాజధాని ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా నిర్మితమవుతున్న సెక్రటేరియట్‌ - హెచ్‌వోడీ టవర్లకు ఫౌండేషన్‌ ప్రక్రియకు ఏపీ సీఆర్డీయే సిద్ధమవుతోంది. దేశంలోనే ఇంతకు ముందెక్కడా కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 5 టవర్ల (ఒక్కొక్కటి 40 అంతస్థులతో 4టవర్లు, 50 అంతస్థులతో 1)కూ కలిపి 12 వేల క్యూబిక్‌ మీటర్ల మేర ఒకే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను వేయాలని నిర్ణయించిన ఏపీసీఆర్డీయే అమరావతికి మరో విశిష్ఠతను జోడించనుంది. వేలాది కార్మికులు, నిపుణులతోపాటు భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి, యంత్రాలు, సునిశిత ప్రణాళిక, అద్భుత సమన్వయం అవసరమయ్యే ఇంతటి ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ దేశంలో ఇదే ప్రథమని చెబుతున్నారు! 3 రోజులు రేయింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తే గానీ పూర్తవని ఈ బృహత్తర ప్రక్రియను త్వరలోనే చేపట్టాలని సీఆర్డీయే భావిస్తోంది. ఇందుకోసం పలు శాఖలు, సంస్థలు, నిష్ణాతులను సమన్వయపరచుకోవడంలో నిమగ్నమైంది.

amaravati 09122018 2

అన్నీ వేలాది టన్నుల్లోనే.. సచివాలయం 5 టవర్లకు కలిపి సుమారు 13 అడుగుల లోతున వేసే 12 వేల క్యూ.మీ. అత్యంత భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు అదే స్థాయిలో నిర్మాణ సామగ్రి అవసరం. దీనికోసం సుమారు 1300 టన్నుల స్టీల్‌, 3,000 టన్నుల సిమెంట్‌, 12,000 టన్నుల కంకర, 8,000 టన్నుల ఇసుక, 3,000 టన్నుల ఫ్లైయా్‌షతోపాటు 12 లక్షల లీటర్ల కృష్ణానదీ జలాలు కావాల్సి ఉంటుందని అంచనా వేశారు. వీటన్నింటినీ కలిపి కాంక్రీట్‌ మిక్సర్‌ తయారు చేసేందుకు 35 టన్నుల సామర్ధ్యం కలిగిన హెడ్‌ మిక్సర్లను వినియోగించాలి.

 

amaravati 09122018 3

సామగ్రి తరలింపునకు భారీ ప్రణాళికలు.. భారీగా అవసరమయ్యే నిర్మాణ సామగ్రిని సచివాలయం నిర్మాణ ప్రాంతంలో ఉంచడం సాధ్యం కాదు కాబట్టి అవి లభ్యమయ్యే చోటు నుంచి వాటిని ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేసే రోజుల్లో నేరుగా చేర్చనున్నారు. వచ్చే వారం ఈ ప్రక్రియ ఓ కొలిక్కి రానుందని సమాచారం. అది పూర్తయిన వెంటనే బహుశా ఈ నెల 10- 16 తేదీల మధ్య ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేయవచ్చునని తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పనులు ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి సారించింది. ఇంతటి అత్యంత భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేయబోతున్న సీఆర్డీయే.. కాంక్రీట్‌ టెక్నాలజీలో ప్రపంచంలోనే సుప్రసిద్ధ సంస్థలు, వ్యక్తుల మార్గదర్శకత్వంలో ఎప్పటికప్పుడు పలు పరీక్షలు చేయిస్తూ, వాటి ఫలితాల ఆధారంగా కార్యాచరణను రూపొందించుకుంటోంది.

ఎంతో శ్రావ్యంగా పాటలు పాడుతూ యూట్యూబ్‌లో లక్షాలాది శ్రోతలను అలరిస్తున్న పసల బేబిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. అలవోకగా పాటలు పాడుతూ యూట్యూబ్‌లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పసల బేబిని సీఎం చంద్రబాబు అభినందించారు. బేబినీ ఎంపీ మురళీమోహన్, మహిళా చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి చంద్రబాబుకు పరిచయం చేశారు. సినీ పాటలతో లక్షలాది మంది అభిమానులను సోషల్ మీడియా ద్వారా మెప్పించడం గొప్ప విషయమని ప్రశంసించారు. అంతేకాదు బేబిని సీఎం సన్మానించారు. ఈ సందర్భంగా బేబి పాడిన పాటకు చంద్రబాబు ఫిదా అయ్యారు.

baby 08122018 1

చంద్రబాబును కలిసిన అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ బేబిగారు అద్భుతమైన పాటలు పాడుతున్నారు. ‘‘ఆమె చదువుకోలేదు. సంగీత జ్ఞానం అంతకన్నా లేదు. బేబి మట్టిలో మాణిక్యం. వ్యవసాయ కూలిగా పనిచేస్తూ.. పనులు చేసేటప్పుడు పాటలు నేర్చుకుంది. ఆమె పాడిన పాటలను ఎవరికి వాళ్లే అద్భుతమని కొనియాడారు. బేబి పాటలను ఎవరో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఆమె ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్, కోటి, కీరవాణిలు ఆమెతో పాటలు పాడిస్తామని అంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా బేబిని ఇంటికి పిలిచి సత్కారం చేసి కొంత పారితోషకం కూడా ఇచ్చారు. చంద్రబాబు కూడా ఆమెను ఆశ్వీర్వదించారు. బేబిని వెలుగులోకి తేవాలని సీఎం చెప్పారు’’ అని మురళీమోహన్ తెలిపారు.

baby 08122018 1

కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో గ్రామీణ గాయని బేబి పాడిన పాటలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పొలం పనులు చేసేటప్పడు ఆమె పాడిన పాటలు ఇప్పుడు సంచలనం అవుతున్నారు. టాలీవుడ్ అంతా ఆమె చుట్టూ తిరుగుతోంది. ఆమె పాడిన పాటలకు ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి, కోటి, ఏఆర్ రెహ్మాన్, కోటి, కీరవాణి, మురళీమోహన్‌‌లు ఆమె పాటలను ఆస్వాదించిన వారిలో ఉన్నారు. ప్రభుదేవా, నగ్మా నటించిన ప్రేమికుడు సినిమాలోని ‘ఓ చెలియా నా ప్రియసఖియా’ అంటూ ఆమె పాడిన పాటకు లక్షలాది లైక్‌లు, వేల షేర్, కామెంట్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పాటలతో లక్షలాది మంది అభిమానులను బేబి సొంతం చేసుకుంది. బేబి స్వస్తలం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని వడిశలేరు.

 

 

తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) మళ్లీ దాడులు మొదలుపెట్టింది. టీడీపీ నేతలు లక్ష్యంగా ఇవి జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం నేతలు, సానుభూతి పరుల పై ఐటి దాడులు చేసి, ఏమి దొరక్క, మీడియాకు తప్పుడు లీక్ లు ఇచ్చి, హంగామా చేసారు. అయితే, ఈసారి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన కార్యాలయాల్లో సోదాలు చేశారు. పోలింగ్‌కు ముందు బీద మస్తానరావు, ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ ముగిసిన తర్వాత మరోసారి ఐటీ గురి పెడుతుందని పార్టీ నేతలు ముందుగానే ఊహించారు. శుక్రవారం సాయంత్రం నుంచే ఈ అంశంపై ప్రచారం జరగ్గా శనివారం అదే జరిగింది.

it 09122018 2

టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి చెందిన పలు సంస్థల కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. చెన్నైలోని టి.నగర్‌ బజుల్లా రోడ్డులో ఉన్న బాలాజీ గ్రూప్‌ ఆఫీసు, పూందమల్లిలో ఉన్న ఎండ్రికా ఎంటర్‌ప్రైజెస్‌ డిస్టిలరీస్‌ ఫ్యాక్టరీ, మాగుంట కుటుంబానికి చెందిన సన్నిహితుల కార్యాలయాలు.. ఇలా పదిచోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. డిస్టిలరీ ఫ్యాక్టరీలో లెక్కల్లో చూపని నగదు భారీగా పట్టుబడినట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే ఎప్పటిలాగే, ఐటీ అధికారులు దీనిని ధృవీకరించలేదు. కేవలం బురద చల్లారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రమే పక్కా ప్రణాళిక ప్రకారం రంగంలోకి దిగిన ఐటీ అధికారులు శనివారం కూడా సోదాలు కొనసాగించారు.

it 09122018  3

ఆదివారం కూడా సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై టీనగర్‌లోని బాలాజీ సంస్థల ప్రధాన కార్యాలయంలోను, పూందమల్లిలోని ఆ సంస్థతో పాటు, మరో కంపెనీలోను తనిఖీలు చేశారు. టీడీపీలో ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు, వారి వ్యాపారాలపై ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని పార్టీ నేతలు ముందు నుంచీ ఆరోపిస్తున్నారు. ఈ దిశగానే సోదాలు జరుగుతుండటం ఈ అనుమానాలు మరింత బలపరుస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఎన్నికల సందర్భంగా కొంత విరామం ఇచ్చి మళ్లీ మొదలుపెట్టినట్లు భావిస్తున్నారు. ఇవి మరికొంత కాలం కొనసాగుతాయని సమాచారం. దీనికోసమే పలు ఐటీ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలోనే మకాం వేసి, తమకు అందిన ఆదేశాల మేరకు దాడులు చేస్తారని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read