రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా రేపు మోగనుంది. ఈ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. ఎన్నికల షెడ్యూలు శనివారం విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్​కుమార్ ప్రకటించారు. రేపు నోటిఫికేషన్‌, షెడ్యూలు వెనువెంటనే విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని రమేష్​కుమార్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త ఓటర్లు నమోదు ఇంకా సాధ్యం కాదని చెప్పారు. ఎన్నికలు జరగటానికి, ప్రభుత్వ ఉద్యోగులు సరిపోతారని, సరిపోక పొతే, అప్పుడు చూద్దామని, అయితే వాలంటీర్లను వాడుకోవద్దు అంటూ రాజకీయ పార్టీలు చెప్పయని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి పెడితే, కొత్త చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంలో, ఒక విలేకరి మాట్లాడుతూ, పంచాయతీ భవనాలకు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు ఉన్నాయి అంటూ, ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి కదా, దీని పై ఏమి చేస్తారు అని ప్రశ్నించారు.

ec 06032020 2

ఆ ప్రశ్న పై సమాధానం చెప్తూ, ఇప్పుడు ఆ విషయం పై మేము ఏమి చెప్పలేం అని, ఎన్నికల కోడ్ వచ్చాక స్పందిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్​కుమార్ అన్నారు. ఇక అంతకు ముందు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పార్టీల అభిప్రాయాలు సేకరించింది. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఆయా పక్షాల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌ కుమార్ భేటీ అయ్యారు. వైకాపా తరఫున శాసనసభ్యులు జోగి రమేశ్‌, అనిల్‌, తెదేపా నుంచి నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా హాజరయ్యారు. జనసేన నుంచి వెంకటమహేశ్‌, భాజపా నుంచి నాగభూషణం, వామపక్షాల తరఫున వై.వీ.రావు, జెల్లి విల్సన్ హాజరయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలు, రాజకీయ పార్టీల నేతలతో చర్చించింది.

ec 06032020 3

విడతల వారీగా ఎన్నికల నిర్వహణ, సిబ్బంది, బందోబస్తుపై చర్చించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ రమేష్​కుమార్‌ తెలిపారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామన్న ఆయన పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రమాణ పత్రం దాఖలు చేశామని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చాయని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు ఈవీఎంలను పక్కన పెట్టామని తెలిపారు. ఈవీఎంలపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నందున ఏ ఒక్కరూ అడగలేదని అన్నారు. ఎన్నికల షెడ్యూలు శనివారం విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్​కుమార్ ప్రకటించారు.

స్థానిక ఎన్నికల్లో అధికారపార్టీకి ప్రజలచేతుల్లో తగిన పరాభవం ఎదురవుతుందని జగన్ కు ఇప్పటికే అర్థమైందని, ఆ భయంతోనే ఆయన మంత్రులకు గెలుపులక్ష్యాలు నిర్దేశించారని టీడీపీనేత, ఆపార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 9నెలల తన వికృత, విధ్వంసపాలన, తన పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చిందన్న వాస్తవం జగన్ కు బోధపడిందని, తాను చేయించుకున్న పీ.కే.బృందం కూడా అదే నిజమని తేల్చడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడిపోయాడన్నారు. అందులో భాగంగానే ఏంచేసైనా ఎన్నికల్లో గెలిచితీరాలని అటు మంత్రులను, ఇటు అధికారయంత్రాంగాన్ని, పోలీసులను ఆదేశించాడన్నారు. తమ తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమిపాలైతే, మంత్రులంతా రాజ్ భవన్ బాటపట్టాలని, ఎమ్మెల్యేలంతా ఇంటిబాట పట్టాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలే ఆయనలో ఉన్న ఓటమి భయానికి నిదర్శనమన్నారు. ధరల పెరుగుదల, విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక, మద్యం మాఫియా, పథకాలరద్దు, భూదోపిడీ, ప్రశ్నించినవారిపై దాడులకు పాల్పడటం వంటి చర్యలతో ప్రజలందరిలో జగన్ పాలనపై ఏవగింపు మొదలైందన్నారు. దాంతో వారంతా స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా... తెలుగుదేశానికి ఎప్పుడు ఓటేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారని వెంకన్న తేల్చిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికలను జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిపితే ముఖ్యమంత్రి చెప్పినట్లుగా సగంకేబినెట్ ఖాళీ అవుతుందని బుద్దా స్పష్టంచేశారు.

అధికారయంత్రాంగం, పోలీసులు, డబ్బు, మద్యం, దౌర్జన్యం, బెదిరింపులు లేకుండా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే, కడపలోకూడా టీడీపీనే గెలుస్తుందని, ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయడం ఖాయమని బుద్దా తేల్చిచెప్పారు. డబ్బు, మద్యం పెంచి ఎన్నికల్లో గెలిచారని తేలితే, వారి పదవులు రద్దు చేస్తామంటున్న జగన్ సర్కారు, పరోక్షంగా ఇతర పార్టీలవారిని బెదిరిస్తోందన్నారు. డబ్బు, మద్యం సాకుతో ప్రతిపక్ష పార్టీల సభ్యులను పోటీకి దిగకుండా, ఒకవేళ దిగినా పోటీకి అనర్హులని తేల్చడంద్వారా వారు ఎన్నికలగోదాలోకి దిగకుండా చేయాలన్న కుట్రపూరిత ఆలోచన ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో పోటీచేసేవారిని భయభ్రాంతులకు గురిచేయాలన్న దుర్బుద్ది జగన్ ప్రభుత్వంలో ఉండబట్టే, ఇటువంటి ఆదేశాలు జారీచేస్తోందన్నారు. గత ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచబట్టే, జగన్ పార్టీకి 151 స్థానాలు వచ్చాయని వెంకన్న చెప్పారు. దాదాపు రూ.5వేలకోట్లు ఖర్చుచేసి, మద్యాన్ని ఏరులైపారించి అధికారంలోకి వచ్చినవ్యక్తి, తాను చేసిందే ఇతరులుకూడా చేస్తారని ఆలోచిస్తున్నాడన్నారు.

తెలుగుదేశంపార్టీ ఎప్పుడూకూడా మంచిచేసి, సంక్షేమపథకాలద్వారా ప్రజల మనస్సులో స్థానం సంపాదించి, ఎన్నికల్లో గెలుస్తుంది తప్ప, వారిని భయపెట్టి, ప్రలోభపెట్టి ఆపనిచేయదని వెంకన్న తేల్చిచెప్పారు. నయానో, భయానో ఏం చేసైనా సరే, ఎన్నికల్లో గెలిచితీరాలంటూ మంత్రులకు చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనన్నారు. ప్రజలంతా కరోనా వైరస్ తో భయపడుతుంటే, జగన్ ఎన్నికల వైరస్ తో భయపడుతున్నాడని, తమ నాయకుడి పరిస్థితిని అర్థంచేసుకొని, మంత్రులంతా రాజ్ భవన్ అడ్రస్ తెలుసుకొని, రెడీగాఉంటే మంచిదని బుద్దా దెప్పిపొడిచారు. రాష్ట్రంలో ఎప్పుడు, ఎన్నికలుజరిగినా టీడీపీకే ఓటువేయాలని ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నార న్నారు. లక్షలకోట్లు దిగమింగిన కేసుల్లో, ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లేవ్యక్తి హయాంలో ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని భావించడం అత్యాశే అవుతుందని, ప్రజలందరిలో కూడా ఇదే అభిప్రాయం ఉందన్నారు. రూ.43వేలకోట్ల ఆస్తులు జప్తుచేయబడి, 12కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నీతి, నిజాయితీ గురించి మాట్లాడటం, డబ్బు మద్యం లేకుండా ఎన్నికలు జరపమని చెప్పడం చూస్తుంటే, హాస్యాస్పదంగా ఉందన్నారు.

వారంరోజుల వ్యవధిలో టీడీపీ అధినేతపై, నారా లోకేశ్ పై జరిగిన దాడి, జగన్ దర్శకత్వంలోనే జరిగిందని, దాడులద్వారా టీడీపీని భయపెట్టాలని చూడటం ఆయన తరం కాదని బుద్దా హెచ్చరించారు. ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యముంటే, స్థానికఎన్నికలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిపించాలని, పోలీసులు, అధికారులు, వాలంటీర్ల ను వినియోగించకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని బుద్దా సూచించారు. జగన్ బారినుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తి సైనికుడిలా పనిచేయాలన్నారు. వైసీపీప్రభుత్వం చేతగాని ప్రభుత్వమని ప్రజలకు అర్థమైందని, జనానికి కీడుచేయడం తప్ప, జగన్ సర్కారుకు మేలుచేయడం తెలియదన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే, ఎన్నికలు సజావుగా జరగవనే అభిప్రాయం ప్రజలందరిలోనూ ఉందని, గెలుపుకోసం అధికారపార్టీవారు ఎంతకైనా తెగిస్తారన్న భయం రాష్ట్రవాసుల్లో ఉందని బుద్దా స్పష్టంచేశారు.

అమరావతి ప్రాంతంలో ఇప్పటికే వైసీపీకి అన్నీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జనం మధ్య గెలిచిన ఎమ్మెల్యేలు, ఆ జనాల మధ్యకు రావటానికే భయ పడుతున్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది. ఇక జగన్ మోహన్ రెడ్డి కూడా, అమరావతి గ్రామాల మీదుగా సెక్రటేరియట్ కు వెళ్ళాలి అంటే, రోడ్డు మీద ఎవరూ లేకుండా చూసి, ముందుగా డమ్మీ కాన్వాయ్ పంపించి వెళ్ళాల్సిన పరిస్థితి. దీని అంతటికీ కారణం, అమరావతి పై వైసీపీ చూపిస్తున్న వైఖరి. 80 రోజులుగా అమరావతి రైతు కుటుంబాలు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, రోడ్డున పడి ఆందోళన చేస్తున్న, ప్రభుత్వం వారి పై కన్ను ఎత్తి కూడా చూడటం లేదు. ఇక స్థానిక ఎమ్మెల్యేలు అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా తమకు ఓటు వేసిన ప్రజలు, 80 రోజులుగా రోడ్డున పడి ఆందోళన చేస్తుంటే, ఏమిటి అని అడిగిన పాపాన పోలేదు.

undvalli 06032020 2

వారి కష్టాలు గురించి తెలుసుకోక పోగా, తిరిగి వారినే విమర్శలు చేస్తున్నారు. అమరావతిలో ఉద్యమం చేస్తున్నది రైతులు కాదని, పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ, రైతుల పై విమర్శలు చేస్తున్నారు. వారు అంతా ఒక కులం వాళ్ళే అని విమర్శిస్తున్నారు. రాజకీయ కోణంలో చూస్తున్నారు కాని, వారు ఓట్లు వేస్తేనే మేము గెలిచాం అని గుర్తించటం లేదు. నారా లోకేష్ ని కూడా కాదని, రాజధాని రైతులు గెలిపిస్తే, ఇప్పుడు ప్రజల వైపు కన్ను ఎత్తి కూడా చూడటం లేదు. అమరావతిలో ఇంత గడ్డు పరిస్థితి ఎదుర్కుంటున్న వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. రాజధాని అమరావతిలో ఉన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది కూడా సొంత పార్టీ నుంచే ఈ ఆరోపణలు వస్తున్నాయి.

undvalli 06032020 3

ఫిరంగిపురం మండలం బేతపూడి సొసైటీ చైర్మన్ పదవికి షేక్ జాకీర్ అనే వైసీపీ నాయకుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కూడా జగన్ కు పంపించారు. రాజీనామా చేసిన తరువాత మీడియా సమావేశం పెట్టి, ఉండవల్లి శ్రీదేవి పై సంచలన ఆరోపణలు చేసారు. ఎమ్మెల్యే శ్రీదేవి వల్లే తాము రాజీనామా చేస్తున్నామని స్పష్టం చేసారు. మైనారిటీలు అయిన తమకు, వైసీపీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే తన సొంత సామజికవర్గాన్ని నెత్తిన పెట్టుకుని, తమకు గౌరవం ఇవ్వాటం లేదని అన్నారు. మరో పక్క కొద్ది రోజుల ముందే, తాడికొండ మండల యూత్ అధ్యక్షుడు రాజీనామా చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు, ఇలా వరుస రాజీనామాలతో అధికార పార్టీకి ఎదురుదెబ్బలు తగలుతుండటం గమనార్హం.

స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు వెలువడుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పాలనాధికారులు గెజిట్‌లు విడుదల చేస్తున్నారు. పలు జిల్లాల కలెక్టర్లు పంపిన గెజిట్‌లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు మినహా 10 జిల్లాల్లో ఎంపీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు మినహా 10 జిల్లాల్లో జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. పశ్చిమగోదావరి, గుంటూరు మినహా 11 జిల్లాల్లో ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గ్రామాలవారీగా రిజర్వేషన్ల వివరాలు sec.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. గ్రామపంచాయతీ, పురపాలక, నగరపాలక రిజర్వేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా పరిషత్ అధ్యక్షుల స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా కొలిక్కి కాలేదు. రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ పూర్తిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అయిన తరువాత ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

jagan 06032020 2

మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొదటి దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. రెండోదశలో పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం లేదా రేపు అధికారికంగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే, జడ్పీ ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఇవాళ ఖారారు చేసారు. అయితే అంతా అనుకున్నట్టే, బీసీలకు దెబ్బ పడింది. 2013తో పోలిస్తే, 4 జిల్లాలకు బీసీల నుంచి జడ్పీ ఛైర్‌పర్సన్ల పదవి కోల్పోయే పరిస్థితి వచ్చింది. 2013లో, చిత్తూరు, కడప, కర్నూల్, నెల్లూరు జిల్లాలకు, బీసీలకు జడ్పీ ఛైర్‌పర్సన్ల స్థానం ఉండగా, ఇప్పుడు వారికి పోయాయి.

jagan 060320203

59 శాతం నుంచి, 50 శాతానికి రిజర్వేషన్ లు తగ్గించటంతో, గతంలో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్, ఇప్పుడు 24 శాతం అయ్యింది. అయితే, బీసీలు ఇంతలా నష్టపోతుంటే, జగన్ మోహన్ రెడ్డి, ఎందుకు కోర్ట్ కు వెళ్ళటం లేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. దీని పై టిడిపి కూడా మండి పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 24 శాతానికి తగ్గించి వెనుకబడిన కులాలకు జగన్ ప్రభుత్వం చరిత్రాత్మక ద్రోహం చేసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ చర్యను బీసీలు, బీసీ సంఘాలు వ్యతిరేకించాలన్నారు. బీసీ వర్గాలకు చెందిన 15 వేల మందికి రాజకీయ అవకాశాలు రాకుండా జగన్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో బీసీ నాయకత్వాన్ని అణగదొక్కేందుకు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా చేసే కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 శాతం రిజర్వేషన్ సాధించగా ఇప్పుడు జగన్ ఎందుకు ఆ పని చేయటం లేదని ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read