రేపటి అసెంబ్లీ సమావేశాల కోసం, పోలీసులు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు పలు పార్టీలు, రైతులు, అమరావతి జేఏసీ , అసెంబ్లీ ముట్టడి పిలుపు ఇవ్వటంతో, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటి నుంచి పలువురు తెలుగుదేశం పార్టీ నేతలను, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో, తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని హౌస్ అరెస్ట్ చెయ్యటానికి, పోలీసులు, ప్రయత్నం చేసారు. రేపటి అసెంబ్లీ ముట్టడికి చింతమనేని వెళ్ళకుండా, ముందు జాగ్రత్తగా పోలీసులు ఆయన నివాసానికి చేరుకొని, హౌస్ అరెస్ట్ చెయ్యాలని అనుకున్నారు. దీంతో చింతమనేని నివాసానికి, భారీగా పోలీసులు వచ్చారు. అయితే, అప్పటికే చింతమనేని పోలీసుల కళ్లుగప్పి తన నివాసం నుంచి అదృశ్యమయ్యారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చింతమనేని ఎక్కడకు వెళ్ళారో కనుక్కోవటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

chintamaneni 190102020 2

ఇక మన్రో పక్క, రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జెఏసి చేస్తున్నఆందోళనలకు మద్దతుగా తాడికొండ శివారు గ్రామం బడేపురం గ్రామస్థులు రూ.1,00,116విరాళం అందించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన మహిళలు ఆదివారం ఎన్టీఆర్ భవన్ కు తరలివచ్చి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా బడేపురం మహిళలు మాట్లాడుతూ రాజధాని పరిరక్షణ కోసం రైతులు, రైతుకూలీలు, మహిళలు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. భూములిచ్చి రోడ్లపాలైన ఆ కుటుంబాలకు తామంతా అండగా ఉంటామని అన్నారు. లాఠీదెబ్బలకు భయపడకుండా, అక్రమ కేసులకు బెదరకుండా వారు చేస్తున్న ఆందోళనలు ఫలవంతం కావాలని ఆకాంక్షించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ జెఏసి పిలుపు మేరకు జరుగుతున్న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇది 5కోట్ల ప్రజల జీవన్మరణ సమస్య అంటూ ఏ ఒక్కరి కోసమో చేస్తున్న ఉద్యమం కాదని అన్నారు. భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు.

chintamaneni 190102020 3

అమరావతిని కాపాడుకుంటేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని, మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే రాష్ట్రానికి భవిష్యత్తులో పెట్టుబడులు రావని ఆవేదన చెందారు. ఒక వ్యక్తి చేస్తున్న చెడు ఫలితంగా రాష్ట్రం మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతున్నప్పుడు ప్రతిఒక్కరూ ప్రతిఘటించాలని, నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని అన్నారు. చెడు జరుగుతున్నప్పుడు ప్రజల పక్షాన పోరాడటం ప్రతిఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులు, రైతుకూలీలు, కార్మికులు, మహిళలు, యువతరంపైనే ఉందని అన్నారు. చంద్రబాబును కలిసి బడేపురం గ్రామస్థులలో రెడ్డి వెంకట్రావు, మద్దినేని శివయ్య, రజనీకుమారి, అరుణ, చుక్కపల్లి రజని, సుశీల,మాధవి, లలిత తదితరులు ఉన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి తలాఇంత విరాళాలు పోగుజేసి అమరావతి పరిరక్షణ జెఏసికి అందజేస్తున్నట్లు వాళ్లు తెలిపారు.

మోసగాళ్ళు పలు రకాలు ఉంటారు. కొంత మంది మరీ బరి తెగించి ప్రవర్తిస్తూ ఉంటారు. ఏకంగా సియం తెలుసు, పిఎం తెలుసు అంటూ, లాబయింగ్ చేసి, పనులు చేస్తూ ఉంటారు. కొంత మంది ఈ ట్రాప్ లో పడి బురిడీ కొట్టిస్తూ ఉంటారు. ఇదే కోవలో, గతంలో కొంత మంది ఎమ్మేల్యేలని, మంత్రులని కూడా ఇలా ట్రాప్ చేసి, వారి దగ్గర డబ్బులు గంజిన వైనం చూసాం. తరువాత విషయం తెలిసుకుని, ఆ ప్రజా ప్రతినిధులు లబో దిబో అంటూ, పోలీసు కేసులు పెట్టారు. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుంది. ఇదే కోవలో, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక వార్త వినబోతున్నాం. ఏకంగా సియం జగన్ పేరు, సిబిఐ డైరెక్టర్ పేరు చెప్పి, ఒక మాజీ ఎంపీని బుట్టలో వేసే పని చేసాడు ఒక ప్రబుద్ధుడు. అయితే ఆ మాజీ ఎంపీ అంతా పరిశీలించి, వీడు ఒక ఫేక్ గాడు అని తెలుసుకుని, వెంటనే సిబిఐ అధికారులకు సమాచారం ఇవ్వటంతో, సిబిఐ అధికారులు ఎంట్రీ ఇచ్చియా, ఆ ఫేక్ ప్రబుద్ధుడిని పట్టుకుని, లోపల వెయ్యటంతో కధ సుఖాంతం అయ్యింది.

cbi 190102020 2

తెలుగుదేశం పార్టీ నాయకూడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పై, సిబిఐ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. గత నెలలో, రాయపాటి పై, సిబిసి సోదాలు జరిపి, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ విషయంలో, ఆయన పై కేసు నమోదు చేసారు. అయితే ఇప్పుడు ఇదే అదునుగా చూసిన ఒక ముఠా రాయపాటిని బుట్టలో వేసే పనిలో పడింది. అసలు జరిగిన విషయం ఏమిటి అంటే, నేను సిబిఐలో పని చేస్తున్నాను, నాకు సిబిఐ డైరెక్టర్ బాగా సన్నిహితంగా ఉంటారు, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాకు బాగా క్లోజ్, కావాలంటే ఈ ఫోటో చూడండి అంటూ, రాయపాటిని కలిసి మణివర్ధన్‌ రెడ్డి అనే వ్యక్తి, రాయపాటి సాంబశివరావుని కలిసారు. మీ మీద ఉన్న సిబిఐ కేసు మాఫీ చేయిస్తానని, రూ.10 కోట్ల దాకా డబ్బు డిమాండ్‌ చేసాడు.

cbi 190102020 3

ముందుగా రాయపాటిని ఫోన్ లో సంప్రదించిన వ్యక్తీ, తరువాత రోజు సారాసరి రాయపాటి ఇంటికే వచ్చేసారు. తనకు సిబిఐలో అందరూ తెలుసనీ, మీ సిబిఐ కేసు క్షణాల్లో మాఫీ చేయిస్తానని, దానికి మీరు ఒక 10 కోట్లు ఇస్తే చాలని, చెప్పారు. అలాగే డైరెక్టర్ గారితో మాట్లాడండి అంటూ, మరెవరితోనో ఫోన్ లో మాట్లాడించారు. అలాగే జగన్ మోహన్ రెడ్డికి తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మబలికి, జగన్ తో దిగిన ఫోటో చూపించారు. అయితే, మణివర్ధన్‌ రెడ్డి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన రాయపాటి సాంబశివరావు, ఈ విషయం పై సిబిఐ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేసారు. రాయపాటి ఇచ్చిన వివరాలను గోప్యంగా ఉంచిన సిబ్బంది, రంగంలోకి దిగి, మణివర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాయపాటి ఈ విషయంలో లిఖితపూర్వక ఫిర్యాదు కూడా ఇచ్చారు.

అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి, మూడు రాజధాణులుకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పన్నిన వ్యూహాన్ని, శాసనమండలిలో అడ్డుకునే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుంది. దీనిపై తమ వ్యూహాలకు టిడిపి పార్టీ నేతలు పదును పెడుతున్నారు. అసెంబ్లీలో వైసీపీకి, శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండటంతో, అసెంబ్లీలో వైసీపీ తమను మాట్లాడనివ్వకుండా బుల్ డోజ్ చేసినా, శాసనమండలిలో అడ్డుకోవాలని, ప్రజలకు అన్నీ అక్కడ వివరించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అయితే అసెంబ్లీలో బిల్లుల ఆమోదం పొందటంలో అసెంబ్లీదే పైచేయి అవుతుంది. ఒకసారి శాసనమండలి బిల్ తిప్పి పంపిస్తే, రెండో సారి మళ్ళీ అసెంబ్లీ బిల్ చేస్తే, ఇక శాసనమండలికి తిప్పి పంపించే అవకాసం ఉండదు. అయినప్పటికీ తన వ్యతిరేకతను తెలియజేయడానికి, ఈ ప్రక్రియ కొంత కాలమా జాప్యం చేసి, ఢిల్లీ లెవెల్ లో చెక్ పెట్టటానికి, తెలుగుదేశం పార్టీ శాసనమండలి ద్వారా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెక్ పెట్టటానికి రెడీ అయ్యింది.

assembly 19012020 2

ఈ ప్రక్రియ ద్వారా, తాము మూడు ముక్కల రాజధానికి ఎందుకు వ్యతిరేకం, దాని వల్ల, ఏ ఉపయోగం ఉండదు, అలాగే రాజధాని రైతుల సమస్యల గురించి కూడా ప్రజలకు వివరంగా చెప్పాలని టీడీపీ భావిస్తోంది. అయితే శాసనమండలిలో తిప్పి పంపకుండా, ఎక్స్పర్ట్ కమిటీకి రిఫర్ చేస్తే, ఒక నెల రోజులు పాటు, ఈ ప్రక్రియ ఆపవచ్చని, తద్వారా, ప్రభుత్వం తీసుకున్న ఈ తిక్క నిర్ణయం గురించి, ప్రజల్లో మరింత చర్చ జరిగి, ఢిల్లీ స్థాయిలో, జోక్యం చేసుకునే అవకాసం ఉంటుందని, తెలుగుదేశం భావిస్తుంది. అసెంబ్లీ, శాసనమండలిలో ఎలాంటి వాదనలు వినిపించాలి, ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే దాని పై, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం ఈ రోజు సమావేశం అయ్యింది.

assembly 19012020 3

శాసనసభలో ఎలాంటి వదనలు వినిపించాలి, తమకు మైక్ ఇవ్వకపోతే ఏమి చెయ్యాలి అనే దాని పై, అలాగే శాసనమండలిలో తమ అభిప్రాయం వినిపించడంతో పాటు బిల్లులను ఎలా ఆపాలి అనే దాని పై చర్చిస్తున్నారు. రాజధాని మార్పు అంటూ నేరుగా ప్రభుత్వం బిల్లులో చెప్పదని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అల చేస్తే, రైతులకు పరిహారం ఇవ్వాలి కాబట్టి, అలా చెయ్యదని, పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ఈ బిల్లు వచ్చే అవకాసం ఉందని టిడిపి భావిస్తుంది. అయితే, ఈ బిల్లులను ద్రవ్య బిల్లు రూపంలో తెద్దామని ప్రభుత్వం భావించారు. ఇలా అయితే మండలిలో అడ్డుకోలేదని భావించారు. అయితే, ద్రవ్యబిల్లుగా తెస్తే ముందు దాన్ని గవర్నర్‌ కు పంపి అనుమతి తీసుకోవాలి. అయితే గవర్నర్ పరిశీలన చేయాల్సి ఉంటుందని చెప్పటంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మరి శాసనమండలిలో ఎలా ఉంటుందో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి సెక్యూరిటీకి, రేపటి అసెంబ్లీ టెన్షన్ పట్టుకుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వెలగపూడిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్, అసెంబ్లీకి వెళ్ళాలి అంటే, మందడం మీదుగా వెళ్ళి. అయితే గత 33 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల ఆందోళన నేపధ్యంలో, అలాగే రేపు అసెంబ్లీ ముట్టడికి పిలుపిచ్చిన నేపధ్యంలో, రేపు ఎలా గట్టెక్కించాలా అని పోలీసులు వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో ఇప్పటికే అమరావతి అసెంబ్లీకి వెళ్ళటానికి, వేరే రోడ్ కూడా వేసారు. ఈ కొత్త రోడ్డు ద్వారా, అసెంబ్లీకి తేలికగా చేరుకోవచ్చని, ప్రభుత్వం వ్యూహంగా ఉంది. అయితే రేపటి అసెంబ్లీ సమావేశాల కోసం, ఇప్పటి నుంచి, జగన్ సెక్యూరిటీ సిద్ధం అవుతుంది. తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి, అసెంబ్లీకి, వెళ్ళే మార్గంలో, ఇప్పటికే జగన్ కాన్వాయ్ ట్రయల్ రన్ చేసారు. అలాగే, దారి పొడుగునా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో, అయితే, మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసారు.

jagan 19012020 2

ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఇప్పటికే అందరికీ 149 సీఆర్పీసీ నోటీసులు వెళ్ళాయి. బయట వ్యక్తులు ఎవరూ ఊరిలో ఉండకూడదు అంటూ నోటీసులు కూడా ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నారు. ఇక మరో పక్క, మూడు రాజధానుల ప్రతిపాదన, CRDA చట్టం రద్దు బిల్లులు.. శాసనసభతో పాటు.... మండలిలో గట్టెక్కడంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. బిల్లులు ఆమోదం కోసం అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహంపై..ముఖ్యమంత్రి జగన్ పలువురు మంత్రులతో చర్చించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో ఉపముఖ్యమంత్రి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలిలో వైకాపా పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

jagan 19012020 3

మండలిలో వైకాపాకు బలం తక్కువగా ఉండటంతో బిల్లులను గట్టెక్కించడంపై సమాలోచనలు జరిపారు. మండలిలో ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలనే దానిపైనా దృష్టి సారించారు. ఇదే సమయంలో అసెంబ్లీలో రేపు ప్రవేశపెట్టే బిల్లులపై ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తోంది. ఇక మరో పక్క, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు రైతులు, అమరావతి రాజధానిని తరలించ వద్దు అంటూ, అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ పైకి ఎక్కారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 13వ అంతస్తుకు ఎక్కిన వాళ్ళు, అమరావతిని ఇక్కడే ఉంచుతాం అని చెప్పే దాకా, దిగమని, స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, ప్రాణత్యాగానికైనా వెనుకాడేదిలేదని నినాదాలు చేస్తున్నారు. అయితే, వారిని దించే ప్రయత్నం చేస్తున్నా, ఇప్పటి వరకు ఫలించలేదు.

Advertisements

Latest Articles

Most Read