కృష్ణాజిల్లాలోని గుడివాడ పేరెత్తగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన నందమూరి తారక రామారావు. ఆయన జన్మించిన నిమ్మకూరు గుడివాడకు దగ్గరలో ఉండటం, అక్కడినుంచే ఆయన ఎన్నికల్లో పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టడం అనే చారిత్రక ఘట్టాలకు ఆ ప్రాంతం నిదర్శనం! అలాంటి గుడివాడలో తెలుగుదేశంపార్టీ క్రమేపీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. గతంలో టీడీపీ నుంచి పోటీచేసి గెలిచిన కొడాలి నాని.. ఆ తరవాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. జగన్‌కు ముఖ్య అనుచరుడిగా.. ఆ పార్టీలో కీలకంగా మారారు. పార్టీ మారేముందు చంద్రబాబుపై ఆయన ఘాటు విమర్శలే చేశారు. నాని తనతో పాటు స్థానికంగా ఉన్న క్యాడర్‌లో ఎక్కువమందినే తనవెంట వైసీపీలోకి తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వర‌రావుపై కొడాలి నాని గెలిచారు. రావినే ఇప్పుడు గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్‌. అయితే రానున్న ఎన్నికల్లో నానిని ఓడించే బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. వెంకటేశ్వరరావునే మళ్లీ పోటీకి పెట్టడమా? లేక మరో గట్టి అభ్యర్థిని బరిలో దింపడమా? అని తెలుగుదేశం అధిష్టానం ఆలోచిస్తోంది. ఒకవేళ రావికి టిక్కెట్‌ ఇవ్వని పక్షంలో ఆయనకు మరో పదవి ఇవ్వాలని భావిస్తున్నారు.

kodali 09022019

ఈ క్రమంలోనే టీడీపీ యువనేత దేవినేని అవినాష్ పేరును కొందరు తెరపైకి తెచ్చారట. దేవినేని నెహ్రూ తనయుడిగానే కాక.. సొంత ఇమేజ్‌ను అవినాష్సం పాదించుకున్నారట. అందరితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయట. అవినాష్‌కు మంచి ఆర్థిక, అంగబలం ఉందనీ.. ముందే ఆయనకు టికెట్ ఖరారుచేస్తే నియోజకవర్గంపై దృష్టి సారిస్తారనీ, ఎన్నికల్లో తప్పక గెలుస్తారనీ టీడీపీ ముఖ్యులు కొందరు అంటున్నారు. బుద్దా వెంకన్న సహా పలువురు నగర పార్టీ పెద్దలు సైతం ఇదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పారట. గ్రామాలవారీగా వెళ్లి, నేతలు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తే ఫలితం పక్కా.. అని నమ్మకంగా అన్నారట. మరి అవినాష్‌కు టికెట్ ఇస్తే స్థానిక నేతలు సహకరిస్తారా? క్యాడర్ ఏమనుకుంటోంది? అనే అంశాలపై చంద్రబాబు ఆరాతీస్తున్నారట!

kodali 09022019

దేవినేని నెహ్రూ వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన అవినాష్ కొంతకాలంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. విజయవాడలో పార్టీ తరఫున కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షని నిరసిస్తూ యువకులతో ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఈ మధ్యే ఆయనను రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. ఫిబ్రవరి 6వ గ్రాండ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనీ, వారిని ప్రోత్సహిద్దామనీ పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న సంగతి తెలిసిందే! ఈ తరుణంలో గుడివాడ టికెట్ అవినాష్‌కు ఇస్తే బాగుంటుందని ఆయన అనుచరులు అభిలషిస్తున్నారు. అవినాష్‌ గనుక గుడివాడ బరిలో దిగితే ఎన్నికలపోరు ఆసక్తికరంగా మారుతుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న దేవినేని నెహ్రూ అనుచరులు, విజయవాడలోని అవినాష్ అనుచరవర్గం మొత్తం గుడివాడలోనే మకాంవేసి ప్రచారం చేస్తారని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి అవినాష్‌కు పార్టీ టికెట్ ఇస్తుందో.. లేదో!

ఏపీలో ఒంటరిగానే పోటీచేస్తామన్న కాంగ్రెస్ ప్రకటనతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట. తమ ఓటుబ్యాంకును కాంగ్రెస్ కొల్లగొడుతుందని అంచనా వేస్తూ కలవరపడుతున్నారట. ఏ మేరకు ఓట్లు చీలుతాయోనని లెక్కలు వేస్తున్నారట. ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఓటుబ్యాంక్ గతంలో కాంగ్రెస్ పార్టీది కావడమే ఈ పరిణామానికి కారణం. రాష్ట్ర విభజన విషయంలో ఏపీ ప్రజలు కాంగ్రెస్‌పార్టీపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. తమ మనోభావాలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించారన్న కసిని గత ఎన్నికల్లో ఓట్లరూపంలో చూపించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక్కరంటే ఒక్కరిని కూడా చట్టసభలకు పంపలేదు. అసలు రాష్ట్రంలో చాలాచోట్ల హస్తంపార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇదే సమయంలో వైసీపీకి కాంగ్రెస్ నుంచి గణనీయంగా ఓటుబ్యాంక్ బదిలీ అయింది.

ysr 09022019

నాలుగేళ్లు తిరిగే సరికి సీన్‌ మారిపోయింది. టీడీపీ, బీజేపీల మధ్య మైత్రీబంధం తెగిపోయింది. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చంద్రబాబు వ్యూహం మార్చారు. కాంగ్రెస్‌కి దగ్గరయ్యారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారు. అయితే ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో కూడా టీడీపీ- కాంగ్రెస్‌పార్టీల పొత్తు కొనసాగుతుందనీ, అదే జరిగితే తాము లాభపడతామనీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తూ వచ్చారు. కానీ ఏపీలో ఒంటరిగానే పోటీచేస్తామని కాంగ్రెస్‌పార్టీ తాజాగా ప్రకటించింది. దీంతో వైకాపా నేతలు, కార్యకర్తలు డీలాపడ్డారు. ఇదిలా ఉంటే, తాము అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలు కూడా అమలుచేస్తామని రాహుల్ పునరుద్ఘాటించారు.

ysr 09022019

దీంతో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల తమ ఓటుబ్యాంకుకి గండి పడుతుందని విశాఖ వైసీపీ నేతలు భయపడిపోతున్నారు. కాంగ్రెస్‌లో జరిగే పరిణామాలు వైసీపీ వారిని తెగ కలవరపెడుతున్నాయి. తాజాగా ప్రియాంకగాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ పరిణామం హస్తంపార్టీకి కలిసివస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ విభజనను గతంలో ఇందిరాగాంధీ వ్యతిరేకించారు. అందుకే ఇందిర పట్ల ఏపీ ప్రజల గుండెల్లో ఎంతో ప్రేమ గూడుకట్టుకుంది. అచ్చం నాయనమ్మ పోలికలతో ఉండే ప్రియాంక రాజకీయాల్లోకి రావడాన్ని ఏపీలో కాంగ్రెస్ శ్రేణులు సహా అభిమానులంతా నిండు మనసుతో స్వాగతిస్తున్నారు. ఇదే సమయంలో.. ఎన్నికల ప్రచారం కోసం ఏపీలో ప్రియాంక పర్యటిస్తే తమ ఓటుబ్యాంక్‌పై ప్రభావం పడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళల ఓట్లకు గండిపడుతుందనే భావన వారిలో బలంగా ఉంది. చూద్దాం ఈ పరిణామాలు అంతిమంగా ఎవరికి ప్రయోజనం చేకూరుస్తాయో!

కడప జిల్లాలో వైరి వర్గాల మధ్య రాజీ కుదిర్చే దిశగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అనుసరించిన వ్యూహం ఫలించింది. తదనుగుణంగా కడప ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మార్కెటింగ్‌ మంత్రి ఆదినారాయణరెడ్డి.. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. చంద్రబాబు ప్రతిపాదించిన రాజీ ఫార్ములాకు వీరిద్దరూ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి రామసుబ్బారెడ్డి అంగీకరించారు. ఆ ప్రకారం ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయంలో అందజేశారు.

cbnvuham 09022019

ఆయన రాజీనామా వల్ల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆదినారాయణరెడ్డి వర్గానికి ఇవ్వనున్నారు. ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు సుబ్బరామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు ఎంపీ స్థానానికి పోటీ చేస్తే వారి అనుచరులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగే కోరుకుని దానికి బదులుగా తన ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసి తన ఆమోదం తెలిపారు. ఏ సమస్య వచ్చినా తానున్నానని చంద్రబాబు ఆయనకు భరోసా ఇచ్చారు.

cbnvuham 09022019

ఆదినారాయణరెడ్డి కూడా సీఎంను కలిశారు. కడప ఎంపీ సీటును ఈసారి టీడీపీ గెలవాలని, దానికి అవసరమైన వ్యూహ రచనతో ముందుకెళ్లాలని ఆయనకు చంద్రబాబు సూచించారు. అనంతరం ఆది, రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... జిల్లాలో టీడీపీ గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. అదే జరిగితే టీడీపీకి తిరుగుండదని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. పులివెందులలో వైసీపీకి వచ్చే మెజారిటీని జమ్మలమడుగులో సమానం చేయగలిగితే కడప ఎంపీ సీటును గెలుచుకోవచ్చన్నది టీడీపీ వ్యూహం.

దశాబ్ద కాలం నాటి ఎదురుచూపులకు తెరపడింది. జీతాల కోసం పడిగాపులకు కాలం చెల్లింది. పన్ను వసూళ్ల కోసం కాచుక్కూర్చునే రోజులకు తెర పడింది. ఏటా రూ.130 కోట్ల జీతాల చెల్లింపులతో పాటు ఆదాయ మార్గాలను అభివృద్ధికి మరల్చలేక నిస్సత్తువుగా చూస్తోన్న వీఎంసీకి మంత్రి మండలి నిర్ణయం రూపంలో శుభవార్త వచ్చింది. సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో వీఎంసీతో పాటు గ్రేటర్‌ విశాఖపట్టణానికి కూడా 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు ప్రక్రియకు ఆమోదం తెలుపుతూ నిర్ణయించారు. వారంలో అధికారిక ఉత్తర్వులను ట్రెజరీకి ఇచ్చి ఏప్రిల్‌ నుంచి జీతాల చెల్లింపునకు రంగం సిద్ధమవుతోంది. దీంతో వీఎంసీలోని 3,732 మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు.

vij 09022019

అధికారంలోకి వచ్చింది మొదలు మేయర్‌ కోనేరు శ్రీధర్‌ 010 కోసం విశ్వ ప్రయత్నం చేశారు. గత రెండు కౌన్సిల్‌ సమావేశాల్లో ఆయన 010 పద్దుపై ధీమా వ్యక్తం చేశారు. దీనిపై విశ్వసించని వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో 010 అంశాన్ని పొందుపరచలేదని, అమలు అసాధ్యమని మాట్లాడారు. వారికి సమాధానమిస్తూ మంత్రి మండలి వీఎంసీకి 010 పద్దును అమలుచేయడాన్ని తీర్మానిస్తూ నిర్ణయించింది. ప్రతి నెలా వచ్చే జీతాలే తప్ప డీఏ అరియర్స్‌, పీఆర్సీ (పాతవి, కొత్తవి), సరెండర్‌ లీవ్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ వంటి భత్యాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో వీఎంసీకి పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.180 కోట్లు, నెట్‌ భత్యాలు రూ.48కోట్ల 79లక్షలకు పైగా ఉండగా, రికవరీలు రూ.7కోట్ల 92వేలకు పైగా ఉన్నాయి.

vij 09022019

గ్రాస్‌ను చూస్తే రూ.56కోట్లకు పైమాటే అందుకోవాల్సి ఉంది. వాటితో పాటు ఏటా చెల్లించే రూ.130కోట్ల జీతాలు అదనం. ఈ పద్దు ఆమోదంతో ఆయా ఆదాయాలన్నీ నగరాభివృద్ధికి మరల్చే అవకాశముంది. మేయర్ మాట్లాడుతూ "ఆనందంలో మాటలు రావడంలేదు. నా హయాంలో సాధించాను అని గర్వంగా చెప్పుకునే అంశాల్లో 010 పద్దు ఓ ఆణిముత్యం. అసాధ్యమన్న పదాన్ని సుసాధ్యం చేసి వీఎంసీకి 010 పద్దును అమలుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి ధన్యవాదాలు. ఇది కచ్చితంగా టీడీపీ విజయం. బడ్జెట్లో పొందుపరచలేదని, అమలు అసాధ్యమని అన్న వారి మాటలకు మంత్రి మండలి నిర్ణయమే సమాధానం."

Advertisements

Latest Articles

Most Read