రోజు రోజుకీ మానవత్వం అనేది చచ్చిపోతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయి, 9 నెలల చిన్నారిని రేప్ చేసిన సైకోలను మరువక ముందే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోలు కూడా బరితెగించారు. 5 రోజులుగా, పదవ తరగతి చదువుతున్న బాలిక పై గ్యాంగ్ రేప్ చేసారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలో, ఓకే హాస్టల్‌లో ఉండి ఆ బాలిక చదువుకుంటుంది. తెలిసీ తెలియని వయసులో ఒక స్నేహితుడుకు ఆకర్షితురాలు రాయ్యింది. తన స్నేహితుడి కోసం వెతుక్కుంటూ ఒంగోలు వరకు వెళ్లింది. అదే ఆమె పాలిత శాపం అయ్యింది. ఐదురోజుల పాటు ఆ బాలికను ఒక గదిలో బంధించి, గ్యాంగ్ రేప్ చేశారు దుండగలు. రాష్ట్రంలో ఈ ఘటన సంచలనంగా మారింది. గుంటూరుకు చెందిన ఆ బాలిక విజయవాడలో ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆ బాలికకు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక కారు డ్రైవర్‌ పరిచయం అయ్యాడు. అది కాస్తా స్నేహంగా మారింది. ఆమె అతడిని వెతుక్కుంటూ ఒంగోలు వెళ్లింది.

rape 23062019 3

సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె ఒంగోలు బస్టాండ్‌కు చేరుకుంది. తన వద్ద ఫోన్ లేకపోవడంతో, బస్ స్టాండ్ లో ఉన్న వేరే వ్యక్తి ఫోన్ తీసుకొని, ఆ కార్ డ్రైవర్ కు ఫోన్ చేసింది. కానీ ఆ ఫోన్ కలవకపోవడంతో, ఆ రోజు రాత్రి పది గంటల వరకూ ఒంగోలు బస్ స్టాండ్ లోనే ఉండిపోయింది. అయితే ఆమె ఫోన్ తీసుకుంది మాత్రం ఓ దుర్మార్గుడి నుంచి. ఆ ఫోన్ ఇచ్చిన వ్యక్తి, తన స్నేహితుడుతో కలిసి, ఆ బాలిక పై కన్నేశారు. ఆ బాలిక దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడు. విషయాలు అన్నీ ఆరా తీశారు. నీ ఫ్రెండ్ నాకు తెలుసని, అతని దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి, ఆ బాలికను తమ వెంట తీసుకెళ్లారు. కాని ఆ బాలికను, నలుగురు బీటెక్ విద్యార్థులు ఉంటున్న రూమ్‌కు తీసుకెళ్లి హింసించారు. ఆరుగురూ కలిసి ఆ బాలిక పై పడి తమ వాంఛ తీర్చుకున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఐదు రోజులపాటు ఆ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు.

rape 23062019 3

అయితే శనివారం ఆ కామాంధుల చెర నుంచి ఎలాగోలా ఆ బాలిక తప్పించుకుంది. దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. వెంటనే రంగంలోకి దిగిన ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు రేప్ చేసిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే ఇందులో ప్రధాన నిందితుడు ఒక దివ్యాంగుడు. అతని పేరు, బాజీ. అయితే అతని సోషల్ మీడియా ఫేస్బుక్ చూసిన వారు అవాక్కయ్యారు. అతను జగన్ వీరాభిమానిగా తెలుస్తుంది. జగన్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే, ఇతగాడు కేవలం రెండు రోజుల క్రిందట, తెలంగాణాలో జరిగిన 9 నెలల పాప రేప్ పై ఫేస్బుక్ లో స్పందిస్తూ, ఇలాంటి వారిని సమాజంలో ఉండనివ్వ కూడదు, ఉరి తియ్యాలి అంటూ పోస్ట్ పెట్టాడు. అంటే, ఒక పక్క ఆరుగురితో కలిసి అయుదు రోజులగా గ్యాంగ్ రేప్ చేస్తూ, మరో రేప్ పై స్పందిస్తూ, ఇలాంటి వారిని ఉరి తియ్యాలని అంటున్నాడు. అంటే దొంగ పని చేస్తూనే, మరో దొంగను దొంగతం చెయ్యద్దు అంటూ నీతులు చెప్పటం అనమాట... సమాజం ఇలా ఉంది..

ఎన్నో ఏళ్ళ కష్టానికి ఫలితం దక్కింది. అది ఎలా దక్కింది అనేది పక్కన పెడితే, ప్రస్తుతం సియం పదవిలో ఉన్నారు వైఎస్ జగన్. 10 ఏళ్ళ నుంచి చంద్రబాబు పై పెంచుకున్న కక్ష అంతా తీర్చుకుంటున్నారు. ఇంకో 5 ఏళ్ళు ఎదురు లేదని, ఊళ్ళల్లో వైసీపీ క్యాడర్ రెచ్చిపోతుంది. దొరికిన వారిని దొరికినట్టు అని రకాలుగా హింస పెడుతున్నారు. ఇలా ఇంకో 5 ఏళ్ళు మమ్మల్ని అడిగే వారు లేరనుకుంటున్న టైములో ఢిల్లీ నుంచి వస్తున్న న్యూస్ విని గుండె గుబెల్ మంటుంది, వైసీపీ క్యాడర్ కు. కేసుల విషయం పైకి తెచ్చి, జగన్ ను లోపల వేసే వ్యూహం ఉన్నా, దానికంటే ఇబ్బంది కరమైన వార్తా ఇప్పుడు వైసీపీ క్యాడర్ ను వేదిస్తుంది. అదే మోడీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని కాదనలేక, అవును అనలేక, జగన్, విజయసాయి రెడ్డి పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇంతకీ అది ఏంటి అంటే, ప్రధాని మోడీ ఎన్నికల సంస్కరణల్లో భాగంగా తీసుకున్న జమిలి ఎన్నికల విధానం. దీని పై ఇప్పటికే అఖిల పక్ష సమావేశం జరగటం, దాని పై దాదపుగా అన్ని పార్టీలు ఒకే చెప్పటం కూడా అయిపోయాయి.

అయితే ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తున్న వార్తల ప్రకారం, 2022 నాటికి జమిలి ఎన్నికలకు వెళ్ళాలని మోడీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే జరిగితే రెండేళ్ళ ముందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే రెండేళ్ళ ముందే జగన్ సియం పదవిని వాదులుకోవాలి. తరువాత గెలుస్తామో, లేదో, రాజకీయ పరిస్థితితులు ఎలా ఉంటాయో అన్న బెంగ వైసీపీకి పట్టుకుంది. వచ్చే మూడేళ్లలో 18 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, కర్ణాటక అసెంబ్లీ ఏ క్షణమైనా పడిపోయే పరిస్థితి. ఇక 2023-24ల్లో 9 అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఏపి కూడా ఉంది. వీటిని రెండేళ్ళ ముందుకు జరిపి, అన్ని రాష్ట్రాలకు, పార్లిమెంట్ కు 2022లోనే ఎన్నికలకు వెళ్ళాలని మోడీని నిర్ణయం తీసుకున్నారని, ఆ దిశగా బీజేపీ అడుగులు వేస్తునట్టు తెలుస్తుంది. ఈ విధానంతో అభివృద్ధి దూసుకువెళ్తుందని, ప్రతి సారి ఎన్నికల కోడ్ తో అభివృద్ది ఆగిపోకుండా సాగిపోతుంది అని, వ్యయం కూడా తగ్గుతుంది అని, బీజేపీ భావన.

నోట్లు రద్దు చేసిన సమయంలో, రూ.34కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్ల కట్టలు దొరికిన పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి గుర్తున్నారా ? అప్పట్లో ఒక్క నోటు కోసం, బ్యాంకుల ముందు బారులు తీరి, లాఠీ దెబ్బలు మన లాంటి సామాన్యులు పడితే, ఇలాంటి వారికి మాత్రం ఏకంగా 34 కోట్లు కొత్త నోట్లు ఇచ్చారు. అప్పట్లో ఇది ఒక సంచలనం అయ్యింది. అయితే ఆ టైంలో శేఖర్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఈ డబ్బు అంతా చంద్రబాబుది అని, శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అంటూ వైసీపా పార్టీ హంగామా చేసింది. చంద్రబాబు చేసిన స్కాం డబ్బులు ఇవన్నీ అంటూ, వైసీపీ పార్టీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి సరైన కౌంటర్ లేక పోవటంతో, ఇది నిజం అని నమ్మినవారు కూడా ఉన్నారు. అప్పట్లో ఈ విషయం పై ఐటి, ఈడీ కూడా శేఖర్ రెడ్డి పై కేసులు పెట్టాయి. అయితే ఇప్పుడు ఇదే శేఖర్ రెడ్డి, అమయాకుడు అని, ఆ డబ్బు అంతా అతడి కష్టార్జితం అని ఐటి, ఈడీ తేల్చాయి.

ఇక్కడ సమస్య ఈ డబ్బు ఆయన కష్టపడి సంపాదించాడా లేడా అని కాదు. ఒక్క రెండు వేల రూపాయి కాగితం కోసం ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో, శేఖర్ రెడ్డికి, 34 కోట్లకు, రెండు వేల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి అని ? కేంద్రంలో పెద్దల సహయం లేనిదే అంత డబ్బు రాదు. మరి, ఈ విషయం తేల్చకుండా, అది సక్రమ సంపాదన అని తేల్చేసారు. అయితే క్లీన్ చిట్ ఇచ్చిన వెంటనే శేఖర్ రెడ్డి , ఆంధ్రాలో వాలిపోయారు. ఇక్కడ జగన్ ప్రభుత్వం ఉండటంతో, వెంటనే ఒక అర్జీ పెట్టుకున్నారు. మళ్లీ టిటిడి బోర్డు మెంబెర్ పదవిని ఆశిస్తున్నట్లు జగన్ కు చెప్పారు. నాకు ఏ పాపం తెలియదని, నేను అమాయకుడుని అని దర్యాప్తు సంస్థలు తేల్చాయని, నాకు క్లీన్ చిట్ ఇచ్చారని, అందుకే ఇప్పుడు మళ్ళీ టిటిడి బోర్డు మెంబెర్ పదవి ఆశిస్తున్నాని, ఆ పదవి కేటాయించమని జగన్ ని కోరారు. మరి జగన్ మోహన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారి వినతిని ఆమోదిస్తారో, తిరస్కరిస్తారో చూడాలి.

రెండు తెలుగు రాష్ట్రాల సియంలకు అత్యంత ప్రీతిపాత్రుడు, విశాఖ శారదా పీఠానికి చెందిన పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. మొన్న విజయవాడ కృష్ణాతీరంలో జరిగిన, శారదాపీఠ ఉత్తరాధికారి నియామక కార్యక్రమంలో , జగన్, కేసీఆర్ పాల్గున్నప్పుడు, ఒకరు నా ఆత్మ, ఒకరు నా ప్రాణం అంటూ స్వరుపానంద చెప్పుకొచ్చారు. అంతే కాదు, జగన్ సియం అవ్వటం కోసమే శారదా పీఠం పని చేసిందని, మరో 15 ఏళ్ళు ఆయనే సియంగా ఉండటానికి పని చేస్తామని స్వరుపానంద చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓక సన్యాసి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇదే విధంగా కేసీఆర్ పై కూడా ప్రశంసలు గుప్పించారు స్వామి.జగన్ కేమో ముద్దులు, కేసీఆర్ కేమో ఆలింగనాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు స్వరూపానంద. వీళ్ళ ముగ్గిరి కలయిక, వీరు చెప్పిన ప్రవచనాలు, వీళ్ళ హావభావాలతో కృష్ణా తీరం పులకించి పోయిందా అనేంతగా హడావిడి చేసారు. స్వామి వారి భక్తికి మెచ్చిన కేసీఆర్, వెంటనే హైదరబాద్ వెళ్లి , క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు.

అదే గండిపేట మండలంలోని కోకాపేట వద్ద విశాఖపట్నం శారదాపీఠంకు రెండెకరాల స్థలం కేటాయించటం. దీని కోసం ఒక జీ.ఓ కూడా విడుదల చేసింది. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం శారదా పీఠానికి రెండెకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేసారు. ఇంతకీ ఎకరం భూమి ఎంతో తెలుసా ? తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఎకరానికి రూపాయి చొప్పున ఈ కేటాయింపు జరిగింది. అంటే రెండు ఎకరాలకు, రెండు రూపాయలు అనమాట. ఈ స్థలంలో శారదా పీఠం గురుకుల వేద పాఠశాలను నెలకోల్పనుంది. అయితే కోకాపేటలో రియల్ ఎస్టేట్ భూమ్ అధికంగా ఉంది. అక్కడ ఎకరా 25 కోట్లు దాకా పలుకుతుంది. అలాంటి చోట, కేసీఆర్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం, రాష్ట్ర సంపదను, ఇలా అప్పనంగా, ఎకరా రూపాయికి ఇచ్చేసారు. పోనీ ఇక్కడ పరిశ్రమలు వచ్చి, ఉద్యోగాలు వస్తాయా అంటే అదీ లేదు. కేసీఆర్ ఇంత ఉదారత చూపి, ఎకరా రూపాయికి ఇచ్చేస్తే, మరి మన జగన్ గారు, ఎంత ఉదారత చూపుతారో చూద్దాం.

Advertisements

Latest Articles

Most Read