వైసీపీ ఓట్లు పొందాలంటే కోడిక‌త్తి దాడి. సీట్లు ఇంకా ఎక్కువ రావాలంటే బాబాయ్‌పై గొడ్డ‌లి వేట్లు. ఇప్పుడు అధికారం అండ‌గా సాగిస్తున్న అవినీతి ప్ర‌శ్నించ‌కుండా రోజుకొక‌రిపై దాడులు. ఇదే వైకాపా గెలుపు మంత్రం. బెదిరింపు సూత్రం. విప‌క్షం ఏదైనా కానీయండి. ప్ర‌శ్నిస్తే ప్ర‌భుత్వం నుంచి దాడులే ఎదుర‌వుతున్నాయి. టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డిపై వైకాపా రౌడీమూక‌లు హ‌త్యాయ‌త్నానికి ఆయ‌న ఇంటిపైనే ఎటాక్ చేయ‌డం రాష్ట్రంలో ప‌రిస్థితుల‌కి అద్దం ప‌డుతోంది. అంత‌కు రెండురోజుల‌కి ముందే యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో లోకేష్‌పై ఎటాక్‌కి య‌త్నించారు. కోడిగుడ్లు విస‌ర‌డంతో లోకేష్ భ‌ద్ర‌తాసిబ్బంది అడ్డుగా నిలిచారు. టిడిపి జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిపై ఇప్ప‌టికే మూడుసార్ల‌కి పైగా హ‌త్యాయ‌త్నాల‌కి తెగ‌బ‌డ్డారు. పుంగ‌నూరులో ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేసే ర్యాలీకి దిగిన రామ‌చంద్ర‌యాద‌వ్ అనే నాయ‌కుడు ఇంటిని నామ‌రూపాల్లేకుండా ధ్వంసం చేశారు వైకాపా గూండాలు. మాచ‌ర్ల‌లో టిడిపి నేత జూల‌కంటి బ్ర‌హ్మారెడ్డిని అడ్డుకునేందుకు ఇప్ప‌టికే ఆయ‌న అనుచ‌రులు చాలా మందిని మ‌ట్టుబెట్టిన వైసీపీ, ఇటీవ‌ల టిడిపి నేత‌ల ఇళ్ల‌పై దాడుల‌కి దిగి,  టిడిపి కార్యాల‌యాన్ని త‌గుల‌బెట్టారు. గ‌న్న‌వ‌రంలో టిడిపి ఆఫీసుని ధ్వంసం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తీరోజూ రాష్ట్రంలో ఏదో ఒక మూల టిడిపి ల‌క్ష్యంగా వైసీపీ మూక‌లు విధ్వంసాల‌కి దిగుతూనే ఉన్నాయి.

ఎన్ఆర్ఐల ట్ర‌స్టులు, ఫౌండేష‌న్లు అన్నీ డ్రామాలు అంటోన్న మాజీ మంత్రి పుల్లారావు వ్యాఖ్యలు ఆయనకే చుట్టుకున్నాయి. విడ‌ద‌ల ర‌జ‌నీ ఓ ఎన్ఆర్ఐ. ఆమె విరాళాలు, సేవ‌లు ప‌నికొస్తాయ‌ని తీసుకొచ్చి మ‌రీ టిడిపిలో చేర్చారు ప్ర‌త్తిపాటి పుల్లారావు. ఆమె టిడిపిలో చంద్ర‌బాబు పెట్టిన మొక్క‌నంటూ వ‌చ్చి, మానై ఎదిగి వైసీపీకి నీడ‌నిస్తోంది. త‌న‌దాకా వ‌స్తే కానీ త‌త్వం బోధ‌ప‌డ‌ద‌నేది సామెత‌. ఇప్పుడు ప్ర‌త్తిపాటి పుల్లారావు విష‌యంలోనూ అదే నిజ‌మైంది. ఎన్ఆర్ఐ అయిన విడ‌ద‌ల ర‌జినీని తీసుకొచ్చి టిడిపిలో చేరిస్తే  ఆమె అన‌తికాలంలోనే వైసీపీలో చేరి ఆయ‌న‌నే ఓడించింది. ప్ర‌త్తిపాటి వేసిన మొక్క ఇప్పుడు మానై వంగ‌డంలేదు, లొంగ‌డంలేదు. చిలకలూరిపేటలో ఇప్పుడు భాష్యం ప్ర‌వీణ్ టిడిపి కార్య‌క్ర‌మాల‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీకి అండ‌గా నిలుస్తున్నారు. అయితే పుల్లారావుకి త‌న‌లో తానే అభ‌ద్ర‌తాభావం ఫీలై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టిడిపిలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. భాష్యం ప్ర‌వీణ్ పేరు ప్ర‌స్తావించ‌కుండానే ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది ఎన్నిక‌ల హడావుడేనని, వారిని ఎంటర్ టైన్ చేస్తే ఎలా అంటూ మీడియాకెక్కారు. అక్కడో రూ. 10 వేలు.. ఇక్కడో రూ. 10 వేలు ఇచ్చి టిక్కెట్లు కావాలంటే ఇచ్చేస్తారా..? అంటూ నిల‌దీశారు. ఇప్పుడేదో ఓ రూ. కోటి ఖర్చు పెట్టి హడావుడి చేస్తారు.. ఆ తర్వాత చేతులెత్తేస్తారని ప్ర‌శ్నించారు. అదే ప్ర‌శ్న పుల్లారావుని నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి కేడ‌ర్ వేస్తే..స‌మాధానం ఏమిస్తారో మ‌రి. ఫౌండేషన్, ట్రస్టు పేర్లతో వచ్చే నేతలు ఎన్నికలు ముందొస్తారు.. ఎన్నికలవగానే వెళ్లిపోతార‌ని ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికో.. విదేశాల్లో ఎన్ఆర్ఐల దగ్గర షో చేయడానికో ఇలాంటి నేతలు వస్తూ పోతూ ఉంటార‌ని వ్యాఖ్యానించ‌డం ముమ్మాటికీ క‌డుపుమంట స్పంద‌న‌ని టిడిపిలో ఓ వ‌ర్గం మండిప‌డుతోంది.

ఏపీలో పొలిటిక‌ల్ స‌మీక‌ర‌ణాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. నాలుగేళ్ల క్రితం ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌రువాత టిడిపి ఈ రేంజులో పుంజుకుంటుంద‌ని ఏ రాజ‌కీయ పార్టీలు వూహించ‌లేదు. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా టిడిపి అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు, స‌ర్వేలు వెలువ‌డుతున్నాయి. టిడిపితో ఆల్రెడీ జ‌న‌సేన పొత్తు క‌న్ ఫామ్ అయ్యింది. జ‌న‌సేన బీజేపీ అల‌యెన్స్ ఉంది. ఈ నేప‌థ్యంలో కేంద్రంలో బీజేపీ పెద్ద‌లు వైసీపీతో ర‌హ‌స్య‌పొత్తు కొన‌సాగిస్తున్నారు. ఇంత గంద‌ర‌గోళ‌మైన ఎత్తులు-పొత్తుల మ‌ధ్య ముంద‌స్తు ముచ్చ‌ట్లు ఉండ‌నే ఉన్నాయి. ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కొచ్చాక టిడిపి బీజేపీతో సంబంధాల‌కి ఆస‌క్తి చూపించినా, వారు వైసీపీతో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్నారు. నిత్య‌మూ కేసులు, హ‌త్య‌లు, అప్పుల కోసం త‌మ చుట్టూ తిరుగుతున్న జ‌గ‌న్ రెడ్డికి జ‌నాద‌ర‌ణ త‌గ్గిపోయింద‌ని క‌మ‌ల‌నాథులు క‌నిపెట్టేశారు. తెలంగాణ‌లోనూ త‌మ అవ‌స‌రానికి కోట్లు సాయం చేయ‌గ‌ల‌డు కానీ, ఓట్లు తేలేని జ‌గ‌న్ రెడ్డిని దూరం పెట్టే యోచ‌న‌లో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. పీక‌ల్లోతు కేసుల్లో కూరుకుపోయిన జ‌గ‌న్ రెడ్డికి త‌మ అవ‌స‌ర‌మే కానీ, త‌మ‌కు జ‌గ‌న్ ఏ విధంగానూ ఉప‌యోగ‌ప‌డేలా లేడ‌ని వ్యూహం మార్చేశారు. దాదాపు ఆరేళ్లుగా ఎడ‌మొఖం-పెడ‌మొఖంగా ఉన్న చంద్ర‌బాబు బీజేపీ పెద్ద‌లతో తొలి భేటీ జ‌ర‌గ‌బోతోంది. కేంద్ర‌మంత్రి అమిత్ షాతో చంద్ర‌బాబు భేటీ పెను రాజ‌కీయ మార్పుల‌కు వేదిక కానుంద‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఏపీలో బీజేపీకి ఏమీ లేదనే సంగ‌తి వారికీ తెలుసు. ఇక్క‌డ బీజేపీతో టైఅప్ అయితే టిడిపి ఓట్ల‌తో వారికి సీట్లు తేవ‌డం త‌ప్పించి ఇంకే మేలూ జ‌ర‌గ‌దు. బీజేపీ టిడిపి వైపు చూడ‌డానికి అస‌లు సిస‌లు ఫాక్ట‌ర్ తెలంగాణ‌. క‌ర్ణాట‌క‌లో బొక్క‌బోర్లాప‌డి ద‌క్షిణాదిలో ప‌వ‌ర్లో లేని బీజేపీగా మిగిలిపోయింది. ప‌దేళ్ల కేసీఆర్ పాల‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ని క్యాష్ చేసుకుంటే, టిడిపి వంటి ఓటుబ్యాంకున్న పార్టీతో పొత్తు ఖ‌రారైతే తెలంగాణ‌లో కాషాయం జెండా ఎగుర‌వేయొచ్చ‌నే దిశ‌గానే పొత్తుల వ్యూహం ఉండొచ్చ‌ని జ‌ర్న‌లిస్టులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొచ్చేస్తున్నాయి. టిడిపికి అనుకూల‌మైన వాతావ‌ర‌ణం రాష్ట్ర‌మంతా ఏర్ప‌డింది. ఈ సారి అధికారం ద‌క్క‌డం ఖాయ‌మ‌ని టిడిపి సీటు ఎలాగైనా సాధించాల‌ని ఆశావ‌హులు ఎత్తుగ‌డ‌లు ప‌న్నుతున్నారు. కొంద‌రైతే అధిష్టానంపై బ్లాక్ మెయిలింగ్, ఒత్తిడులకీ దిగుతున్నారు. కౌర‌వ‌స‌భ నుంచి వెళ్లిపోతున్నాన‌ని, గెలిచి టిడిపి అధికారం చేప‌ట్టి గౌర‌వ‌స‌భ‌లో మ‌ళ్లీ అడుగు పెడ‌తాన‌ని చంద్ర‌బాబు భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు. ప్ర‌జ‌ల్లోనూ తెలుగుదేశం ప‌ట్ల క్రేజ్ బాగా పెరిగింది. ఇటువంటి స‌మ‌యంలో మొహ‌మాటాల‌కి పోయి, ఒత్తిడుల‌కి లొంగి సీట్లు ఇస్తే..ల‌క్ష్యం చేరుకోవ‌డం క‌ష్ట‌మ‌ని చంద్ర‌బాబే ఫిక్స్ అయ్యారు. స‌త్తెన‌ప‌ల్లి టిడిపి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కి ప్ర‌క‌టిస్తూనే ఇదే సంకేతాలు పంపారు బాబు. దీనిపై కొంద‌రు ర‌క‌ర‌కాల వ్యాఖ్యానాలు చేస్తూ ఒత్తిడి పెంచాల‌ని చూస్తే..సీబీఎన్ నుంచి వ‌చ్చిన స‌మాధానం `` ఈసారి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో తాను ఏ మొహమాటాలూ పెట్టుకోదలచుకోలేదు`` అని స్పష్టం చేశారు. మొహమాటపడి టికెట్లు ఇస్తే ప్రభుత్వంలోకి రాలేమంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అభ్య‌ర్థుల ఎంపికపై ఐదు మార్గాల్లో స‌ర్వేలు నివేదిక‌లు ప‌రిశీలించిన త‌రువాతే ఎంపిక ఉంటుంద‌ని చెప్పారు. మాజీ స్పీక‌ర్ దివంగత కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌యుడు కోడెల శివ‌రాం స‌త్తెన‌ప‌ల్లి టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంపై అల‌క‌బూని, ర‌క‌ర‌కాలుగా ఒత్తిడి పెంచే మార్గాల‌ని ఎంచుకున్నారు. ఆయ‌న‌లాంటి వారికి అంద‌రికీ ఇదే స‌మాధానం అని చెప్ప‌క‌నే చంద్ర‌బాబు చెప్పారు. ఫౌండేషన్లు, ట్రస్టుల పేరుతో వచ్చేవారిని దగ్గరకు రానివ్వొద్దని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్య‌ల‌పైనా నియంత్ర‌ణ‌లో ఉండాలంటూ సంకేతాలు పంపారు. తాము ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌తామంటే కుదర‌ద‌ని తేల్చేశారు. మొత్తానికి చంద్ర‌బాబు చాలా క్లియ‌ర్ గా ఉన్నారు. మొహ‌మాటాల్లేవు, ఒత్తిళ్ల‌కి లొంగేది లేద‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలిచ్చేశారు.

Page 11 of 3181

Advertisements

Latest Articles

Most Read