ఏపీకి మరోసారి కేంద్రం మొండిచేయి చూపింది. కొత్త రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ, విజయవాడ-గుంటూరు కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం మొండిచేయి చూపింది. రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాల్సిందిగా 2017-18 బడ్జెట్‌లో ప్రతిపాదించగా.. దీనిపై కేంద్రం ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా నీతి ఆయోగ్‌ చెప్పిందంటూ రైల్వే లైన్‌ పనుల ఆమోదానికి సంబంధించిన దస్త్రాలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. రైల్వేలైన్‌ ఏర్పాటుపై రాజ్యసభలో తెదేపా ఎంపీ రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానం ఇచ్చారు.

modi 08022019

దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ, ఉపరితల రవాణా శాఖ, పట్టణాభివృద్ధి శాఖల మధ్య సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాలేదని.. అప్పటి వరకు రైల్వే లైన్‌కు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని గోయల్‌ సభలో వెల్లడించారు. 2017-18 బడ్జెట్‌లో ప్రతిపాదించిన లైనుపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. నీతి ఆయోగ్ సిఫారసు అంటూ ప్రతిపాదించిన రైల్వే లైను పనులకు ఆమోదంపై కేంద్ర హోం శాఖ దస్త్రాలు పక్కన పెట్టె ప్రయత్నం చేసింది. ఎంపీ కనకమేడల మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి రైల్వేలైన్ హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత భరించాలనడం దుర్మార్గమని చెప్పారు. రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా విభజించిన వారే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీపై పోరాడేందుకే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని వివరించారు. మోదీని గద్దె దించడమే మా ఏకైక లక్ష్యమని స్పష్టంచేశారు.

modi 08022019

మొత్తం 19 అంశాల పై, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాల గురించి, ఇప్పటికీ క్లారిటీ లేదు.

పులివెందుల అనేది నిన్నమొన్నటివరకూ వైఎస్‌ ఫ్యామిలీకి కంచుకోట! అక్కడ వారు చెప్పిందే వేదం. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు! రాజకీయాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎదుగుతూ వచ్చే క్రమంలో పులివెందులపైనా తన పట్టు పెంచుకున్నారు. నాటినుంచి నేటివరకూ సుమారు నాలుగు దశాబ్దాలపాటు పులివెందులలో ఇదే పరిస్థితి! వార్డుమెంబరు సహా అన్ని పదవులు వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే ఉంటాయి. దాదాపు చాలా పదవులను ఆ కుటుంబ సభ్యులే అనుభవిస్తుంటారు. ఇతర పార్టీల నేతలు ఆ ప్రాంతంలో తిరిగే సాహసం కూడా చేయరు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తిరిగారు. ఈ తరుణంలో ఆయన పులివెందులకు వెళితే ఆ ప్రాంతవాసులు చిరంజీవిపై దాడులకు సిద్ధపడ్డారు. నల్లజెండాల ప్రదర్శనతో వ్యతిరేకించారు.

pulivendula 0802019

పులివెందుల గతంలో కరువుతో అల్లాడింది. దాహంతో అలమటించింది. సాగునీరు లేక రైతాంగం తల్లడిల్లింది. అలాంటి ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు ఇప్పుడు సస్యశ్యామలం చేశారని ఆ ప్రాంత వాసులు సంబరపడుతున్నారు. ఈ అంశం వారి మదిలో బలంగా నాటుకుపోయిందట! శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను గండికోట ప్రాజెక్టుకు రప్పించి.. అక్కడినుంచి ఆ నీటిని కాలువల ద్వారా పులివెందులకు పారించారు. అలాగే పులివెందుల ప్రాంతంలో ఉన్న పైడిపాలెం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నారు. దీంతో పులివెందుల ప్రాంత రైతుల పంట పండింది. కనీవినీ ఎరుగని రీతిలో వారు పంటలు సాగుచేశారు. ఇప్పుడు పులివెందుల ప్రాంతం ఆకుపచ్చని కళతో అలరారుతోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై పులివెందుల వాసులకు ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడింది.

pulivendula 0802019

రెండేళ్ళ క్రితం పులివెందుల రైతులు సీఎం చంద్రబాబును ఆశ్రయించారు. కాపుకి అందుకున్న తమ పండ్లతోటలు నీరులేక ఎండిపోతున్నాయని మొరపెట్టుకున్నారు. వారి బాధలు విన్న చంద్రబాబు వెంటనే స్పందించారు. ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి ట్యాంకర్లతో నీటిని తోలించారు. ఎండిపోతాయనుకున్న పంటలను కాపాడారు. ఈ అనుభవంతో పులివెందుల రైతులు ఎంతో ఆనందపడ్డారు. తాము ఎప్పటికీ చంద్రబాబు చేసిన మేలును మరచిపోమని డైరక్టుగానే చెబుతున్నారట. నాడు చంద్రబాబుపై దాడికి పాల్పడిన వారే నేడు తమ ప్రాంతం సస్యశ్యామలం కావడాన్ని చూసి తెగ మెచ్చుకుంటున్నారట. పులివెందులలో జగన్ కుటుంబ సభ్యులు సైతం చంద్రబాబు అమలుచేసిన రైతు ఋణమాఫీ పథకం లబ్ధిదారులుగా ఉన్నారట. చంద్రబాబు గత ప్రభుత్వంలో ఎన్నడూ జగన్ బంధువులు ప్రభుత్వ ఫలాలను అందుకోలేదు. ఈసారి మత్రం వారి వైఖరిలో మార్పు సుస్పష్టం! ఒక్క మాటలో చెప్పాలంటే పులివెందుల ప్రజల్లో మార్పు వచ్చిన సంగతి వాస్తవం. గత రెండు సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ ప్రాంతంలో తెలుగుదేశానికి మెల్లమెల్లగా ఆదరణ పెరుగుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పులివెందులలో ఓట్లశాతం బాగా పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా పులివెందులలో పరిస్థితి బాగా మారిపోయింది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి భారీగా ఓట్లు పడతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని తిరువనంతపురం నుంచి టిక్కెట్ ఇస్తామంటూ బీజేపీ నేతల బహిరంగ ప్రతిపాదనలపై ప్రముఖ మలయాళ నటుడు, సూపర్‌స్టార్ మోహన్‌లాల్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది కానీ, ఎన్నికల్లో పోటీ చేసేది కానీ లేదని అన్నారు. 'రాజకీయాలు నా పని కాదు. నటుడిగా ఉండటానికే నేను ఎప్పుడూ ఇష్టపడతాను. ఈ వృత్తిలో స్వేచ్ఛను నేను ఆస్వాదిస్తున్నాను. రాజకీయాల్లో అయితే అలా కాదు. ఎందరో ప్రజలు మనపై ఆధారపడతారు. ఆశలు పెట్టుకుంటారు. వాటిని నెరవేర్చడం అంత సులభం కాదు. నాకు రాజకీయాల గురించి తెలియదు' అని ఆయన చెప్పారు. ప్రస్తుతం మోహన్‌లాల్ ఇక్కడ జరుగుతున్న 'మరక్కర్' మలయాళ చిత్రం షూటింగులో ఉన్నారు. కేరళలో బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఓ.రాజగోపాల్ మాత్రమే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

pulivendula 0802019

ఈ నేపథ్యంలో పార్టీ నుంచి గెలుపు అవకాశాలున్న మోహన్‌లాల్‌కు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చే ఆలోచన ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాగా, ఇటీవల కాలంలో మోహన్‌లాల్ కేరళ బీజేపీ-ఆర్ఎస్‌ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉండటం, గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకోవడంతో మోహన్‌‌లాల్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వెలువడ్డాయి. తన ఆధ్వర్యంలోని విశ్వశాంతి ఫౌండేషన్ చేస్తున్న సేవాకార్యక్రమాలను ప్రధానితో కలిసిన సమావేశంలో మోహన్‌లాల్ వివరించారు. కాగా, ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా మోహన్‌లాల్‌కు కేంద్ర ప్రభుత్వం 'పద్మభూషణ్' ప్రకటించింది. సినీరంగంలో చేసిన సేవలకు గాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు.

 

విజయవాడ నుంచి దుబాయ్‌కి విమాన సర్వీసు ప్రక్రియ ఊపందుకుంది. మరో నెల రోజుల్లో దుబాయి సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్‌) ఆధ్వర్యంలో బిడ్లను ఆహ్వానిస్తూ జనవరి 23న నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఫిబ్రవరి 02 వరకూ స్వీకరించారు. అతి తక్కువకు బిడ్‌ను దాఖలు చేసిన విమానయాన సంస్థకు అవకాశం కల్పించనున్నారు. ఫిబ్రవరి 11న విమానయాన సంస్థల ప్రతినిధుల సమక్షంలోనే బిడ్లను తెరిచి తక్కువకు కోట్‌ చేసిన సంస్థను ఎంపిక చేస్తారు. అనంతరం నెల రోజుల వ్యవధిలో దుబాయికి సర్వీసు ఆరంభమయ్యే అవకాశం ఉంది. గతంలో సింగపూర్‌కు సర్వీసును నడిపినప్పుడు కూడా ఇలాగే తొలుత బిడ్లను ఆహ్వానించి అనంతరం ఇండిగోను ఎంపిక చేశారు. దుబాయికి సర్వీసును ఏర్పాటు చేస్తే.. సింగపూర్‌ కంటే రద్దీ రెట్టింపు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

pulivendula 0802019

దుబాయికి సర్వీసులను నడిపేందుకు ప్రజాభిప్రాయ సేకరణను ఏపీఏడీసీఎల్‌ చేపట్టింది. గతంలో సింగపూర్‌కు సర్వీసును ఆరంభించే ముందు కూడా ఇలాగే సర్వే చేపట్టారు. తాజాగా దుబాయికి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు మంచి స్పందన వచ్చింది. ఏపీఏడీసీఎల్‌ వెబ్‌సైట్తో పాటూ ఈమెయిల్‌, వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సర్వేను చేపట్టారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు విదేశాలలో ఉండే ప్రవాసాంధ్రుల నుంచి మద్దతుగా పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఏపీఏడీసీఎల్‌ వెబ్‌సైట్‌లోనే 2,42,594 మంది దుబాయి సర్వీసుకు ఓటేశారు. 950 మంది ఈమెయిళ్ల ద్వారా తమ సమ్మతిని తెలిపారు. మరో 25 మంది వాట్సాప్‌, 30 మంది ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఆసక్తిని తెలియజేశారు. ఫిబ్రవరి 23 వరకూ వచ్చిన ఈ స్పందనను చూసిన రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ వెంటనే బిడ్లను ఆహ్వానించింది. బిడ్లను దాఖలు చేసిన విమానయాన సంస్థల్లో.. వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్‌)ను అత్యంత తక్కువకు కోట్‌ చేసిన వారిని ఎంపిక చేయనున్నారు.

pulivendula 0802019

దుబాయి సర్వీసును బుధ, శుక్రవారాల్లో వారంలో రెండు రోజులు నడపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సింగపూర్‌కు నడుస్తున్న అంతర్జాతీయ సర్వీసులు మంగళ, గురువారాల్లో గన్నవరం నుంచి నడుస్తున్నాయి. అందుకే.. బుధ, శుక్రవారాల్లో నడపాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయికి సర్వీసును ఆరంభిస్తే.. స్పందన భారీగా ఉండబోతోంది. సింగపూర్‌కు వీసాల సమస్య ఎదురవుతోంది. దీంతో ఆరంభంలో సర్వీసులు సగం వరకూ నిండేవి. ప్రస్తుతం 70శాతం పైగా నిండుతున్నాయి. దుబాయికి సింగపూర్‌ మాదిరిగా వీసా సమస్య లేదు. అమెరికా వీసా ఉన్న ప్రతి ఒక్కరూ దుబాయికి నేరుగా వెళ్లిపోవచ్చు. అమెరికా వీసా ముద్ర ఉంటే.. దుబాయికి ప్రత్యేకంగా అవసరం లేదు. దానితోనే వెళ్లిపోవచ్చు.

Advertisements

Latest Articles

Most Read