అమరావతిలో, ఈ రోజు అసెంబ్లీ ముట్టడి ఉండటంతో, ఈ రోజు విజయవాడలో కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఈ రోజు ప్రకాశం బ్యారేజి పూర్తిగా మూసేస్తారు. ఇది పోలీస్ వారి ప్రెస్ నోట్... "తేది.19-01-2020. అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కారణంగా ప్రకాశం బ్యారేజ్ప వాహనాల రాకపోకలు నిషేధం. ప్రకాశం బ్యారేజ్ మీదుగా ప్రయాణించే వాహనాల ట్రాఫిక్ మళ్ళింపు ది. 20.01.2020న అమరావతి పరిరక్షణ సమితి, జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఇతర రాజకీయ పార్టీలతో కలసి తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ప్రకాశం బ్యారేజీపై అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధిస్తూ, బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, కృష్ణలంక (సీతమ్మవారి పాదాలు), కుమ్మరిపాలెం మరియు ఒటౌన్ ప్రాంతాల వైపు నుండి మరియు తాడేపల్లి మరియు సీతానగరం వైపు నుండి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు సాగించే అన్ని రకాల వాహనాలను ఈ క్రింది విధంగా మళ్లించడం జరుగుతుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ పై పాదాచారుల రాకపోకలను కూడా నిషేధించడం జరుగుతుంది.

ట్రాఫిక్ మళ్ళింపు చర్యలు : - గొల్లపూడి, కుమ్మరిపాలెం మరియు ఒటౌన్ ప్రాంతాల నుండి వచ్చే అన్ని రకాల వాహనాలు గొల్లపూడి వద్ద నుండి సితార సెంటర్, సి.వి.ఆర్, ప్లైఓవర్, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్ మీదుగా పంజా సెంటర్, రైల్వే వెుకింగ్, ఆర్.టి.సి. టెర్మినల్, లోబ్రిడ్జి, ప్రకాశం బొమ్మ, పోలీస్ కంట్రోల్ రూమ్, బందరు లాకులు మీదుగా 9వ నెంబరు జాతీయ రహదారికి చేరుకుని అక్కడ నుండి కనకదుర్గ వారధి మీదుగా ప్రయాణించాలి మరియు భవానీపురం, ఆర్టీసీ వర్క్ షాపు రోడ్లు, భవతీకాటా, సితార, సి.వి.ఆర్. ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణించాలి. ఏలూరు రోడ్డు మరియు బందరు రోడ్డు వైపు నుండి వచ్చే అన్ని రకాల వాహనాలు బందర్ లాకుల మీదుగా 9వ నెంబరు జాతీయ రహదారికి చేరుకుని అక్కడి నుండి కనకదుర్గ వారిధి మీదుగా ప్రయాణించాలి. గుంటూరు, తాడేపల్లి, సీతానగరం వైపు నుండి వచ్చే వాహనాలను మరియు పాదచారులను ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను అనుమతించబడవు. హైదరాబాద్ నుండి వచ్చు లారీలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా ప్రయాణించాలి. అదే విధంగా ది.20.01.2020 నుండి ది. 23.01.2020 వరకు ఎటువంటి భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం వైపు నుండి విజయవాడ నగరంలోకి అనుమతించబడవు.

పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి భవానీపురం వెళ్ళు వారు సీతమ్మ వారి పాదాలు, వినాయక టెంపుల్, కాళేశ్వరరావు మార్కెట్, పంజా సెంటర్, వి.జి. చౌక్, చిట్టినగర్, సితార మీదుగా భవానీపురం ప్రయాణించాలి. హనుమాన్ జంక్షన్ నుండి ఎటువంటి భారీ వాహనాలను విజయవాడ నగరంలోనికి అనుమతించబడవు. మచిలీపట్నం నుండి చెన్నై వెళ్ళు వారు పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, బాపట్ల, ఒంగోలు మీదుగా ప్రయాణించవలెను. చెన్నై నుండి మచిలీపట్నం వెళ్ళు ఒంగోలు, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు మీదుగా ప్రయాణించవలెను. గుంటూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మిరియాలగూడ, నార్కెట్పల్లి మీదుగా ప్రయాణించవలెను. హైదరాబాద్ నుండి గుంటూరు వైపు వెళ్ళు వాహనాలు నార్కెట్పల్లి, మిరియాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా ప్రయాణించవలెను. మచిలీపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనాలు మచిలీపట్నం, పామర్రు, హనుమాన్ జంక్షన్, నూజివీడు, విస్సన్నపేట, కల్లూరు, వైరా, ఖమ్మం , సూర్యాపేట మీదుగా ప్రయాణించవలెను. హైదరాబాద్ నుండి మచిలీపట్నం వైపు వెళ్ళు వాహనాలు హైదరాబాద్, ఖమ్మం, వైరా, కల్లూరు, విస్సన్నపేట, నూజివీడు, హనుమాన్‌జంక్షన్, పామర్రు మీదుగా ప్రయాణించవలెను. కావున పైన పేర్కొన్న ట్రాఫిక్ మళ్ళింపు చర్యలను ప్రజలు మరియు వాహన చోదకులు గమనించి ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

గృహ నిర్బంధాలను, అక్రమ అరెస్ట్ లను ఖండించిన చంద్రబాబు. వైసిపి ప్రభుత్వ దమనకాండపై పత్రికా ప్రకటనలో ధ్వజమెత్తిన చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ నాయకులను, జెఏసి నేతలను గృహ నిర్బంధాలు చేయడం, అక్రమ అరెస్ట్ లు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మండిపడ్డారు. ఆదివారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో వైసిపి ప్రభుత్వ దమనకాండపై ధ్వజమెత్తారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన నేపథ్యంలో అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో ఎవరికి వారు తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలని అనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు చేపట్టడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్దం. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా దేశంలో ఇంత నిర్బంధం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందంటూ, పౌరుల ప్రాధమిక హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదన్నారు.

cbn 20012020 2

రాజ్యాంగం మౌలిక సూత్రాలను కాలరాసేలా రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వ్యవహరించడాన్ని గర్హించారు. ‘‘రోడ్డు పక్కన వేసుకున్న టెంట్లను పీకేయడం, మహిళలను సాయంత్రం 6గం తరువాత పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం, లాఠీలతో తీవ్రంగా గాయపర్చడం, ఆడబిడ్డల కడుపులో బూటుకాళ్లతో తొక్కడం, పసిబిడ్డలపై చేయి చేసుకోవడం, రైతులను, రైతుకూలీలను జైళ్ళకు పంపడం, మహిళలపై తప్పుడు కేసులు పెట్టడం...వైసిపి అరాచకాలకు అంతే లేకుండా పోయింది’’. ‘‘గతంలో టిడిపి ప్రజా ప్రతినిధి బృందంపై వైసిపి కార్యకర్తలు రాళ్లు వేసినప్పుడు, వాళ్లకు నిరసన తెలిపే హక్కు ఉందని ఇదే డిజిపి ప్రకటించిన విషయాన్ని రాష్ట్ర పోలీసులంతా గుర్తుంచుకోవాలి."

cbn 20012020 3

"అది కేవలం వైసిపి వాళ్లకే కాదు భారత పౌరులు అందరికీ రాజ్యాంగం కల్పించింది. చట్టం వైసిపి వాళ్లకోలాగా, ఇతరులకోలాగా వర్తింపచేయడం సరికాదు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. ‘‘రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జెఏసి పిలుపు మేరకు సోమవారం జరిగే ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసు బలంతో అడ్డుకోవడం సరికాదు. తక్షణమే గృహ నిర్బంధాలను ఎత్తివేయాలి. అక్రమ అరెస్ట్ లను నిలిపివేయాలి.’’ నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు.

రాజధాని తరలింపును సమర్థిస్తూ, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు నడిరోడ్లపైకొచ్చి అభినవకట్టప్పల్లా మారి అమరావతికి వెన్నుపోటు పొడుస్తున్నారని టీడీపీసీనియర్‌నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ మండిపడ్డా రు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పుట్టినప్రాంతానికి, కన్నతల్లి వంటి జన్మభూమికి ద్రోహం చేస్తున్న అధికార పార్టీనేతలంతా అమరావతి ద్రోహులుగా మిగిలిపోయారన్నారు. అధికారంలోకి రాకముందు ఒకలా, గద్దెనెక్కాక మరోలా మాట్లాడటం జగన్‌కు బాగా వంటపట్టిందని, ఆవిద్యతోనే ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నాడని నరేంద్ర దుయ్యబ ట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలు మర్చిపోయేలా చేయడానికి రోజుకోవిధంగా కపటనాటకాలు ఆడటం జగన్‌కు అలవాటుగా మారిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో పాలనావ్యవస్థను ముక్కలు చేయడం, రాజధానిని విభజించడం ఎంతవరకు సమంజసమని నరేంద్ర ప్రశ్నించారు. కర్నూల్లో హైకోర్టు పెడితే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే అన్నిరంగాల్లో ముందంజలోఉన్న విశాఖజిల్లాలో రాజధానిపెడితే, అక్కడేం ఒనగూరుతుందని ధూళిపాళ్ల నిలదీశారు. అభివృద్ధిలో అన్ని జిల్లాలకంటే, విశాఖ అత్యున్నతస్థానంలోనే ఉందన్నారు. రాబోయేరోజుల్లో విశాఖ వాసులు ధృతరాష్ట్రకౌగిలిలో చిక్కుకోబోతున్నారనే విషయాన్ని ఆప్రాంతవాసులకు ఇప్పటికే అర్థమైందన్నారు. ప్రపంచంలో ఎక్కడాకూడా ఈ విధమైన విభజన జరగలేదని, కేంద్రప్రభుత్వం కూడా పరిపాలనావ్యవస్థలన్నింటినీ ఒకేచోట కేంద్రీకృతం చేస్తోందన్నారు. ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతుల నివాసాలు, అన్నిరకాల డైరెక్టరేట్లు ఒకేచోట ఉండేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిచా రని ధూళిపాళ్ల పేర్కొన్నారు. జగన్‌ నిర్ణయాలను సమర్థిస్తూ, మూడురాజధానులు అద్భుతమని పొగిడిన కేసీఆర్‌, తనరాష్ట్రాన్నికూడా ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలుగా విభజిస్తాడా అని నరేంద్ర నిలదీశారు. రాష్ట్రంలోని ఆందోళనలవల్ల ఎక్కువగా లాభపడు తోంది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. ఏపీలో రగిలిన మంటల్లో తెలంగాణ చలికాచుకుం టోందని, 13జిల్లాలకే మూడు పరిపాలనాకేంద్రాలుంటే, 33జిల్లాలకు ఎన్ని కేంద్రాలుం డాలో, ఆవిధంగా చేయడానికి తెలంగాణ సర్కారు ముందుకెళుతుందా అని టీడీపీ నేత ప్రశ్నించారు.

కేంద్రంలో ఎల్లయ్య ఉన్నా, పుల్లయ్యఉన్నా చొక్కాపట్టుకొని నిలదీసి రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొస్తానన్న జగన్‌, ఇప్పుడు ప్లీజ్‌ప్లీజ్‌ అంటూ మోదీకాళ్లు పట్టుకునే స్థితికి చేరాడని నరేంద్ర ఎద్దేవాచేశారు. రాష్ట్రమంతా రాజధాని కేంద్రంగా రగులుతుంటే, ఆప్రాంతంలో వేలాదిమందిపోలీసుల్ని నియమించి, వారిబూట్లకింద ప్రజలు నలిగిపోయేలా ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులంతా కన్నీళ్లతో వేడుకుంటున్నా జగన్‌ప్రభుత్వం ఎందుకు మూర్ఖత్వంతో వ్యవహరి స్తోందని నరేంద్రప్రశ్నించారు. తనకున్న ఎంపీల బలంలో ఎన్‌ఆర్సీ, సీ.ఏ.ఏ బిల్లులకు పార్లమెంట్‌లో మద్ధతుతెలిపిన జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్రంలో మాత్రం 102జీవో జారీ చేశాడన్నారు. ముస్లింమైనారిటీలకు ద్రోహం చేశాడుకాబట్టే, జగన్‌ తనపార్టీలోని ఆయావర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు ముఖం చూపించడంలేదన్నారు. ఎన్నికలకు ముందు ముస్లింలకు అండగాఉంటామని చెప్పినజగన్‌, అధికారంలోకి రాగానే వారిని నడిసముద్రంలో ముంచేశాడని నరేంద్ర ఆక్షేపించారు. పింఛన్లు రూ.3వేలకు పెంచుతాన ని చెప్పి, రూ.2,250కే పరిమితం చేశాడని, 45ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని చెప్పి మోసం చేశాడని, అన్నక్యాంటీన్లు మూసేశాడని ఇలా అనేక విషయాల్లో జగన్‌ చెప్పేమాటలకు చేస్తున్నపనులకు పొంతనలేకుండా పోయిందన్నారు.

రాజధాని అంశంలో నేడుజరగబో యే అసెంబ్లీసాక్షిగా జగన్‌ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపేప్రయత్నాలు ప్రారంభిం చాడన్నారు. ప్రజల్ని ఏమార్చడం కోసం తనవిషపుత్రిక సాక్షిలో తమపై అసత్యప్రచారం చేస్తూ, తమగొంతునొక్కే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌పేరుతో తనకుమార్తెపై విషప్రచారం చేసేక్రమంలో సాక్షిపత్రికలో అభూతకల్పనలతో, అసత్యాలు వండివార్చారని నరేంద్ర మండిపడ్డారు. తన కుమార్తెకు తెల్లకార్డు ఉందని, ఆమెకు అమరావతిలో భూమిఉందని చెబుతూ, సాక్షిని అడ్డంపెట్టుకొని, జగన్‌ అసత్యాలపై బతుకుతున్నాడన్నారు. ఎన్నిరోజులు ఇలా కుల, మతరాజకీయాలు చేస్తూ జగన్‌ పబ్బం గడుపుకుంటాడని నరేంద్ర ప్రశ్నించారు. జగన్‌ ఉంటున్న ఇల్లు ఆయనదికాదని, ఇల్లుఉన్న తాడేపల్లి ప్రాంతంలో, పక్కనున్న నంబూరు, కాజలో ఏవర్గాలవారున్నారో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు.

రాజధానివల్ల సామాజికవర్గాలకు అతీతంగా అంద రూ లబ్ధిపొందారన్నారు. ఆస్తులేవైనా ఉంటే అవితనపేరుతో, తనపిల్లలపేరుతోనే ఉంటాయని, జగన్‌లా తానేమీ బినామీలపై ఆధారపడి బతకడంలేదని నరేంద్ర తేల్చి చెప్పారు. జగన్‌కే బెయిల్‌కార్డు, బినామీకార్డు, జైల్‌కార్డున్నాయని, ఆయన నివాసం హరీశ్‌ఇన్‌ఫ్రా, భారతిపేరుతో ఉందన్నారు. బినామీ బతుకుబతికే వ్యక్తి, తమగురించి ఇష్టానుసారం ఎలా మాట్లాడతాడని, ఎలా వార్తలు రాయిస్తాడని ధూళిపాళ్ల మండిపడ్డా రు. అసత్యాలతో ప్రజలమధ్య అపోహలు, వైషమ్యాలు రెచ్చగొట్టేపనిలో జగన్‌ఉన్నాడని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవుపలికారు. 2004లో వైఎస్‌ ముఖ్యమం త్రి అయ్యేనాటికి జగన్‌ ఆస్తులెన్ని, తండ్రి అధికారంనుంచి దిగిపోయేనాటికి ఆయనకు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులెన్ని అనేదానిపై ఆయనచర్చకు వస్తాడా అని నరేంద్ర ప్రశ్నించారు. జగన్‌ నిజంగా ధైర్యవంతుడయితే ఈ అంశంపై బహిరంగంగా చర్చకు రావాలని నరేంద్ర సవాల్‌విసిరారు. ఏ అధికారి అయినాసరే, జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా, గుడ్డిగా పనిచేస్తే, వారంతా కోర్టులచుట్టూ తిరగకతప్పదని ఆయన హెచ్చరించారు.

తామేదైనా తప్పుచేసుంటే, ఏవిచారణ జరిపినా ఎదుర్కోవడానికి తాముసిద్ధంగానే ఉన్నామన్నారు. కండీషన్‌ బెయిల్‌పై బయటతిరుగుతున్న ఏ2ముద్దాయి ఏహోదాలో ప్రధానికి లేఖలు రాశాడన్నారు. సీబీఐ కేసులో ఏ2గా ఉన్న విజయసాయి కోర్టులను, ప్రభుత్వసంస్థలను, అధికారులను ప్రభావతంచేసేలా లేఖలు ఎలారాస్తాడని, వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాడని నరేంద్ర నిలదీశారు. అధికారయంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన్‌, విజయసాయిల గురించి సీబీఐకి, ఈడీకి, సుప్రీంకోర్టుకి లేఖలు రాస్తామన్నారు. ప్రజలను ఏమార్చడానికి, మైమరపించడానికి ఈప్రాంతానికి వెయ్యికోట్లు, ఆప్రాంతానికి మరోవెయ్యికోట్లని అసెంబ్లీ సాక్షిగా మోసం చేయడానికి జగన్‌ సిద్ధమయ్యాడన్నారు. అసత్యాలు, అబద్ధాల కలయికలోనుంచి పుట్టిన సాక్షి కథనాలు నమ్మకుండా, కులాలు, మతాలపేరుతో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకో కుండా, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నరేంద్ర హితవుపలికారు. వ్యక్తులు తప్పుచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలిగానీ, కులాలు, మతాలప్రస్తావన ఎందుని ఆయన ప్రశ్నించారు. బెయిల్‌పక్షులన్నీ ఒకేగూటికిచేరేలా తమవంతు ప్రయత్నాలు చేస్తామని, జగన్‌ తనపైఉన్న కేసులనుంచి పునీతుడయ్యాక, ఎదుటివారిగురించి మాట్లా డాలని ధూళిపాళ్ల సూచించారు.

ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం, మంగళగిరిలో ఉన్న ఎన్టీఆర్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా, రేపు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, అలాగే ప్రజలకు ఎలా అర్ధమయ్యేలా చెప్పాలి అనే దాని పై, చర్చించారు. ఈ సందర్భంగా, ఆనాడు ఎన్టీఆర్ తీసుకువచ్చిన ఒక ఫార్ములా ఎలా సక్సెస్ అయ్యింది ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలు: 1).అభివృద్ది వికేంద్రీకరణే తెలుగుదేశం పార్టీ మూల సిద్దాంతం. అన్ని ప్రాంతాల్లో అభివృద్ది జరగాలి, పరిపాలన ప్రజల వద్దకు చేరాలి అనేదే ఎన్టీఆర్ హయాం నుంచి టిడిపి విధానం. ఎన్టీఆర్ మాండలిక వ్యవస్థ తెచ్చింది పరిపాలన ప్రజల వద్దకు తెచ్చాం. ఆఫీస్ మారిస్తే, ఏదో 10మంది ఉద్యోగులను అటుఇటు మారిస్తే అభివృద్ది జరగదు. ఇప్పుడు పరిపాలన వికేంద్రకరణ పేరుతో అంతా రివర్స్ చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వ శాఖలను 4చోట్లకు మార్చడం ‘‘పాలనా వికేంద్రీకరణ కాదు. పాలనా విచ్ఛిన్నం..’’ బాధ్యతా యుతమైన స్థానాల్లో ఉన్నవాళ్లు ఈవిధంగా చేయరాదు. ప్రజల సౌలభ్యం కోసం పరిపాలన ఉండాలి. మండల స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట (మండల కేంద్రంలో) ఉండాలి. జిల్లా స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు జిల్లా కేంద్రంలోనే ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట సెక్రటేరియట్ లో ఉండాలి. అప్పుడే వివిధ పనులపై వచ్చిన ప్రజానీకం ఆ ప్రాంతానికి వచ్చి అన్ని పనులు చేసుకుని వెళ్లడం సులువుగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ లో భాగంగానే ప్రతి మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలని ఎన్టీఆర్ అప్పట్లో భావించారు, మాండలిక వ్యవస్థకు రూపకల్పన చేసి దిగ్విజయంగా నడిపారు.  రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు రాజధాని ప్రాంతంలో ఒకేచోట సెక్రటేరియట్ లో ఉంటేనే, అన్నివర్గాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది. ఒక్కో శాఖ పనికి ఒక్కో ప్రాంతానికి వెళ్లాల్సి రావడం ప్రజలకు వ్యయ ప్రయాస భారమే..

ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కేంద్ర కార్యాలయాలను అన్నింటినీ ఒకేచోట తెచ్చి, 70వేల ఉద్యోగులను ఒకే చోటకు తెచ్చి, ఇండియా గేట్- రాష్ట్రపతి భవన్ మధ్య నిర్మిస్తుంటే, పరిపాలనా కేంద్రీకరణ చేస్తుంటే, మన రాజధానిలో ఉన్న శాఖలను 4చోట్లకు మార్చేసి ‘‘పాలనా విచ్ఛిన్నానికి’’ వైసిపి ప్రభుత్వం పాల్పడుతోంది. 10వేల ఎకరాల భూములపై కన్నేసినందుకే విశాఖకు రాజధానిని తరలించాలని ఎత్తుగడ వేశారు. 8నెలల్లో సీఎం స్వంత నియోజకవర్గానికి వేలకోట్లు ఇచ్చారు. అదే శ్రీకాకుళం, విజయనగరంకు ఎందుకివ్వలేదు ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే..? 2).నీటిపారుదల ప్రాజెక్టులపై టిడిపి ప్రభుత్వం రూ72వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో 40వేల కోట్లు పైన వెనుకబడిన జిల్లాలలోనే(ఉత్తరాంధ్ర, రాయలసీమ) ఖర్చు చేశాం. టిడిపి ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా విశాఖ నుంచే చేశాం. 3సమ్మిట్లు పెడితే మూడూ విశాఖలోనే నిర్వహించాం. ఆర్ధిక రాజధానిగా, ఫార్మాహబ్ గా, టూరిస్ట్ కేంద్రంగా విశాఖను అన్నివిధాలా అభివృద్ది చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే..హుద్ హుద్ తుపాన్ బీభత్సంలో విశాఖ అతలాకుతలం అయితే, సెక్రటేరియట్, కేబినెట్ అంతా అక్కడే 14రోజులు మకాం వేసి విశాఖను మళ్లీ సర్వాంగ సుందరంగా చేశాం. తిత్లి తుఫాన్ బీభత్సంలో కనీసం శ్రీకాకుళం జిల్లాలో బాధితులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు.

హుద్ హుద్ తుపాన్ తో విశాఖ అల్లాడితే అక్కడ కనీసం గంట కూడా ఉండకుండా వెళ్లిపోయాడు. వాళ్ల అమ్మను ఓడించినందుకే హుద్ హుద్ వచ్చిందన్నవాళ్లకు విశాఖపై ప్రేమ ఉంటుందా..? 3).ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే ఈ 8నెలల్లో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఎంత నిధులు ఖర్చు చేశారు..? భావనపాడు పోర్ట్, భోగాపురం ఎయిర్ పోర్ట్ అతీగతీ పట్టించుకోలేదు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార ప్రాజెక్టుల్లో ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క యూనిట్ కాంక్రీట్ వేయలేదు. విశాఖపై ప్రేమతో కాదు అక్కడి భూములపై కన్నేయడం వల్లే అక్కడికి తరలిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ కాబట్టి అమరావతి వీలుకాదు, ల్యాండ్ గ్రాబింగ్ కోసమే విశాఖపై కన్నేశారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టి ఇక్కడి భూముల ధరలు పెంచడం దేవుడెరుగు, ఉన్నభూములన్నీ వైసిపి భూతాలే మింగేస్తున్నారని అక్కడి ప్రజలు భీతిల్లుతున్నారు. పనులన్నీ నిలిపేసి ఇక్కడ అమరావతిని దెబ్బకొట్టారు. రూ లక్ష కోట్ల సంపదను నాశనం చేశారు. రూ లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే డేటా సెంటర్, లులూ, ప్రాంక్లిన్ టెంపుల్ టన్, ఫిన్ టెక్ అన్నీ పోగొట్టేసి విశాఖను దెబ్బకొట్టారు. కియా ఆగ్జిలరీ యూనిట్లు 17పోగొట్టి అనంతపురాన్ని, మెగా సీడ్ హబ్ పోగొట్టి కర్నూలును, రిలయన్స్ కంపెనీ పోగొట్టి తిరుపతిని, సోలార్-విండ్ పవర్ ప్లాంట్లను బెదిరించి మొత్తం రాయలసీమనే దెబ్బకొట్టారు. మొత్తం రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు తీరని నష్టం చేశారు.

గత 8నెలల్లో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నాశనం చేయడంపై సర్వత్రా వ్యతిరేకత ఉంది. ఆదాయం పెంచే చర్యలు లేకుండా సంపద నాశనం చేసే చర్యలు చేపట్టారు. పెట్టుబడులు వచ్చే వాతావరణాన్ని విచ్ఛిన్నం చేశారు. 4).అభివృద్ది వికేంద్రీకరణలో ఒక భాగమే అమరావతి..రాజధానితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ 13జిల్లాల అభివృద్ది ప్రణాళికను 04.09.2019న అప్పటి సీఎంగా చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు, చాలావరకు చేసి చూపించారు. ‘‘అభివృద్ది వికేంద్రీకరణ-రాజధానిగా అమరావతి’’ అనే శీర్షికతో చంద్రబాబు చేసిన ప్రకటన అసెంబ్లీ రికార్డులలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఒక సెటిల్డ్ ఇస్యూ...4ఏళ్లుగా సజావుగా నిర్వహిస్తున్న అంశం. సీఎం మారాడని మళ్లీ రాజధానిని మార్చే అధికారం ఉంటుందా..? కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు 650కూడా, 29రాష్ట్రాలలో 650జిల్లాలలో పెట్టమని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారా..? అదేవిధంగా ఏపిలో 175నియోజకవర్గాలలో 175ఆఫీసులు పెడతారా నియోజకవర్గానికి ఒకటి చొప్పున..? ఈ 8నెలలు ఒక్క పనిచేయకుండా, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, పనులన్నీ నిలిపేసి అభివృద్దిని రివర్స్ చేశారు, పరిపాలనను రివర్స్ చేశారు, రాష్ట్రాన్నే తిరోగమనంలో నడిపిస్తున్నారు. అబద్దాన్ని కూడా నిజంగా వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. అలాంటిది నిజాన్ని నిజంగా చెప్పడంలో వెనుకంజ సరికాదు.

5).అమరావతిని 3ముక్కలు చేసి ఒక్కో ముక్క ఒక్కో ప్రాంతంలో పెట్టడమే ముద్దు అంటూ ర్యాలీలు నిర్వహిస్తున్న అమరావతి నుంచి ఎన్నికైన వైసిపి ఎమ్మెల్యేలు రేపు అడ్రస్ లేకుండా పోతారు. రాజధాని మార్పుపై ఆందోళనకు గురై తీవ్ర ఆవేదనతో 23మంది గుండెలు ఆగాయి. వాళ్ల ఉసురు వైసిపి నేతలకే తగులుతుంది. గత 33రోజులుగా దీక్షలు,ధర్నాలు,ర్యాలీలతో ఆందోళనలు చేస్తున్నా, పండుగలు కూడా చేసుకోకుండా పస్తులు ఉంటున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించకుండా మూర్ఖంగా పోతున్నారు’’ అంటూ చర్చలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పిఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్, టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, టిడిఎల్ పి ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, గౌరివాని శ్రీనివాసులు, ఎంపి కనకమేడల రవీంద్రకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Advertisements

Latest Articles

Most Read