విజయనగరం సంస్థానం వ్యవహారాల్లో కూడా జగన్ ప్రభుత్వం తలదూర్చిందని, 1958లో ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను, గజపతిరాజుల సంస్థానానికి మూలపురుషుడైన పీ.వీ.జీ. రాజు తన తండ్రి గారైన మహారాజా అలక్ నారాయణ గజపతి (మాన్సాస్ ట్రస్ట్) పేరుతో స్థాపించడం జరిగిందని, ఆనాడు ఆయనస్థాపించిన ట్రస్ట్ కొన్ని విధివిధానాలు, నియమనిబంధనల ప్రకారం నేటికీ నిర్వహించడం జరుగుతోందని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మరోమాజీ మంత్రి కాలవశ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ట్రస్ట్ ను స్థాపించినప్పుడే పీ.వీ.జీ.రాజు ట్రస్ట్ చైర్మన్ గా ఉండి, తన కుమారులైన ఆనందగజపతి రాజు, అశోక్ గజపతిరాజులను మెంబర్లుగా నియమించడం జరిగిందన్నారు. వారు నెలకొల్పిన అనేక విద్యాసంస్థలనుకూడా ట్రస్ట్ అధీనంలోకి తీసుకొచ్చి, దాని నిర్వహణకోసం 13వేల ఎకరాలను దాతృత్వంగా ట్రస్ట్ కు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నిప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా, ఎవరూకూడా విజయనగరం రాజుల అధీనంలోఉన్న మాన్సాస్ ట్రస్ట్ జోలికి, దాని అధీనంలో ఉన్న విద్యాసంస్థలజోలికి వెళ్లలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తొలిసారి రాష్ట్రప్రభుత్వానికి చెందిన ప్రముఖనేత, ట్రస్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందులోభాగంగానే ఆనందగజపతిరాజు రెండోకుమార్తె అయిన సంచితను ట్రస్ట్ ఛైర్మన్ గా నియమించారని కళా వెంకట్రావు పేర్కొన్నారు. అప్పటికప్పుడు రహస్యంగా జీవో ఇచ్చి, సంచితను ఛైర్మన్ గా నియమించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందో, తరతరాలుగా వస్తున్న రాజకుటుంబం సంప్రదాయాలకు విరుద్ధంగా ఎందుకు నిర్ణయం తీసుకుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేలా కొనసాగిస్తున్న తన చర్యలను జగన్మోహన్ రెడ్డి, విజయనగరం రాజుల కుటుంబంలోకి తీసుకెళ్లడంపై, విజయనగరం వాసులతో పాటు, మాన్సాస్ ట్రస్ట్ దయతో విద్యాబుద్ధులు నేర్చుకున్నవారందరూకూడా తీవ్రంగా తప్పుపడుతున్నారని టీడీపీనేత స్పష్టంచేశారు. ప్రజలసమస్యలు పరిష్కరించడం చేతగాని ప్రభుత్వం, రాజకుటుంబీకుల వ్యవహారాల్లో వేలుపెట్టడం ఎంతవరకు సమంజసమని కళా నిలదీశారు. పీ.వీ.జీ.రాజు కుమారుల్లో ఒకరైన ఆనందగజపతిరాజుకి అబ్బాయిలు లేరని, అందువల్లే ఆయనకు తమ్ముడైన అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు కలుగచేసుకుందో ప్రజలకు చెప్పాలన్నారు. నెలరోజుల క్రితం ఢిల్లీలో సంచితను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి, సాక్షి టీవీలో ప్రసారంచేశారని, తర్వాత సాక్షిపత్రికలో అదే ఇంటర్వ్యూ కథనాన్ని ప్రచురించారన్నారు. ఇవన్నీ జరిగిన 15రోజుల తర్వాత సింహాచలం దేవస్థానానికి కమిటీవేసిన ప్రభుత్వం, అశోక్ గజపతిరాజుని ఛైర్మన్ గా, సంచిత గజపతిరాజుని మెంబర్ గా నియమించడం జరిగిందన్నారు. ఇది జరిగాక మాన్సాస్ ట్రస్ట్ లోవేలుపెట్టిన ప్రభుత్వం, దానికింద ఉన్న రూ.లక్షా30వేలకోట్ల విలువచేసే 13వేల ఎకరాల భూమిపై కన్నేసిందన్నారు. రాజకుటుంబం మధ్యన చిచ్చుపెట్టి, ట్రస్ట్ నడవడంలేదని చెప్పి, ఆభూములు కొట్టేయాలన్న దురుద్దేశంతోనే, సంచితను ట్రస్ట్ ఛైర్మన్ గా నియమించారని కళా వెంకట్రావు పేర్కొన్నారు.
ఏపీలో తిరుపతి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయమైన సింహాచల దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు కొనసాగుతుంటే, 3వతేదీన మరో కొత్తజీవో ఇచ్చి, సంచిత గజపతిరాజునే ఆలయ ఛైర్మన్ గా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

20 రోజుల్లోనే అశోక్ గజపతి రాజుస్థానంలో సంచితను ఎందుకునియమించారు.. ప్రభుత్వంలోని ఆ కీలకనేత రాజకుటుంబం వ్యవహారాల్లో ఎందుకు కలగచేసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, తిరిగి ప్రశ్నలేస్తూ కట్టుకథలు చెబుతూ తప్పించుకుంటోందన్నారు. సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉన్న 9వేల ఎకరాల భూములపై కన్నేసిన జగన్ సర్కారు, రూ.9లక్షలకోట్ల విలువచేసే ఆ భూమికి ఎసరు పెట్టిందన్నారు. ఎప్పటినుంచో ఉన్న వంశపారంపర్య ధర్మకర్తనుకాదని, 30ఏళ్ల వయసుకూడాలేని సంచితను తెరపైకి తీసుకురావడం వెనుక ప్రభుత్వం పెద్ద కుట్రే చేస్తోందని కళా తెలిపారు. రాజకుటుంబం వ్యవహారాల్లో వేలుపెట్టి, లక్షలకోట్ల విలువైన ఆస్తులను కొట్టేయాలన్న ఆలోచన ఉండబట్టే, 20రోజుల వ్యవధిలోనే దేవస్థానం మెంబర్ గా ఉన్న సంచితను ఛైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు. ఇవన్నీ చూస్తుంటే, జగన్ ప్రభుత్వం కావాలనే ట్రస్ట్ వ్యవహారాల్లో, దేవస్థానం విషయాల్లో జోక్యం చేసుకుంటుందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. రాజుల కుటుంబాన్ని విచ్ఛిన్నంచేయాలన్న దుర్భుద్ధి జగన్ ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వం జారీచేసిన జీవో చూస్తే ఆ విషయం బోధపడుతోం దన్నారు. ఒడిస్సాలోని రాజులుకూడా సింహాచలం దేవస్థానానికి భూములు ఇచ్చారని, హిందూ మత విశ్వాసాలపై జగన్ ఎందుకు దాడిచేస్తున్నారో ప్రజలే ఆలోచించాలన్నారు.

ఉదాత్తమైన ఆశయాలతో నిర్వహింపబడుతున్న మాన్సాస్ ట్రస్ట్ పై కన్నేసిన జగన్ ప్రభుత్వం, అశోక్ గజపతిరాజుపై కక్షతీర్చుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే వారి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాజకీయ కోణంలో ఆలోచిస్తున్న ప్రభుత్వం, లక్షలకోట్ల విలుచేసే ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న దుర్భుద్ధితోనే అశోక్ గజపతిరాజు కుటుంబ వ్యవహారం లో వేలుపెట్టిందన్నారు. 1958లో పీ.వీ.జీ రాజు ట్రస్ట్ ను ఏర్పాటుచేసినప్పుడే తన తదనంతరం ఎవరు ట్రస్ట్ కు ఛైర్మన్ గా వ్యవహరించాలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఎవరైతే కుటుంబానికి వారసుడిగా ఉంటాడో, అతనే ట్రస్ట్ కు ఛైర్మన్ గా ఉంటాడని నిబంధనల్లో పేర్కొనడం జరిగిందని, దానిప్రకారమే 16ఏళ్లపాటు, ఆనంద గజపతి రాజే ట్రస్ట్ కు ఛైర్మన్ గా వ్యవహరించారని కాలవ తెలిపారు. 20-02-2020న జీవో నెం-252 విడుదలచేసిన జగన్ ప్రభుత్వం, సింహాచలం ఆలయట్రస్ట్ బోర్డుని 16 మంది సభ్యులతో ఏర్పాటు చేసిందన్నారు. ఆ జీవో ప్రకారం అశోక్ గజపతిరాజుని ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా పేర్కొని, సంచితను 16మందిలో ఒక మెంబర్ గా నియమించిందన్నారు. 29వ తేదీన జరగాల్సిన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మార్చి3వతేదీకి వాయిదాపడటంతో, ఉన్నపళంగా సంచిత ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయడం జరిగిందన్నారు. అధికారికంగా అందుకు సంబంధించిన ఉత్తర్వులేవీ బయటపెట్టకుండా, ట్రస్ట్ వ్యవస్థాపకులైన పీ.వీ.జీ రాజు నిబంధనల్లో వారసుడు అనిచెప్పినప్పటికీ దాన్నికాదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మాన్సాస్ ట్రస్ట్ అధీనంలో ఉన్న 13వేల ఎకరాలతోపాటు, ఉత్తరాంధ్రలో ఉన్న లక్షలఎకరాలను కాజేయాలన్న ఆలోచన విజయసాయికి ఉండబట్టే, ట్రస్ట్ వ్యవహారాల్లో వేలుపెట్టేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందన్నారు.

రాజకీయం, వ్యాపారం, సినిమా.. ఈ మూడు కలిసిపోయి ఉంటాయి మన దేశంలో. వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, సినిమాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లోకి రావటం సర్వ సాధారణం. అలా అని వచ్చిన ప్రతి ఒక్కరూ క్లిక్ అవుతారా అంటే లేదు. ఉదాహరణకు అన్న ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తే, మిగతా సినిమా హీరోలు రాజకీయల్లో చతికిల పడ్డారు. అలాగే కొంత మంది వ్యాపారస్తులు, వరుసగా ఎంపీలు అవుతుంటే, కొంత మంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ప్రజల మనసులు గెలవ లేక పోతున్నారు. అయితే ప్రజల మనసు గెలిచి, వరుసగా గెలుస్తున్న వాళ్ళు, రాజకీయాల్లో నిలదొక్కుకున్న సినిమా వారు, రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే ఇలా గెలిచిన వారిని, బలహీన పరిచే కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వారిలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఒకరు. అమర్ రాజా కంపెనీల వారసుడిగా ఉన్న గల్లా, రాజకీయల్లోకి వచ్చి, రెండు సార్లు ఎంపీ అయ్యారు. అంతే కాదు, అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉంచుకుని, పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీని, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, ఏపి తరుపున ధైర్యంగా మాట్లాడారు కూడా.

galla 04032020 2

ఇప్పుడు గల్లా పై మరో ప్రచారం మొదలు అయ్యింది. గల్లా జయదేవ్ కంపెనీ అమర్ రాజా సంస్థతో తైవాన్ కంపెనీ సలోమ్ పార్టనర్ షిప్ కుదుర్చుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద కోట్లు పెట్టుబడి పెట్టటానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా, తన పెట్టుబడులు వ్యాప్తి చేస్తూ, తైవాన్ సంస్థ సలోమ్ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం, చిత్తూరులో అమర్ రాజా ఆటోమొబైల్ బ్యాటరీ ఉత్పత్తి కంపెనీతో, 100 కోట్లు పెట్టుబడి పెట్టటానికి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 800 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అయితే ఈ వార్త బయట పడగానే, వైసీపీ ఆక్టివ్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ ఒక పక్క, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ఎవరూ రావటం లేదు అని ప్రచారం చేస్తున్నారని, వైసీపీ అంటుంది.

galla 04032020 3

గత 5 ఏళ్ళలో గల్లా రూపాయి పెట్టుబడి పెట్టలేదని, చంద్రబాబు మీద నమ్మకం లేదని, ఇప్పుడు జగన్ మీద నమ్మకంతో పెడుతున్నారని వైసీపీ ప్రచారం చేసింది. అయితే అలా ప్రచారం చేస్తుంటే, మరో పక్క టిడిపి ఎంపీనే ఇప్పుడు, మా జగనన్న పై నమ్మకంతో, పెట్టుబడి పెడుతున్నారు అంటూ, కొత్త ప్రచారం మొదలు పెట్టింది. మా జగనన్న అంటే అది అంటూ, గల్లాని ట్యాగ్ చేస్తూ రచ్చ చేసింది వైసీపీ. అయితే దీని పై అదే స్థాయిలో గల్లా రియాక్ట్ అయ్యారు. అమర్ రాజా గ్రూప్, గత 5 ఏళ్ళలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రూ.1800 కోట్లు పెట్టిందని, 6 వేల మందికి ఉపాధి ఇస్తుందని, భవిష్యత్తులో, 1100 కోట్లు పెట్టుబడి ఏపిలో పెట్టే ఆలోచన ఉందని చెప్పారు. తమ ఫ్యామిలీ ఎప్పుడూ, రాజకీయం, వ్యాపారం వేరేగా చూస్తూ వస్తుందని, స్థానిక యువతకు ఉపాధిని ఇచ్చే అంశంలో, అమర్ రాజా, ఏ ప్రభుత్వం ఉన్నా పెట్టుబడులు పెడుతూనే ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ గ్రూప్ ఉంది అంటూ, హడావిడి చేసి, ఉమ్మడి ఏపిలో వీరంగం చేసిన వైసీపీ, నేడు అదే అంబానీకి సన్మానాలు చెయ్యటం పై అందరూ ఆశ్చర్య పోయారు. ఎన్నికలు వస్తున్నాయి అంటే, రాజశేఖర్ రెడ్డి మరణం పై అనుమనాలు ఉన్నాయి అంటూ, రిలయన్స్ వైపు చూసే వైసీపీ, ఇప్పుడు అదే అంబానీకి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికింది. దీని పై వైఎస్ఆర్ హార్డ్ కోర్ ఫాన్స్, తీవ్రంగా నిరాస పడ్డారు. మాటలు మార్చను అని చెప్పే జగన్, ఇలా మారిపోయారు ఏమిటో అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ అంశం పక్క పెడితే, రిలయన్స్ అంబానీ, నాలుగు రోజుల క్రిందట జగన్ మోహన్ రెడ్డిని కలిసి, చర్చించారు. అయితే ఎందుకు కలిసారు అనే దాని పై, ఎటువుంటి సమాచారం బయటకు రాలేదు. ప్రభుత్వం కాని, అటు వైసీపీ పార్టీ కాని, ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. అయితే, తమ సొంత మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం, రిలయన్స్ అంబానీ, జగన్ మోహన్ రెడ్డి విజన్ నచ్చి, మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు అంటూ ప్రచారం చేసారు.

ambani 04032020 2

అయితే, ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఎందుకుంటే, రిలయన్స్ లాంటి వ్యక్తి పెట్టుబడి పెట్టటానికి వస్తే, అది పెద్ద సెన్సేషన్. ఏపి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, ఇతర పెట్టుబడిదారులను ఆకర్షించుకుంటుంది. అయితే, ఇటు ప్రభుత్వం కానీ, అటు అంబానీ కాని, పెట్టుబడులు పై ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. చివరకు అంబానీ జగన్ ను కలిసింది, అమిత్ షా సూచన పై అని, అంబానీ సన్నిహితుడు, పరిమల్‌ నత్వానీని, ఏపి నుంచి రాజ్యసభకు పంపించటానికి అంటూ వార్తలు వచ్చాయి. అయితే, వైసీపీ వర్గాలు మాత్రం అలా ఏమి లేదని, మేము బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తాం అంటూ సన్నాయి నొక్కులు నోక్కాయి. అయితే అంబానీ జగన్ తో మీట్ అయ్యింది పెట్టుబడులు కోసం కాదని తేలిపోయింది.

ambani 04032020 3

ఆ రోజు తాము జగన్ ను కలిసింది, తనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని కోరటానికే, ఆంధ్రప్రదేశ్ వచ్చామని, ఝార్ఖండ్‌ స్వతంత్ర ఎంపీ పరిమల్‌ నత్వానీ చెప్పారు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో విలేఖరులతో మాట్లాడుతూ, ఆయన ఈ విషయం చెప్పారు. ఈ సారి, ఝార్ఖండ్‌ నుంచి కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో సీటు వస్తున్న నేపధ్యంలో, తనకు అక్కడ నుంచి రజ్యసభకు వెళ్ళే అవకాసం లేదని, అందుకే తాను, ఏపి నుంచి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాసం ఇవ్వమని, ముకేష్ అంబానీతో కలిసి, అమరావతి వచ్చి జగన్ ను కలిసనాని చెప్పారు. అయితే జగన్ దానికి స్పందిస్తూ, తనకు మూడు రోజులు టైం కావాలని అడిగారని, నత్వానీ తెలిపారు. ఇది ఇలా ఉంటే, నత్వానీకి ఏపి నుంచి రాజ్యసభకు వెళ్ళటానికి లైన్ క్లియర్ అయ్యిందని, డైరెక్ట్ అమిత్ షా సూచన కావటంతో, జగన్ కూడా ఏమి చెయ్యలేని పరిస్థితి అని తెలుస్తుంది.

విజయనగరం జిల్లా మాన్సస్ ట్రస్టు వ్యవహారంలో అనూహ్య పరిణామం నెలకొంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ట్రస్టుకు ఛైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను తప్పించింది. ఊహించని విధంగా రాష్ట్ర ప్రభత్వం, ఆయన స్థానంలో బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఉన్న సంచిత గజపతి రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా కూడా ఉన్నారు. అయితే ఈ పదవి, బీజేపీ నాయకురాలికి ఇవ్వటం పై, విస్మయం వ్యక్తం అవుతుంది. బీజేపీ ఏది అడిగితే అది జగన్ చెయ్యాల్సిన పరిస్థితి వచిందనే అభిప్రాయం జరుగుతుంది. మొన్న అంబానీ అడిగిన వ్యక్తికి రాజ్యసభ ఇవ్వాల్సిన పరిస్థితి, ఈ రోజు బీజేపీ ఢిల్లీ నాయకురాలికి పదివి ఇవ్వటం చూస్తుంటే, అదే అనిపిస్తుంది. ఇక మరో పక్క, మాన్సస్ ట్రస్టు ఛైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గత కొన్నేళ్ళుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన్ను పదవిలో నుంచి తొలగించారు.

bjp 04032020 2

మాహరాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ (మాన్సస్) ట్రస్టును, 1958లో పూసపాటి వంశీయులైన దివంగత పీవీజీ రాజు స్థాపించారు. విద్యను ప్రోత్సహించేందుకు, విద్యా సంస్థల నిర్వహణ కొనసాగించడానికి ఈ ట్రస్టు అండగా నిలుస్తోంది. ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులే ఈ ట్రస్టు బాధ్యతలు చూసుకుంటున్నారు. 108 ఆలయాలు, 14 వేల 800 ఎకరాల విలువైన భూములను మాన్సస్ ట్రస్ట్ కలిగి ఉంది. విద్యా సంస్థలకు నిరంతర మద్దతు కోసం ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రత్యేక ఎంవోయూ కుదుర్చుకున్నారు. ట్రస్ట్ డీడ్ వారసత్వంగా ఎల్డెస్ట్ మేల్ లీనియల్ వారసుడు బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిబంధన ప్రకారంగా నాడు పీవీజీ రాజు ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మరణానంతరం 1994లో ఆయన పెద్ద కుమారుడు పూసపాటి ఆనంద్ గజపతి రాజు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 2016లో ఆనంద్ గజపతి రాజు మరణం తరువాత పీవీజీ రాజు రెండో కుమారుడు అశోక్ గజపతి రాజు ఆ పదవి చేపట్టారు. నేటి వరకు ఆయనే ఛైర్మన్‌గా అశోక్ రెండో కుమార్తె అదితి గజపతిరాజు సభ్యురాలుగా ఉన్నారు.

bjp 04032020 3

తాజాగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించి ఆయన స్థానంలో ఆనంద గజపతి రాజు కుమార్తె సంచితా గజపతి రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె అధికారిక లాంఛనాలతో ట్రస్టు ఛైర్ పర్సన్​గా బాధ్యతలు స్వీకరించారు. ఈ అన్యూహ పరిణామం మాన్సస్ ట్రస్టు సభ్యులు, ఉద్యోగుల్లోనే కాకుండా తెదేపా శ్రేణులను ఉలిక్కిపడేలా చేసింది. ఆనంద గజపతి, అశోక్ గజపతి ఇద్దరూ స్వయానా సొదరులే అయినప్పటికీ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలుండేవి. అశోక్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆనంద్ కాంగ్రెస్, తెదేపాలో పనిచేశారు. ఆనంద గజపతి రెండో వివాహం చేసుకున్నారు. ఈయన రెండో భార్య.. రెండో కుమార్తే సంచిత గజపతి. ప్రస్తుతం ఈమె దిల్లీలోనే ఉంటూ అక్కడ భాజపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత ఎన్నికల సమయంలో సంచిత గజపతి విశాఖలో భాజపా కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.

Advertisements

Latest Articles

Most Read